By: ABP Desam | Updated at : 14 May 2023 06:58 PM (IST)
అర్థ సెంచరీ అనంతరం అభివాదం చేస్తున్న ఫాఫ్ డుప్లెసిస్ ( Image Source : IPL Twitter )
Royal Challengers Bangalore vs Rajasthan Royals: ఐపీఎల్ 2023 సీజన్ 60వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లలో ఫాఫ్ డు ఫ్లెసిస్ (55: 44 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (54: 33 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు.
టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ బెంగళూరుకు శుభారంభాన్ని అందించారు. వీరు మొదటి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఈ దశలో వేగంగా ఆడే ప్రయత్నం చేసిన విరాట్ కోహ్లీ భారీ షాట్‌కు ప్రయత్నించి కేఎం ఆసిఫ్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ చేతికి చిక్కాడు.
దీంతో మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్‌కు వన్ డౌన్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ జత కలిశాడు. వీరు భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ప్రాసెస్‌లోనే ఫాఫ్ డుప్లెసిస్ అర్థ శతకం కూడా పూర్తయింది. ఈ సీజన్‌లో డుప్లెసిస్‌కు ఇది ఏడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించాక మళ్లీ కేఎం ఆసిఫే బెంగళూరును దెబ్బ కొట్టాడు. ఫాఫ్‌ను అవుట్ చేసి రాజస్తాన్‌కు రెండో వికెట్ అందించాడు.
ఆ తర్వాత వచ్చిన లోమ్రోర్, దినేష్ కార్తీక్ విఫలం అయ్యారు. అర్థ సెంచరీ అనంతరం గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా అవుట్ అయ్యాడు. అయితే ఆఖర్లో అనుజ్ రావత్ మెరుపులు మెరిపించడంతో బెంగళూరు ఈ వికెట్‌పై మంచి స్కోరు సాధించింది. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో ఆడం జంపా, కేఎం ఆసిఫ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. సందీప్ శర్మకు ఒక వికెట్ దక్కింది.
పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్ ఐదో స్థానంలోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధిస్తే మూడో స్థానంలోకి వెళ్లనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిస్తే నెట్ రన్‌రేట్‌ను బట్టి ఐదో స్థానం వరకు చేరవచ్చు. అయితే ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే మాత్రం రెండు జట్లకూ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా కీలకం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
విజయ్‌కుమార్ వైషాక్, ఫిన్ అలెన్, షాబాజ్ అహ్మద్, హిమాన్షు శర్మ, సుయాష్ ప్రభుదేశాయ్
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శామ్సన్ (కెప్టెన్, వికెట్ కీపర్), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, KM ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్
రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్, డోనావన్ ఫెరీరా, నవదీప్ సైనీ.
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా