అన్వేషించండి

IPL 2024: ధోనీ మెరుపులు ! వాంఖడేలో అరుపులు, ముంబై లక్ష్యం 207

MI vs CSK: కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌.,.. శివమ్‌ దూబే మెరుపు బ్యాటింగ్‌తో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది.

Mumbai Indian target 207:   ముంబై(MI)తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK) భారీ స్కోరు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌.,.. శివమ్‌ దూబే మెరుపు బ్యాటింగ్‌తో చెన్నై భారీ స్కోరు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ 69, శివమ్ దూబే 66 పరుగులతో మెరుపు బ్యాటింగ్‌ చేశారు. ముంబై బౌలర్లు వికెట్లు తీయకపోయినా భారీగా పరుగులు మాత్రం సమర్పించుకోలేదు. చివర్లో ధోనీ మెరుపులు మెరిపించాడు. కేవలం నాలుగు బంతులు ఎదుర్కొన్న ధోనీ మూడు సిక్సులు, రెండు పరుగులతో 20 పరుగులు చేశాడు. ధోనీ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు వాంఖడే మార్మోగిపోయింది. 
 
దూబే, గైక్వాడ్‌ జోరు
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ అజింక్యా రహానే రెండో ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. ఎనిమిది బంతుల్లో ఒక ఫోర్‌తో అయిదు పరుగులు చేసిన రహానేను... కోయిట్జే అవుట్‌ చేశాడు. పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చి రహానే పెవిలియన్‌ చేరాడు. అనంతరం రచిన్‌ రవీంద్ర-రుతురాజ్‌ గైక్వాడ్‌ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కీలకమైన 52 పరుగులు జోడించారు. బలపడుతున్న ఈ జోడీని శ్రేయస్స్‌ గోపాల్ విడదీశాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 21 పరుగులు చేసిన రచిన్‌ రవీంద్ర.... శ్రేయస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో ఇషాన్‌కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అనంతరం రుతురాజ్‌ గైక్వాడ్‌- శివమ్‌ దూబే ముంబై బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. ఆరంభంలో కాస్త తడబడ్డ ఈ ఇద్దరు బ్యాటర్లు క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో అలరించారు. ఈ క్రమంలో చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 33 బంతుల్లో ఆర్థ శతకం అందుకున్నాడు. కొయిట్జే వేసిన ఓవర్‌లో నాలుగో బంతిని సిక్స్‌ బాది రుతురాజ్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. శివమ్‌ దూబే కూడా ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. రొమారియో షెపర్డ్‌ వేసిన 14వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదాడు. ఈ క్రమంలో శివమ్ దూబే కేవలం 28 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దూబే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే రుతురాజ్‌ అవుట్‌ అయ్యాడు. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో రుతురాజ్ అవుటయ్యాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ 40 బంతుల్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో  69 పరుగులు చేశాడు. చివరి వరకూ క్రీజులో నిలిచిన శివమ్ దూబే 38 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డేరిల్‌ మిచెల్‌ 14 బంతుల్లో 17 పరుగులు చేసి అవుటయ్యాడు. ధోనీ చివర్లో మెరుపులు మెరిపించాడు. చివర్లో ధోనీ మెరుపులు మెరిపించాడు. కేవలం నాలుగు బంతులు ఎదుర్కొన్న ధోనీ మూడు సిక్సులు, రెండు పరుగులతో 20 పరుగులు చేశాడు. ధోనీ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు వాంఖడే మార్మోగిపోయింది. రుతురాజ్‌ గైక్వాడ్‌, దూబే, ధోనీ చెలరేగడంతో చెన్నై  నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
 
ఆత్మ విశ్వాసంతో ముంబై 
ఈ ఐపీఎల్‌ను పరాజయాలతో ప్రారంభించిన ముంబై వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి గాడినపడింది. సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చిన తర్వాత ముంబై బ్యాటింగ్‌ చాలా బలంగా మారింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్య విధ్వంసమే సృష్టించాడు. 
కేవలం 17 బంతుల్లో అర్ధశతకం చేసి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు. ఇప్పుడు చెన్నైపై సూర్య ఎలా ఆడతాడో వేచి చూడాలి. వాంఖడేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో దాదాపు 200 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో నాలుగు ఓవర్లు ఉండగానే ఛేదించింది. ముంబై బ్యాటర్లను చెన్నై బౌలర్లు ఎలా నిలువరిస్తారో చూడాలి. ఇషాన్ కిషన్ 161 పరుగులు, రోహిత్ విధ్వంసం, పాండ్యా లతో ముంబై బ్యాటింగ్‌ కూడా బలంగానే ఉంది.

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget