అన్వేషించండి

IPL 2024: కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ - రికార్డుల్లో పైచేయి ఎవరిదో తేలేది నేడే

RR vs KKR: ఇప్పటివరకూ కోల్‌కత్తా-రాజస్థాన్‌ 29 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో కోల్‌కత్తా 14 విజయాలు నమోదు చేయగా, రాజస్థాన్‌ కూడా అన్నే విజయాలు పొందింది అందుకే రికార్డుల్లో పైచేయి ఈరోజు తేలనుంది

Rajasthan Royals Vs Kolkata Knight Riders: ఐపీఎల్‌(IPL)లో అగ్ర జట్ల మధ్య మరో ఆసక్తికర సమరం జరగనుంది. అగ్రస్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్(KKR)... రెండో స్థానంలో ఉన్న  రాజస్థాన్ రాయల్స్‌(RR)తో అమీతుమీ తేల్చుకోనుంది. 70వ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శనలతో రెండు జట్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. కోల్‌కత్తా  అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్‌ పట్టికలో రెండో స్థానంలో ఉంది.

కోల్‌కత్తాకు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. సునీల్ నరైన్ దూకుడుగా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రఘువంశీ, రమణదీప్ సింగ్, రింకూ సింగ్ వంటి బ్యాటర్లు ఉన్నారు. కోల్‌కత్తాకు ఆండ్రీ రస్సెల్ ఉన్నాడు. మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలతో కోల్‌కత్తాకు బలమైన బౌలింగ్ ఉంది.


హెడ్-టు-హెడ్ రికార్డులు:
ఇప్పటివరకూ ఐపీఎల్‌లో కోల్‌కత్తా-రాజస్థాన్‌ 29 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో కోల్‌కత్తా 14 విజయాలు నమోదు చేయగా.. రాజస్థాన్‌ 14 విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. రాజస్థాన్‌పై అప్పటి కోల్‌కత్తా ప్లేయర్‌ దినేష్ కార్తీక్ అత్యధిక పరుగులు నమోదు చేశాడు. కార్తిక్‌ 8 మ్యాచుల్లో 68 బ్యాటింగ్ సగటుతో 150.28 స్ట్రైక్ రేట్‌తో 272 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. KKRలో ప్రస్తుత బ్యాటర్లలో నితీష్ రాణా 11 ఇన్నింగ్స్‌ల్లో 24.89 బ్యాటింగ్ సగటుతో 224 పరుగులు చేశాడు. రాజస్థాన్‌పై శివమ్‌ మావి కోల్‌కత్తా తరపున ఆడుతూ అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. 8 మ్యాచ్‌ల్లో మావి 13 వికెట్లు పడగొట్టాడు. కోల్‌కత్తా ప్రస్తుత బౌలర్లలో, స్టార్ స్పిన్నర్ సునీల్‌ నరైన్‌ 18 ఇన్నింగ్స్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు.

అత్యధిక పరుగులు
2024లో రాజస్థాన్‌పై కోల్‌కత్తా 223 పరుగులు నమోదు చేసింది. ఇదే రాజస్థాన్‌పై కోల్‌కత్తాకు అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా ఓడిపోయింది.

ఊపేసిన గత మ్యాచ్‌
జోస్ బట్లర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఓటమి ఖాయమని అందరూ అనుకున్న వేళ వీరోచిత శతకంతో ఒంటి చేత్తో రాజస్థాన్ కు విజయం అందించాడు. మిగతా బ్యాటర్ లు ఎవరూ మద్దతు ఇవ్వకపోయినా చివరి వరకు క్రీజ్ లో నిలచిన బట్లర్ తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా... సునీల్‌ నరైన్‌ శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అనంతరం 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ జోస్ బట్లర్ అద్భుత శతకంతో చివరి బంతికి విజయాన్ని అందుకుంది. బట్లర్ 60 బంతుల్లో 9 ఫోర్ లు, 6 సిక్సర్ లతో 107 పరుగులు చేసి రాజస్థాన్ కు విజయాన్ని అందించాడు

జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), KS భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్,  చక్రవర్తి, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, అనుకుల్ సింగ్, వరుణ్‌దీప్, రమణదీప్, హర్షిత్ రాణా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా గుస్ అట్కిన్సన్, అల్లా గజన్‌ఫర్.

రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్‌), అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్, నాంద్రే బర్గర్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, శుభమ్ దూబే పావెల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, తనుష్ కోటియన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget