అన్వేషించండి

IPL 2024: బెంగళూరు పతనాన్ని శాసించిన బుమ్రా, ముంబై లక్ష్యం 197

MI vs RCB : ముంబయితో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

MI vs RCB IPL 2024 Mumbai Target 197: ముంబై ఇండియన్స్‌(MI)తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) పోరాడే స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 196పరుగులు చేసింది.  బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పైనా బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. బెంగళూరు సారధి ఫాఫ్‌ డుప్లెసిస్‌, రజత్‌ పటిదార్‌ అర్ధ శతకాలతో మెరిశారు. విరాట్‌ కోహ్లీ మరోసారి నిరాశ పరిచాడు. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ముంబై బౌలర్లలో బుమ్రా అయిదు వికెట్లు తీయగా... కోయిట్జే, మద్వాల్‌ గోపాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. బుమ్రా అద్భుత బౌలింగ్‌తో బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేశారు.  బుమ్రా నాలుగు ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీశాడు. దినేశ్‌ కార్తిక్‌ 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ లతో 53 పరుగులు చేశాడు. 

డుప్లెసిస్‌, పటిదార్‌ వల్లే..
ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు శుభారంభం లభించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్‌ కోహ్లీని బుమ్రా అవుట్‌ చేశాడు. బుమ్రా వేసిన ఇన్‌స్వింగర్‌.. కోహ్లీ బ్యాట్‌ను తాకుతూ కీపర్‌ దగ్గరికి వెళ్లగా... ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో 14 పరుగుల వద్ద బెంగళూరు కోహ్లీ వికెట్‌ను కోల్పోయింది. తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం మూడే పరుగులు చేసి కోహ్లీ వెనుదిరిగాడు. కాసేపటికే విల్‌ జాక్స్‌ కూడా అవుటయ్యాడు. దీంతో బెంగళూరు 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఫాఫ్‌ డుప్లెసిస్‌, రజత్‌ పాటిదార్‌ బెంగళూరును ఆదుకున్నారు. వరుసగా విఫలమవుతున్న రజత్‌ పాటిదార్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. డుప్లెసిస్‌ 40 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లో 61 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. 26 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో రజత్‌ పాటిదార్‌ 50 పరుగులు చేసి అవుటయ్యాడు. పటిదార్‌ను కోయెట్జే అవుట్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌ మరోసారి నిరాశపరిచాడు. నాలుగు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు. తర్వాత సౌరవ్‌ చౌహాన్‌ను కూడా బ్రుమా అవుట్‌ చేశాడు. కానీ దినేశ్‌ కార్తీక్‌ బెంగళూరుకు పోరాడే స్కోరును అందించాడు. దినేశ్‌ కార్తిక్‌ 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ లతో 53 పరుగులు చేశాడు.  బుమ్రా అయిదు వికెట్లతో బెంగళూరు పతనాన్ని శాసించాడు. 

రికార్డులు ఇలా
ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 32 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై 18 మ్యాచుల్లో విజయం సాధించగా.... బెంగళూరు 14 మ్యాచుల్లో విజయం సాధించింది. అన్ని మ్యాచుల్లోనూ ఫలితం వచ్చింది. ముంబైపై బెంగళూరు అత్యధిక స్కోరు 235 పరుగులు కాగా... బెంగళూరుపై ముంబై అత్యధిక స్కోరు 213 పరుగులు. బెంగళూరు అత్యల్ప స్కోరు 122 పరుగులు కాగా.. ముంబై అత్యల్ప స్కోరు 111 పరుగులు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచుల్లో విరాట్ కోహ్లీ, AB డివిలియర్స్ అద్భుత గణాంకాలు కలిగి ఉన్నారు. ముంబైపై విరాట్‌ కోహ్లీ ఇప్పటివరకూ 852 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ 786 పరుగులు చేశాడు. ముంబై తరుపున కెప్టెన్ రోహిత్ శర్మ 793 పరుగులు, కీరన్ పొలార్డ్ 551 పరుగులు చేశారు. బౌలర్లలో ముంబై స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా 24 వికెట్లు తీయగా, యుజ్వేంద్ర చాహల్ 22 వికెట్లు తీశాడు. హర్భజన్ సింగ్ 18 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.

టాప్ హెడ్ లైన్స్

Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Embed widget