SRH Vs DC IPL 2025 డీసీతో పోరు.. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే SRH నెగ్గాల్సిందే.. రికార్డులు ఎవరివైపున్నాయి
IPL 2025లో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. SRH ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ అశలు సజీవంగా ఉంటాయి.

SRH Vs DC IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నేడు మరో కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే IPL 2025 సీజన్‌లో మ్యాచ్ 55లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తలపడేందుకు రెడీగా ఉంది. సన్‌రైజర్స్ 10 మ్యాచ్‌లలో కేవలం మూడు మాత్రమే గెలవడతో ప్లే ఆఫ్‌నకు అర్హత సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఇకనుంచి ప్రతి మ్యాచ్ లోనూ విజయం సాధిస్తే నాలుగో స్థానం దొరుకుతుందా అని ఫాన్స్ ఆశగా చూస్తున్నారు. ఒక్క మ్యాచ్ ఓడినా, సన్‌రైజర్స్ ఇంటి బాట పట్టాల్సిందే.
అహ్మదాబాద్‌లో జరిగిన అధిక స్కోర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 38 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓటమి పాలైంది. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని జట్టు ఈ సీజన్‌లో తీవ్ర నిరాశ పరిచారు. టాప్ ఆర్డర్ నిలకడలేమి.. మిడిలార్డర్ లో క్లాసెన్, అప్పుడప్పుడు అనికేత్ వర్మ మాత్రమే పరవాలేదనిపిస్తున్నారు. ప్లే ఆఫ్ ఆశలు సన్నగిల్లగా.. ఈ మ్యాచ్ లో కచ్చితంగా నెగ్గాలి. లేకపోతే ఇతర జట్ల ప్లే ఆఫ్ ఆశలు దెబ్బతీయడం తప్పా ఏం ఉండదు.
సీజన్ సెకండాఫ్ లో డీసీ ఇబ్బందులు పడుతోంది. చివరి ఆరు మ్యాచ్‌లలో నాలుగు ఓడిపోయింది. టోర్నమెంట్ లో నెక్ట్స్ స్టేజీకి వెళ్లాలంటే ఈ మ్యాచ్ లు కీలకం. ప్లేఆఫ్ పోటీ తీవ్రతరం అవుతున్నందున, అక్షర్ పటేల్ జట్టు మళ్లీ గాడిన పడాలని చూస్తోంది. ఈ రెండు జట్లు ఈ సీజన్ ప్రారంభంలో మ్యాచ్ లో క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొ సాధించింది.
SRH vs DC ముఖాముఖీ రికార్డు
- ఆడిన మ్యాచ్‌లు: 25
- సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచినవి: 13
- ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచినవి: 11
- టై: 1
- మొట్టమొదటి మ్యాచ్ (ఏప్రిల్ 12, 2013)
- చివరి ఫలితం: ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్లతో గెలిచింది (మార్చి 30, 2025)
ఉప్పల్ స్టేడియంలో రికార్డులు
ఆడిన మ్యాచ్‌లు: 62
గెలిచినవి: 37
ఓడినవి: 24
టై: 1
అత్యధిక స్కోర్: SRH vs RR (మార్చి, 2025) చే 286/6
తక్కువ స్కోర్: DC vs SRH (మే, 2013) చే 80/10
IPLలో ఉప్పల్ స్టేడియంలో SRH రికార్డు
ఆడిన మ్యాచ్‌లు: 62
గెలిచినవి: 37
ఓడినవి: 24
టై: 1
అత్యధిక స్కోర్: SRH vs RR (మార్చి, 2025) చే 286/6
అత్యల్ప స్కోర్: DC vs SRH (మే, 2013) చే 80/10
SRH Vs DC పోరులో అత్యధిక పరుగుల వీరులు
| ర్యాంక్ | ఆటగాళ్ళు | జట్టు(లు) | పరుగులు | సగటు | స్ట్రైక్ రేటు | అత్యధిక స్కోర్ |
| 1 | శిఖర్ ధావన్ | SRH/DC | 575 | 31.94 | 128.06 | 92* |
| 2 | డేవిడ్ వార్నర్ | SRH/DC | 570 | 31.66 | 126.38 | 92* |
| 3 | రిషబ్ పంత్ | DC | 536 | 44.66 | 146.44 | 128* |
SRH vs DC IPL మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసినవారు
| ర్యాంక్ | బౌలర్లు | జట్టు | వికెట్లు | ఎకానమీ | సగటు | ఉత్తమ ఫిగర్స్ |
| 1 | భువనేశ్వర్ కుమార్ | SRH | 18 | 7.69 | 32.05 | 2/11 |
| 2 | రషీద్ ఖాన్ | SRH | 15 | 5.70 | 18.26 | 3/7 |
| 3 | కగిసో రబాడా | DC | 14 | 9.19 | 19.92 | 4/22 |
SRH Vs DC హెడ్-టు-హెడ్ (చివరి ఐదు మ్యాచ్‌లు)
- మార్చి 30, 2025 DC (166/3) SRH (163) ని 7 వికెట్ల తేడాతో ఓడించింది.
- ఏప్రిల్ 20, 2024, SRH (266/7) DC (199) ని 67 పరుగుల తేడాతో ఓడించింది
- ఏప్రిల్ 29, 2023, SRH (197/6) DC (188/6) ని 9 పరుగుల తేడాతో ఓడించింది
- ఏప్రిల్ 24, 2023, DC (144/9) SRH (137/6) ని 7 పరుగుల తేడాతో ఓడించింది
- మే 5, 2022, DC (207/3) SRH (186/8) ని 21 పరుగుల తేడాతో ఓడించింది
SRH vs DC IPL 2025 ప్లేయింగ్ 11 ఛాన్స్ ఉన్న ప్లేయర్లు
SRH ప్లేయింగ్ 11: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, నితిష్ కుమార్ రెడ్డి, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్, జీషన్ అన్సారి, మహమ్మద్ షమీ.
ఇంపాక్ట్ ప్లేయర్: ట్రావిస్ హెడ్
DC ప్లేయింగ్ 11: ఫాఫ్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగం, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంథ చమీరా, ముకేష్ కుమార్.
ఇంపాక్ట్ ప్లేయర్ : ఆశుతోష్ శర్మ





















