IPL Final 2024 : బాద్‌షా డిసైడ్ అయితే వార్ వన్‌సైడే - బ్లాంక్ చెక్ ఇచ్చి కప్పు ఎత్తుకెళ్లిపోయిన షారూఖ్
SRH Vs KKR: సన్ రైజర్స్ మీద పదివికెట్ల తేడాతో ఓడిపోయారని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓనర్ సంజీవ్ గోయెంకా ఎలా అందరి ముందు తిట్టాడో. అలాంటి వారికి పూర్తి కాంట్రాస్ట్‌గా ఉంటాడట షారూఖ్ ఖాన్.
KKR Owner Shah Rukh Khan : ఇట్స్ గాడ్స్ ప్లాన్. ఏప్రిల్ 16 2024న షారూఖ్ ఖాన్ కేకేఆర్ టీమ్‌తో అన్నమాట. రింకూ సింగ్ అప్పుడు తనతో అన్న మాటనే ఆ రోజు కోట్ చేసిన షారూఖ్ ఖాన్... నిన్న మ్యాచ్ గెలిచాక మళ్లీ రింకూను హగ్ చేసుకుని అదే మాట చెప్పాడు. గంభీర్ కోల్ కతాకు తిరిగి రావటం తమ ఫేట్ డిసైడ్ చేస్తుందని షారూఖ్ ఖాన్ బలంగా నమ్మాడు
ఇదొక్కటే కాదు ఓనర్ అంటే షారూఖ్ అనిపించేలా అతను విషయాలను డీల్ చేసే విధానం కూడా చూడముచ్చటగా ఉంది.
It’s God’s Plan☝️💜 pic.twitter.com/rZ6ccyOq6c
— KolkataKnightRiders (@KKRiders) May 26, 2024
ఇది షారఖ్ గొప్పతనం
కుట్టీస్టోరీస్ ఇంటర్వ్యూలో అశ్విన్ అడిగిన ప్రశ్నకు గంభీర్ సమాధానం చెబుతూ... తను కేకేఆర్‌కి ఆడిన ఏడేళ్లలో మ్యాచ్ గురించి షారూఖ్ ఖాన్‌తో మాట్లాడిన సందర్భాలు కేవలం రెండేనట. అది కూడా రెండుసార్లు కప్ గెలిచినప్పుడు థాంక్యూ చెప్పాడట. అంతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది షారూఖ్ ఖాన్ కి తన సొంత టీమ్‌తో. క్రికెటింగ్ వ్యవహారాలు తనకు తెలియవు కాబట్టి అస్సలు పట్టించుకోడు. ఓనర్‌ని కాబట్టి నువ్వు ఆడావు నువ్వు ఆడట్లేదు అని ఎవరినీ బ్లేమ్ కూడా చేయడు. గ్రౌండ్‌కి వస్తాడు. టెన్షన్‌గా మ్యాచ్ చూస్తాడు. మ్యాచ్ గెలిస్తే సెలబ్రేట్ చేసుకుంటాడు ఓడిపోతే ఆటగాళ్లకు ఓ హగ్ ఇచ్చి ఏం ఫర్లేదని కొంచెం మోటివేట్ చేసి వెళ్లిపోతాడు.
ఈ ఐపీఎల్లోనే చూశాం. సన్ రైజర్స్ మీద పదివికెట్ల తేడాతో ఓడిపోయారని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓనర్ సంజీవ్ గోయెంకా ఎలా అందరి ముందు తిట్టాడో. అలాంటి వారికి పూర్తి కాంట్రాస్ట్‌గా ఉంటాడట షారూఖ్ ఖాన్. అసలు గంభీర్‌ని కేకేఆర్‌కి మెంటార్‌గా రప్పించటానికి ఓ బ్లాంక్ చెక్ ఇచ్చాడని కూడా చెబుతారు.
నిన్న కేకేఆర్ మ్యాచ్ గెలవగానే గంభీర్‌కి నుదుటి మీద ముద్దు పెట్టాడు. రింకూని హగ్ చేసి గాడ్స్ ప్లాన్ బ్రో అన్నాడు. తన భార్య గౌరీ ఖాన్‌కి హగ్ ఇచ్చి ఎమోషనల్ అయ్యాడు. పదేళ్లుగా విజయం లేకపోతే ఎలా ఉంటుందో షారూఖ్ కి తెలుసు. ఆట మీద అతనికున్న ప్రేమనే ఇన్నాళ్లుగా టీమ్ కి సపోర్ట్ ఇస్తూ నిలబడేలా చేసింది. దాని ఫలితమే ఈసారి కేకేఆర్ మంచి టీమ్‌గా సెట్ అయ్యి అదిరిపోయే విజయాన్ని అందుకోవటంతో పాటు చెన్నై, ముంబై తర్వాత అత్యధిక టైటిళ్లతో తమ బ్రాండ్ వాల్యూను కూడా అమాంతం పెంచుకుని షారూఖ్ ఓర్పుకు ఆట మీద ప్రేమకు గిఫ్ట్ ఇచ్చింది.
2012లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అప్పడు కూడా షారూఖ్ స్టేడియంలో సందడి చేశాడు. ఆయనతోపాటు సుహాన్ ఖాన్, అనన్యపాండే, షనాయా కపూర్ ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ల సందడి ఇంతా అంతా కాదు. దీంతో 2012 నాటి ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అప్పుడు హతిక్‌రోషన్‌తో కలిసి ఫొటోలకు ఈ ముగ్గురు ఫోజులు ఇచ్చారు.