అన్వేషించండి

Hardik Pandya And Natasa Stankovic: హార్థిక్ పాండ్యాకు మరో షాక్ తగిలిందా? నటాషా దూరంగా వెళ్లిపోయారా?

What's Wrong With Hardik And Natasha : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా అతని భార్య నటాషాల మధ్య విభేదాలు తలెత్తాయని, వారు విడిపోబోతున్నారని రూమర్లు చెక్కర్లు కొడుతున్నాయి..

Hardik Pandya And Natasa Stankovic: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు టైం బాగున్నట్లు కనిపించట్లేదు. ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచే పాండ్యా ప్రస్తుతం పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఏవో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తలొస్తున్నాయి.  ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి హార్థిక్ పాండ్యా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్ లో గొప్పగా రాణిస్తాడని ఆశ పడ్డ అందరికీ నిరాశనే మిగిల్చిన పాండ్యా ఈ సీజన్‌లో  ముంబై దారుణమైన ప్రదర్శనకు బాధ్యుడయ్యాడు. అయిదు సార్లు కప్ గెలిచిన ముంబై  పాండ్యా సారథ్యంలో కనీసం లీగ్ దశ కూడా దాటలేదు. ఆడిన పద్నాలుగు మ్యాచుల్లో పది మ్యాచ్‌లలో ఓటమి పాలై ఈ సారి పాయింట్ల టేబుల్ లో అట్టడుగు స్థానానికే పరిమితమైంది. 

ముంబై కెప్టెన్సీ కొంప ముంచిందా..? 

ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి సారధ్య బాధ్యతలు హార్థిక్ చేతిలో పెట్టడంపై క్రికెట్ అభిమానుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. నిర్ణయం తీసుకుంది టీం యాజమాన్యమైనా.. ఒత్తిడికి గురైంది మాత్రం హార్థిక్ పాండ్యానే. ముంబై టీమ్ ఈ సీజన్ లో ఓడిన ప్రతిసారీ నిందించింది పాండ్యానే. అందుకు తగ్గట్టుగానే టీమ్ సమష్టికా విఫలమవ్వడంతో ఈ సారి ముంబై ప్రదర్శన ఐపీఎల్ లో మరీ దారుణంగా ఉంది. ఈ టీమేనా ఇన్ని సార్లు టైటిల్ గెలిచింది.. అన్నంత ఆశ్చర్యకరంగా ఆటతీరుతో నిరాశకు గురిచేశారు పాండ్యా సారథ్యంలోని  ముంబై ప్లేయర్లు. అసలు IPL 2024 టోర్నమెంటే ముంబై ఇండియన్స్‌కు ఒక పీడకలగా పరిణమించినట్లు కనిపిస్తోంది.  హార్దిక్ పాండ్యా తన క్రికెట్ కెరీర్‌లో అత్యంత టఫ్ టైమ్ ని ఎదుర్కొంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తీవ్రమైన ట్రోలింగ్ కు గురైన పాండ్యా.. తన వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  

భార్య నుంచి విడిపోయాడా..?  

హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలోను సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. భార్య నటాషా స్టాంకోవిచ్ తో హార్దిక్ కు విభేదాలు తలెత్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ విడిపోయారని నెట్టింట ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్రికెట్‌లో ఎక్కువగా మాట్లాడుకునే జంట హార్దిక్-నటాషా. ఈ జంట ప్రతి క్షణాన్ని సోషల్ మీడియాలో అప్‌డేట్ చేసుకోవడం అభిమానులు చూశారు. అలాంటిది సడన్ గా వీరు ఎవరి దారి వారిదే అన్నట్లు పోస్టులు చేస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.

ఇంటిపేరు తొలగించి.. కష్టంలో వదిలేసి..  

హార్థిక్ భార్య నటాషా ఇన్‌స్టా గ్రామ్‌లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్‌స్టాలో ఆమె ఖాతాకు  3.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. స్వతహాగా మోడల్, నటి అయిన నటాషా తన వ్యక్తిగత ఫొటోలతో పాటు తన ఫ్యామిలీ ఫొటోలు, ప్రొఫెషన్ ఫోటోలను సైతం తన ఖాతా ద్వారా షేర్ చేస్తుంది.  అయితే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం నటాషా గ్రౌండ్ లో ఎక్కడా కనిపించలేదు. పాండ్యా ఇంత బ్యాడ్ టైమ్ లో ఉన్నప్పుడు అతణ్ని సపోర్ట్ చేసేందుకు వెన్ను దన్నుగా నిలవలేదు. కనీసం సోషల్ మీడియాలో నైనా ఒక్క సపోర్టింగ్ పోస్టు కూడా పెట్టలేదు. అలాగే ఇన్‌స్టాగ్రామ్ లో నటాషా స్టాంకోవిక్ అనే తన పేరు చివర గతంలో ఉండే పాండ్యా అనే ఇంటిపేరును సైతం ప్రస్తుతం ఆమె తొలగించింది.  ఇదేంటని పాండ్యా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదేం..? 

 ఇన్‌స్టాలో పాండ్యా ఖాతాకు సైతం 29.8 మిలియన్ మంది  ఫాలోవర్లు ఉన్నారు.  పాండ్యా కూడా అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాడు. అలాంటిది పాండ్యా  కూడా తన భార్య నటాషా గురించి మాట్లాడటం, ఆమె వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం గత కొంతకాలంగా మానేశాడు. మార్చి 4న నటాషా పుట్టినరోజు కాగా.. ఆ రోజు కూడా ఒక్క పోస్టు కూడా భార్య పేరుమీద చేయలేదు.  దీంతో వీరిద్దరూ విడిపోబోతున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. దీంతో బ్రేకప్ రూమర్లు వైరల్ అవుతున్నాయి. వీళ్లిద్దరూ 2020లో పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు.  వీరి రిలేషన్ షిప్ పై  రూమర్స్ వస్తున్నా ఇంతవరకు వారు ఈ రూమర్స్ పై స్పందించలేదు. అలాగే విడిపోతున్నామంటూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. 

ఇకనైనా రాణిస్తాడనే ఆశ.. 
 
ఐపీఎల్ లో చెత్త ప్రదర్శనతో సంబంధం లేకుండా ప్రస్తుతం హార్థిక్ పాండ్యా కు టీ20 ప్రపంచకప్‌లో భారత్ టీమ్ తరఫున వైస్‌ కెప్టెన్సీ దక్కింది. దీంతో అతని అభిమానులు ఈ వరల్డ్ కప్ లో మెరుగ్గా రాణించడంతో అయినా.. తనపై వచ్చిన విమర్శలన్నింటికీ పాండ్యా సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు.  క్రికెట్ అభిమానులంతా అతని నుంచి మంచి ఇన్నింగ్స్‌ వస్తుందేమోనన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
Sydney Test Updates: ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు -  12 మంది మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
Embed widget