RCB Vs DC: చివర్లో తడబడ్డ బెంగళూరు - చిన్నస్వామిలో విజయానికి ఢిల్లీ ఎంత కొట్టాలి?
ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
Royal Challengers Bangalore vs Delhi Capitals: ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆఖరి ఓవర్లలో తడబడింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మిషెల్ మార్ష్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ఫ్లెసిస్ (22: 16 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) అదిరిపోయే ఆరంభం అందించారు. మొదటి వికెట్‌కు 4.4 ఓవర్లలోనే 42 పరుగులు జోడించారు. ఫాఫ్‌ను అవుట్ చేసి మిషెల్ మార్ష్ ఢిల్లీకి తొలి వికెట్ అందించాడు.
బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ అందుకుని ముందుకు వచ్చిన మహిపాల్ లోమ్రోర్ (26: 18 బంతుల్లో, రెండు సిక్సర్లు), విరాట్‌తో కలిసి వేగంగా ఆడాడు. వీరు రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ఈ లోపే కింగ్ కోహ్లీ 33 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ హాఫ్ సెంచరీ చేసిన తర్వాతి బంతికే అవుటయి పెవిలియన్ బాట పట్టాడు. కాసేపటికే లోమ్రోర్ కూడా అవుటయ్యాడు. మ్యాక్స్‌వెల్ (24: 14 బంతుల్లో, మూడు సిక్సర్లు) కాసేపు సిక్సర్లతో అలరించాడు. కానీ బెంగళూరు మూడు వరుస బంతుల్లో మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆఖర్లో అనూజ్ రావత్ (15: 22 బంతుల్లో, ఒక ఫోర్) వేగంగా ఆడలేకపోయాడు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులకు పరిమితం అయింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
పృథ్వీ షా, ముఖేష్ కుమార్, ప్రవీణ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్, చేతన్ సకారియా
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
సుయాష్ ప్రభుదేసాయి, డేవిడ్ విల్లీ, ఆకాష్ దీప్, కర్ణ్ శర్మ, అనుజ్ రావత్
A collective effort by the @DelhiCapitals bowlers helps restrict #RCB to 174-6 🙌
— IndianPremierLeague (@IPL) April 15, 2023
Virat Kohli with another 5️⃣0️⃣
Mitchell Marsh and Kuldeep Yadav with 2️⃣ wickets each 👏
Scorecard ▶️ https://t.co/xb3InbFbrg #TATAIPL | #RCBvDC pic.twitter.com/g7AddC71wt
For his momentum-changing spell with 2️⃣ crucial wickets, @imkuldeep18 becomes our 🔝 performer from the first innings of the #RCBvDC clash in the #TATAIPL 👌🏻👌🏻
— IndianPremierLeague (@IPL) April 15, 2023
A look at his bowling summary🔽 pic.twitter.com/xbsfmlzWTD