అన్వేషించండి

Praful Hinge Social Media : ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌ !మైదానంలో వికెట్ల వేటతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సునామీ!

Praful Hinge Social Media : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తరఫున మొదటి మ్యాచ్ ఆడిన 24 పేసర్‌ ప్రఫుల్ గ్రౌండ్‌లో సంచలనం సృష్టించాడు. దీంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సునామీ సృష్టించాడు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐపీఎల్‌లో ప్రఫుల్‌ హింగే అరంగేట్రం, తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు.
  • మొదటి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌ను మార్చేశాడు.
  • రాత్రికి రాత్రే అతని సోషల్‌ మీడియా ఫాలోవర్లు లక్షల్లో పెరిగారు.
  • ఫాలోవర్లు పెరగడంతో బ్రాండ్ వాల్యూ, సంపాదన భారీగా పెరిగింది.

Praful Hinge Social Media : ఐపీఎల్‌ అంటేనే అసాధ్యాలను సుసాధ్యం చేసే వేదిక. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రతిభను వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేసే మెగా ఈవెంట్. అలాంటి అద్భుతం సోమవారం రాత్రి జరిగింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఒక సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. అతనే విదర్భకు చెందిన ప్రఫుల్‌ హింగే. 

కేవలం 30 లక్షల కనీస ధరకే వేలంలో అమ్ముడైన ఈ కుర్రాడు తన మొదటి మ్యాచ్‌లోనే రాజస్థాన్ వంటి బలమైన జట్టును గడగడలాడించాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే బంతిని అందుకున్న హింగే, తన తొలి ఓవర్‌లోనే ముగ్గురు కీలక బ్యాటర్లను సున్నా పరుగులకే పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను సాధించాడు. వైభవ్‌ సూర్యవన్షీ, ధ్రువ్‌ జురెల్, లువాన్‌ డ్రే ప్రిటోరియస్‌ వంటి మేటి ఆటగాళ్లు హింగే ధాటికి వికెట్లు సమర్పించుకున్నారు. ఆ తర్వాత తన రెండో ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌ రియాన్ పరాగ్‌ను కూడా అవుట్ చేసి మొత్తం అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 

రాత్రి రాత్రే హీరోగా మారిన ప్రఫుల్ 

ప్రఫుల్ హింగే మైదానంలో వికెట్లు తీస్తుంటే, సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్‌ సంఖ్య రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు అతని ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో కేవలం  3 వేల మంది ఫాలోవర్స్‌ మాత్రమే ఉండేవారు. సగటు క్రికెట్ అభిమానికి అతని పేరు కూడా తెలియదు. కానీ, అతను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు అందుకునే సమయానికి ఆ సంఖ్య 1.61 లక్షలకు చేరింది. 

మంగళవారం ఉదయానికి ప్రఫుల్‌ ఫాలోవర్ల సంఖ్య 2.35 లక్షలు దాటిపోయింది. అంటే దాదాపు 9,900 శాతం వృద్ధి నమోదైంది. డిజిటల్‌ మీడియా చరిత్రలో ఒక అథ్లెట్‌కు ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో ఫాలోయింగ్‌ పెరగడం అరుదైన విషయం. 

భారీగా పెరిగిన బ్రాండ్ వాల్యూ

ఈ సోషల్ మీడియా క్రేజ్‌ కేవలం లైకులు, కామెంట్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది ప్రఫుల్‌ హింగే ఆర్థిక స్థితిగతులను కూడా ప్రభావితం చేస్తోంది. మార్కెటింగ్ ఏజెన్సీల అంచనాల ప్రకారం, ప్రఫుల్ ఇప్పుడు నానో ఇన్‌ప్లుయెన్సర్‌ స్థాయి నుంచి మిడ్ టైర్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కేటగిరిలోకి ప్రవేశించాడు. గతంలో ఉన్న ఫాలోవర్స్‌తో ఏదైనా బ్రాండ్ అతన్ని సంప్రదిస్తే ఒక్క పోస్ట్‌కు 2 వేల నుంచి 10 వేల వరకు మాత్రమే లభించే అవకాశం ఉంది. ఇప్పుడు భారీగా ఫాలోవర్స్ కారణంగా అతను 75వేల నుంచి 2.5లక్షల వరకు డిమాండ్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా 80వేల నుంచి 2.5 లక్షలు, అలాగే షార్ట్ టర్మ్‌ స్టోరీ టేకోవర్ల ద్వారా 30 వేల నుంచి 80 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. 

ప్రస్తుతం ప్రఫుల్‌ హింగే ఖాతాలో ఎంగేజ్‌మెంట్‌ రేట్‌  చాలా ఎక్కువగా ఉంది. ఇది బ్రాండ్లకు చాలా ఆకర్షణీయమైన అంశం. కొత్తగా వైరల్ అయిన అకౌంట్లపై ప్రజలు చూపే ఆసక్తిని బ్రాండ్లు క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నాయి.           

Frequently Asked Questions

ఐపీఎల్‌లో ప్రఫుల్ హింగే ఎవరిని ఔట్ చేశాడు?

ప్రఫుల్ హింగే తన మొదటి మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవన్షి, ధ్రువ్ జురెల్, లువాన్ డ్రే ప్రిటోరియస్, మరియు కెప్టెన్ రియాన్ పరాగ్‌లను ఔట్ చేశాడు.

ప్రఫుల్ హింగేకి సోషల్ మీడియాలో ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు?

మ్యాచ్ ప్రారంభానికి ముందు 3 వేల మంది ఫాలోవర్లు ఉండగా, మ్యాచ్ తర్వాత 2.35 లక్షలకు పైగా పెరిగింది. ఇది దాదాపు 9,900 శాతం వృద్ధి.

ప్రఫుల్ హింగే సోషల్ మీడియా ఫాలోయింగ్ అతని బ్రాండ్ వాల్యూను ఎలా ప్రభావితం చేసింది?

ఒక పోస్ట్‌కు 75 వేల నుండి 2.5 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా 80 వేల నుండి 2.5 లక్షలు, షార్ట్ టర్మ్‌ స్టోరీల ద్వారా 30 వేల నుండి 80 వేల వరకు సంపాదించవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Embed widget