MI Vs CSK, IPL 2022 LIVE: ముంబైపై పేలిన ధోని గన్ - మూడు వికెట్లతో చెన్నై విజయం
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
LIVE
Background
ఐపీఎల్ 2022లో 33వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడుతున్నాయి. డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఉత్కంఠ తారాస్థాయికి చేరుతుంది. మరి నేటి మ్యాచ్‌లో ఎవరిది పైచేయి?
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 14 సీజన్లు జరగ్గా... ముంబై ఇండియన్స్ 5, చెన్నై సూపర్‌కింగ్స్ 4 సార్లు ట్రోఫీని దక్కించుకున్నాయి. వీరిద్దరే 9 కప్పులు పంచుకున్నారంటే ఎంత నిలకడైన జట్లో అర్థం చేసుకోవచ్చు. అందుకే వీరు తలపడే మ్యాచులను 'ఎల్ క్లాసికో' అంటుంటారు. అలాంటిది ఈ సారి ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్నాయి. సీఎస్‌కే ఆరు మ్యాచులాడి ఒకటి గెలిస్తే ముంబయి ఏకంగా ఆరుకు ఆరూ ఓడిపోయింది.
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఏకంగా 32 సార్లు తలపడ్డాయి. ఇన్ని మ్యాచ్‌లు మరే రెండు జట్ల మధ్యా జరగలేదు. చెన్నై సూపర్‌కింగ్స్‌పై స్పష్టంగా ముంబైదే ఆధిపత్యం. ఏకంగా 19 మ్యాచ్‌ల్లో ఎంఐ గెలిచింది.
చెన్నై సూపర్‌కింగ్స్‌ను డెత్ ఓవర్లలో అడ్డుకొనేందుకు బుమ్రా ఉపయోగపడతాడు. ఎంఎస్ ధోనీ, శివమ్ దూబేకు అతడిపై మెరుగైన రికార్డు లేదు. ఒకసారి డ్వేన్ బ్రావో బాగానే ఆడాడు కానీ మిగతా మ్యాచుల్లో ఇబ్బంది పడ్డాడు. మరోవైపు సీఎస్‌కేపై కీరన్ పొలార్డ్ బౌలింగ్ బాగుంటుంది. ఏకంగా 14 వికెట్లు తీశాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ను అడ్డుకోవడంలో రవీంద్ర జడేజా సక్సెస్ అయ్యాడు. వీరిద్దరినీ అతడు కంట్రోల్‌లో ఉంచగలడు.
ముంబయి ఇండియన్స్ తుదిజట్టు (అంచనా)
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, డివాల్డ్ బ్రూవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ /టిమ్ డేవిడ్, ఫాబియన్ అలన్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, తైమల్ మిల్స్ /రిలే మెరిడీత్, జయదేవ్ ఉనద్కత్
చెన్నై సూపర్‌కింగ్స్ తుదిజట్టు (అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్ / డ్వేన్ ప్రిటోరియస్, మహేశ్ థీక్షణ, ముకేశ్ చౌదరి
View this post on Instagram
MI Vs CSK Live Updates: 20 ఓవర్లలో చెన్నై స్కోరు 156-7, మూడు వికెట్లతో చెన్నై విజయం
జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. చివరి బంతికి బౌండరీ కొట్టి ధోని గెలిపించాడు. దీంతో చెన్నై మూడు వికెట్లతో విజయం సాధించింది.
మహేంద్ర సింగ్ ధోని 28(13)
డ్వేన్ ప్రిటోరియస్ 1(1)
జయదేవ్ ఉనద్కత్ 4-0-48-2
MI Vs CSK Live Updates: 19 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 139-6
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 139-6గా ఉంది.
మహేంద్ర సింగ్ ధోని 12(9)
డ్వేన్ ప్రిటోరియస్ 22(13)
జస్‌ప్రీత్ బుమ్రా 4-0-29-0
MI Vs CSK Live Updates: 18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 128-6
జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 128-6గా ఉంది.
మహేంద్ర సింగ్ ధోని 11(8)
డ్వేన్ ప్రిటోరియస్ 12(8)
జయదేవ్ ఉనద్కత్ 3-0-31-1
MI Vs CSK Live Updates: 17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 114-6
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 114-6గా ఉంది.
మహేంద్ర సింగ్ ధోని 5(5)
డ్వేన్ ప్రిటోరియస్ 4(5)
జస్‌ప్రీత్ బుమ్రా 3-0-18-0
MI Vs CSK Live Updates: 16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 108-6
రైలే మెరెడిత్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. రవీంద్ర జడేజా అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 108-6గా ఉంది.
మహేంద్ర సింగ్ ధోని 2(2)
డ్వేన్ ప్రిటోరియస్ 2(2)
రైలే మెరెడిత్ 4-0-25-1