అన్వేషించండి

LSG Vs MI: క్వాలిఫయర్-2కు ముంబై ఇండియన్స్ - లక్నోను నట్టేట ముంచిన నెహాల్!

ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 81 పరుగులతో విజయం సాధించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది.

Lucknow Super Giants vs Mumbai Indians Eliminator: ఐపీఎల్‌ 2023 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ భారీ విజయం సాధించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ 81 పరుగులతో విజయం సాధించింది. మే 26వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్స్ ఆడనుంది.

లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్ తన స్పెల్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక ముంబై బ్యాటర్లలో కామెరాన్ గ్రీన్ (41: 23 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

లక్నో రనౌట్...
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఏ దశలోనూ టార్గెట్ దిశగా ప్రయాణించలేదు. స్కోరు 23 పరుగులు చేరుకునే సరికే ఓపెనర్లు కైల్ మేయర్స్, ప్రేరక్ మన్కడ్ ఇంటి బాట పట్టారు. వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ కాసేపు క్రీజులో నిలబడ్డారు. స్టోయినిస్ వేగంగా ఆడగా, తనది కాని ప్లేస్‌లో వచ్చిన కృనాల్ పాండ్యా క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డాడు.

కృనాల్ పాండ్యాను పీయూష్ చావ్లా అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఆయుష్ బడోని, డేంజరస్ నికోలస్ పూరన్‌లను ఆకాష్ మధ్వాల్ ఒకే ఓవర్లో అవుట్ చేసి లక్నోను చావు దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత లక్నోలో రనౌట్ల పర్వం మొదలైంది. మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతం, దీపక్ హుడా ముగ్గురూ ఘోరంగా రనౌటయ్యారు. రవి బిష్ణోయ్, మొహ్‌సిన్ ఖాన్‌లను మధ్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది.

సమష్టిగా రాణించిన ముంబై
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (11: 10 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), ఇషాన్ కిషన్ (15: 12 బంతుల్లో, మూడు ఫోర్లు) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో 38 పరుగులకే ముంబై ఇండియన్స్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కామెరాన్ గ్రీన్ (41: 23 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), సూర్యకుమార్ యాదవ్ (33: 20 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) ముంబైని ఆదుకున్నారు. వీరు మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేసి నవీన్ ఉల్ హక్ ముంబైని గట్టి దెబ్బ కొట్టాడు.

తిలక్ వర్మ (26: 22 బంతుల్లో, రెండు సిక్సర్లు), టిమ్ డేవిడ్ (13: 13 బంతుల్లో, ఒక ఫోర్) కాసేపు క్రీజులో నిలబడ్డారు కానీ వేగంగా ఆడలేకపోయారు. ఆఖర్లో నేహాల్ వధేరా (23: 12 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) చెలరేగి ఆడటంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ నాలుగు, యష్ ఠాకూర్ వికెట్లు పడగొట్టారు. మొహ్‌సిన్ ఖాన్‌కు ఒక వికెట్ దక్కింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
Crime News: శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది -  ఇది దృశ్యం కాదు అదృశ్యం !
శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది - ఇది దృశ్యం కాదు అదృశ్యం !
Prabhas: బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
Kiran Abbavaram: చెన్నైలో తెలుగు షోలకు స్క్రీన్లు ఇవ్వట్లేదు... తమిళ ఇండస్ట్రీ వైఖరిపై కిరణ్‌ అబ్బవరం ఆవేదన
చెన్నైలో తెలుగు షోలకు స్క్రీన్లు ఇవ్వట్లేదు... తమిళ ఇండస్ట్రీ వైఖరిపై కిరణ్‌ అబ్బవరం ఆవేదన
Embed widget