(Source: ECI | ABP NEWS)
PBKS Retained Players 2026: మాక్స్వెల్ సహా 5 మంది ఆటగాళ్లను విడుదల చేసిన పంజాబ్, PBKS రిటెన్షన్ లిస్ట్ చూశారా
PBKS Retention List 2026: పంజాబ్ కింగ్స్ 21 మందిని రిటైన్ చేసుకుంది, 5 మందిని విడుదల చేసింది. గ్లెన్ మాక్స్వెల్ ను తొలగించగా, జోష్ ఇంగ్లిస్ ను విడుదల చేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

PBKS Retained Players 2026: పంజాబ్ కింగ్స్ రిటెన్షన్ జాబితా చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. గత సీజన్లో రాణించిన జోష్ ఇంగ్లిస్‌ను కూడా విడుదల చేసింది. గ్లెన్ మాక్స్‌వెల్‌తో సహా పంజాబ్ కింగ్స్ మొత్తం 5 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో సహా 21 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇప్పుడు పంజాబ్ జట్టు వేలంలో గరిష్టంగా 4 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.
డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 226) మినీ వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ తమ రిటెయిన్ చేసుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. బీసీసీఐ ఇచ్చిన గడువు నవంబర్ 15న ముగియనుంది. దాంతో మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ తుది జట్లను భారత క్రికెట్ నయంత్రణ మండలికి ఇటీవల సమర్పించాయి. దాంతో పంజాబ్ జట్టులో ఎవరు కొనసాగుతారు, ఎవరిని వేలంలోకి వదిలేసింది, ట్రేడ్ డీల్ జరిగాయా అనే వివరాలు విడుదల చేశారు.
🚨 PBKS HAS RELEASED JOSH INGLIS 🚨 pic.twitter.com/U3uwZb7YmY
— Johns. (@CricCrazyJohns) November 15, 2025
పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే
గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, కుల్దీప్ సేన్, ఆరోన్ హార్డీ.
పంజాబ్ నిలుపుకున్న ఆటగాళ్ల జాబితా..
ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముషీర్ ఖాన్, ప్యాలా అవినాష్, హర్నూర్ పన్ను, మిచెల్ ఓవెన్, సూర్యాంష్ షెడ్జ్, జేవియర్ బార్ట్‌లెట్, లాకీ ఫెర్గూసన్, వైశక్ విజయ్‌కుమార్, విష్ణు వినోద్, యష్ ఠాకూర్.
పంజాబ్ కింగ్స్ విడుదల చేయబడిన ఆటగాళ్లలో స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ గత సీజన్లో 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడి గాయంతో వైదొలిగాడు. మాక్స్‌వెల్ ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు, వాటిలో 30 పరుగులు ఒకే ఇన్నింగ్స్‌లో చేశాడు. వరుస వైఫల్యాలు జట్టుకు నష్టాన్ని మిగిల్చింది. జోష్ ఇంగ్లిస్ గత ఎడిషన్‌లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు, 11 మ్యాచ్‌ల్లో 162.57 స్ట్రైక్ రేట్‌తో 278 పరుగులు చేసినా పంజాబ్ జట్టు అతడ్ని సైతం వేలంలోకి వదిలేసింది. మ్యాక్స్‌వెల్ విషయానికి వస్తే అతడు ఆస్ట్రేలియా తరఫున పరుగులు సాధించేవాడు. అటు బంతితోనూ మ్యాజిక్ చేసి గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఐపీఎల్ విషయానికి వస్తే మ్యాక్స్‌వెల్ ఎప్పుడూ ఆడింది లేదు. ఏ ఫ్రాంచైజీకి ఆడినా అతడు నమ్మకమైన ఆటగాడిగా నిలవలేకపోయాడు. పలు కీలక సందర్భాల్లోనూ విఫలమై ఫ్రాంచైజీలు మారుతున్నాడు.





















