IPL 2024 Auction: స్టార్క్, కమిన్స్‌కు ఇచ్చిన ఆఫర్‌పై మాజీల విస్మయం- మనోళ్లు ఎందులో తక్కువని ప్రశ్న
Aakash Chopra: విరాట్ కోహ్లీ ఆర్సీబీని వీడి వేలం బరిలో నిలిస్తే రూ.42 కోట్ల ధర పలుకుతాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మినీ వేలం(Auction 2024) ముగిసింది. ఈ వేలంలో మొత్తం 72 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా(Australia) ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) అత్యంత ఖరీదైనదిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్(Pat Cummins) రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) కొనుగోలు చేసింది. వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా హర్షల్ పటేల్(Harshal Patel) నిలిచాడు. పంజాబ్ కింగ్స్(Punjab Kings) అతడిని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. యూపీ(UP) తరఫున ఆడిన సమీర్ రిజ్వీ (Sameer Rizvi)అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్(Uncapped Player). సమీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) 8.40 కోట్లకు కొనుగోలు చేసింది.
మాజీల ఆగ్రహం
అయితే ఈ వేలం మాత్రం ఎంతో మంది భారత ఫ్యాన్స్‌ను నిరాశపర్చింది. ఇతర దేశాల ఆటగాళ్లకు ఈ స్థాయిలో ధర పలకడం పట్ల టీమిండియా ఫ్యాన్స్, టీమిండియా మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఒక్కో ఫ్రాంఛైజీ(Franchise) ఆటగాళ్ల కోసం రూ.100 కోట్ల పర్సు ఉంటుంది. అందులో దాదాపు 25 శాతం ఒక్క ప్లేయర్ కోసమే వెచ్చించడం ఎంత వరకు కరెక్టని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Akash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆర్సీబీ(RCB)ని వీడి వేలం బరిలో నిలిస్తే రూ.42 కోట్ల ధర పలుకుతాడని ఆకాశ్ చోప్రా అన్నాడు. మిచెల్ స్టార్క్ మొత్తం 14 గేమ్‌లు ఆడి పూర్తి కోటా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తే అతడు వేసే ఒక్కో బంతి విలువ సుమారు రూ.7,60,000 అవుతుందని... ఇది ఆశ్చర్యకరంగా ఉందని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అని. అతడికి రూ.12 కోట్లు చెల్లిస్తే స్టార్క్‌కి దాదాపు రూ.25 కోట్లు ఇస్తున్నారని ఆకాశ్ అన్నాడు. ఇలా చేయడం తప్పన్నాడు. మహమ్మద్ షమీ, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి ప్లేయర్లు స్టార్క్, కమిన్స్ కంటే తక్కువ మొత్తం తీసుకుంటున్నారని వ్యాఖ్యానించాడు.
వాళ్లు చేసిన తప్పేంటీ?
ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని.. ఒకరికి చాలా తక్కువ, మరొకరికి భారీ మొత్తం జీతం ఎలా వస్తుందని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. ఒకవేళ బుమ్రా, కోహ్లీ వారి ఫ్రాంఛైజీలను వీడి వేలంలోకి వస్తే వారికి కూడా కాసుల వర్షం కురుస్తుందని... కోహ్లీ రూ.42 కోట్లు, బుమ్రా రూ.35 కోట్ల ధర పలుకుతారని అన్నాడు. ఈ విధానంతో ఆటగాళ్ల మధ్య అసమానతలు ఏర్పడతాయని... అన్నాడు. ఈ సమస్య పరిష్కారానికి ఒకటే మార్గమని.. ఒక ఫ్రాంఛైజీ ఖర్చు చేసే మొత్తం రూ.200 కోట్లయితే.. అందులో రూ.150 కోట్లు లేదా రూ.175 కోట్లు భారత ఆటగాళ్లను కొనడానికి వెచ్చించాలని చోప్రా సూచించాడు.
పాట్ కమిన్స్‌కు ఇచ్చిన ఆఫర్‌పై రైనా ఫైర్
దీనిపై సురేష్ రైనా(Suresh Raina) కూడా స్పందించాడు. ఫ్రాంఛైజీలు భారత ఆటగాళ్ల కంటే విదేశీ ప్లేయర్లకు ఎక్కువ వెచ్చించడాన్ని రైనా తప్పుబట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా రూ.12 కోట్లు, ఎంఎస్ ధోనీ రూ.12 కోట్లు, మహ్మద్ షమి రూ.5 కోట్లు తీసుకుంటున్నారని... 8 ఏళ్ల పాటు ఐపీఎల్‌కు దూరంగా ఉన్న, లీగ్‌లో ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు ఆడిన పాట్ కమిన్స్‌కు దాదాపు రూ.25 కోట్లు ఇచ్చారని. ఇది సరైన నిర్ణయం కాదని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

