IPL Points Table: కోల్‌కతా, రాజస్తాన్ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక ఎలా ఉంది? - ఎవరు కిందకి పడ్డారు?
ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. రాజస్తాన్ రాయల్స్ ఒకేసారి మూడో స్థానానికి చేరుకుంది.
IPL 2023 Points Table: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ నాలుగో స్థానానికి పడిపోయింది.
రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ చెరో 12 పాయింట్లతో ఉన్నప్పటికీ, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా సంజూ శామ్సన్ జట్టు మూడో స్థానంలో ఉంది. దీంతో పాటు పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ నంబర్ వన్ స్థానంలో ఉంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లను సాధించింది.
పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ 12 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లు సాధించింది. ఈ విధంగా గుజరాత్ టైటాన్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ టాప్-4 జట్లలో ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్ 11 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పుడు ఎక్కడ ఉంది?
నితీష్ రాణా నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు సాధించింది. ఇది కాకుండా పంజాబ్ కింగ్స్ ఎనిమిదో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు సాధించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్‌ల్లో ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. అదే సమయంలో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో ఎనిమిది పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డుగా ఉన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఐపీఎల్ ఫ్రాంచైజీలు మరింత ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16 సీజన్ లో సోమవారం నాటికి 53 మ్యాచ్‌లు ముగియగా ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ ఖాతాలో కోటి రూపాయలు చేరాయి. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు గాను ఆయా జట్లు భారీగా నష్టపోతున్నాయి.
ఐపీఎల్-16లో భాగంగా సోమవారం పంజాబ్ - కోల్‌కతా మధ్య ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటెన్ చేసినందుకు గాను కేకేఆర్ సారథి నితీశ్ రాణాకు బీసీసీఐ రూ. 12 లక్షల జరిమానా విధించింది. తద్వారా ఇప్పటివరకు ఈ సీజన్ లో కేవలం స్లో ఓవర్ రేట్ ద్వారా జరిమానాలు విధించిన నగదు విలువ కోటి రూపాయలు (రూ. 1.08 కోట్లు) దాటింది.
ఈ ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా గతంలో ఆర్సీబీ కెప్టెన్లుగా వ్యవహరించిన ఫాప్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రాజస్తాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్, కేకేఆర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు సారథిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్, లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్, గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాలు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాలు ఎదుర్కున్నవారే.
IPL 2023 Points Table - Rajasthan Royals replaces MI at No.3. pic.twitter.com/smpSWYlq6l
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 11, 2023