అన్వేషించండి

KL Rahul Message: స్ట్రైక్ రేట్‌తో కేఎల్ రాహుల్ మాస్ రిప్లై.. విమర్శకుల నోళ్లు మూయించి.. టీమ్ ఇండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్

ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న కేఎల్ రాహుల్ అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో చెలరేగిపోతున్నాడు. రాజస్థాన్‌పై గెలుపు తర్వాత తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.

KL Rahul Performance and Strike Rate Message: టీమ్ ఇండియాలో అత్యంత టాలెంటెడ్ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ ఒకరు. అయితే గత కొంతకాలంగా టీ20 క్రికెట్‌లో అతని స్ట్రైక్ రేట్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరీ నెమ్మదిగా ఆడుతున్నాడనే కారణంతో 2022 తర్వాత రాహుల్ భారత టీ20 జట్టులో చోటు కోల్పోయాడు. కానీ ఐపీఎల్ 2026 సీజన్‌లో రాహుల్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరపున ఆడుతున్న అతను ఈ ఏడాది పరుగుల వరద పారిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌కు ,తనను విమర్శించే వారికి రాహుల్ గట్టి మెసేజ్ పంపాడు.

ఆరెంజ్ క్యాప్ గర్వంగా ఉంది..
పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీలో రాహుల్ ముఖంలో ఒక ప్రత్యేకమైన చిరునవ్వు కనిపించింది. సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు ఇచ్చే 'ఆరెంజ్ క్యాప్' తన ముందు ఉండటంతో అతను ఎంతో సంతోషంగా కనిపించాడు. తన ఢిల్లీ క్యాపిటల్స్ టోపీని తీసి ఆరెంజ్ క్యాప్ పెట్టుకున్నప్పుడు అతనిలో ఒక సంతృప్తి కనిపించింది. ఖచ్చితంగా ఇది చాలా ఆనందాన్ని ఇస్తుందని, రోజు చివరలో మనం ఆడేది గెలవడానికేన‌ని అన్నాడు. ఇన్ని ఏళ్లు క్రికెట్ ఆడిన తర్వాత నంబర్లు కూడా ముఖ్యమేన‌ని, పరుగులు సాధించడం, రికార్డులు బద్దలు కొట్టడం సంతోషమే కానీ, మ్యాచ్ గెలవకపోతే ఆ మజా ఉండదని రాహుల్ తన మనసులో మాట చెప్పాడు.

డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్..
ఢిల్లీ జట్టు గత కొన్ని మ్యాచుల్లో ఓడిపోవడంపై రాహుల్ స్పందిస్తూ, డ్రెస్సింగ్ రూమ్‌లో కొన్ని నిజాయితీతో కూడిన చర్చలు జరిగాయని తెలిపాడు. త‌మ డ్రెస్సింగ్ రూమ్ ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుందని, అయితే ఫలితాలు త‌మకు అనుకూలంగా రానప్పుడు ఎక్కడ తప్పు జరుగుతుందో లోతుగా ఆలోచించామ‌ని తెలిపాడు. తాము భారీ తప్పులేమీ చేయలేదు, కానీ కీలక సమయాల్లో (Big Moments) అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయామ‌న్నాడు. గత మ్యాచ్ మినహాయిస్తే మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ తాము గెలుపుకు దగ్గరగా వచ్చామ‌ని, టీ20 క్రికెట్‌లో రెండో అవకాశం ఉండదని తెలిపాడు. అందుకే అందివచ్చిన అవకాశాన్ని వాడుకుని గేమ్ ఫినిష్ చేయడం చాలా ముఖ్యమ‌ని, ఈ గెలుపు త‌మ కాన్ఫిడెన్స్ పెంచుతుందని రాహుల్ వివరించాడు.

స్ట్రైక్ రేట్ మెసేజ్..
ఈ సీజన్‌లో త‌న‌ ఆటలో నచ్చిన అంశం ఏంటి అని అడిగితే.. ఏమాత్రం ఆలోచించకుండా రాహుల్ "స్ట్రైక్ రేట్" అని బదులిచ్చాడు. గత కొన్నేళ్లుగా త‌న స్ట్రైక్ రేట్ మీద చాలా చర్చలు జరిగాయని, అందుకే దానిపై తాను ప్రత్యేకంగా ఫోకస్ పెట్టానని చెప్పాడు. ఆధునిక టీ20 క్రికెట్ ఏం కోరుకుంటుందో, త‌న జట్టుకు ఏం కావాలో అది ఇప్పుడు చేస్తున్నానని తెలిపాడు. 180కి పైగా స్ట్రైక్ రేట్, 54 సగటుతో పరుగులు చేయడం త‌నకు చాలా సంతృప్తిని ఇస్తుందని విమర్శకుల నోళ్లు మూయించాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న రాహుల్, తాను మళ్లీ టీమ్ ఇండియా టీ20 జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఈ ప్రదర్శన ద్వారా చాటిచెప్పాడు. సెలక్టర్లు ఏం కోరుకున్నారో అదే ఇప్పుడు రాహుల్ గ్రౌండ్‌లో చేసి చూపిస్తున్నాడు. మరి రాబోయే మేజర్ టోర్నీలకు రాహుల్‌ను పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు మాత్రం తమ ఓపెన‌ర్ ఫామ్ చూసి ఖుషీ అవుతున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
Abishek Porel Arrest: ఐపీఎల్ స్టార్ అభిషేక్ పోరెల్ కు బిగ్ షాక్.. తక్షణమే అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశం
ఐపీఎల్ స్టార్ అభిషేక్ పోరెల్ కు బిగ్ షాక్.. తక్షణమే అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశం
Hitman Records Alert: రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!
రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Embed widget