By: ABP Desam | Updated at : 11 May 2023 09:35 PM (IST)
వికెట్ తీసిన ఆనందంలో రాజస్తాన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ( Image Source : IPL Twitter )
Kolkata Knight Riders vs Rajasthan Royals: ఐపీఎల్ 2023 సీజన్ 55వ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తడబడింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అర్థ సెంచరీ సాధించిన వెంకటేష్ అయ్యర్ (57: 42 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్ నిదానంగా ప్రారంభం అయింది. స్కోరు బోర్డుపై 30 పరుగులు చేరే లోపే ఓపెనర్లు జేసన్ రాయ్ (10: 8 బంతుల్లో, రెండు ఫోర్లు), రహ్మనుల్లా గుర్బాజ్ (18: 12 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) ఇద్దరూ విఫలం అయ్యారు.
వన్ డౌన్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ (57: 42 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు ఫోర్లు), కెప్టెన్ నితీష్ రాణా (22: 17 బంతుల్లో, రెండు ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించాక నితీష్ రాణాను అవుట్ చేసి చాహల్ కోల్‌కతాను దెబ్బ కొట్టారు. ఆండ్రీ రసెల్ (10: 10 బంతుల్లో, ఒక సిక్సర్) విఫలం కాగా, రింకూ సింగ్ (16: 18 బంతుల్లో, ఒక సిక్సర్) వేగంగా ఆడలేకపోయాడు.
అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే వెంకటేష్ అయ్యర్ కూడా అవుటయ్యాడు. తర్వాత వచ్చిన వాళ్లు వేగంగా ఆడలేకపోయారు. దీంతో రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులకే పరిమితం అయింది. రాజస్తాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి. సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్ చెరో వికెట్ తీసుకున్నారు.
పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరో స్థానంలోనూ, రాజస్తాన్ రాయల్స్ ఐదో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లలో మూడో స్థానంలోకి వెళ్లనుంది. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలోకి పడిపోతుంది. టాప్-2లో ఉన్న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఎలాంటి ప్రమాదం లేదు.
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, KM ఆసిఫ్, యుజువేంద్ర చాహల్
రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
డోనావన్ ఫెరీరా, దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, మురుగన్ అశ్విన్, నవదీప్ సైనీ
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, ఎన్ జగదీసన్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్
Hardik Pandya on MS Dhoni: సీఎస్కే గెలుపు రాసిపెట్టుంది! ధోనీ చేతుల్లో ఓడిపోవడమూ హ్యాపీనే - పాండ్య
IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?