అన్వేషించండి

IPL 2026 Viral Video: కామెరూన్ గ్రీన్ జెయింట్ సిక్సర్ .. దాని విలువ రూ.5 ల‌క్ష‌లు.. దెబ్బకు డిస్ప్లే కారుకు డెంట్! 

గుజరాత్ తో మ్యాచ్‌లో కేకేఆర్ ప్లేయర్ కెమెరూన్ గ్రీన్ కొట్టిన భారీ సిక్సర్ మైదానంలోని టాటా డిస్ప్లే కారును తాకింది. ఫామ్ కోల్పోయి తంటాలు ప‌డిన గ్రీన్, ఎట్ట‌కేల‌కు ఈ మ్యాచ్ లో 79 పరుగులతో రాణించాడు.

 

IPL 2026 KKR VS GT Latest Updates: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన గుజరాత్ టైటాన్స్ (GT), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పోరులో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కేకేఆర్ ఆల్‌రౌండర్ కెమెరూన్ గ్రీన్ కొట్టిన ఒక జెయింట్ సిక్సర్ నేరుగా వెళ్లి స్టేడియంలో ప్రదర్శనకు ఉంచిన కారును బలంగా తాకింది. ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ. 25.2 కోట్ల భారీ ధరకు అమ్ముడైన గ్రీన్, తన విలువకు తగ్గట్టుగా మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో అశోక్ శర్మ వేసిన మూడవ బంతిని గ్రీన్ లెగ్ సైడ్ వైపు భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ బంతి నేరుగా వెళ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’కు బహుమతిగా ఇచ్చే కారుకు తగలడంతో బాడీపై చిన్న డెంట్ పడింది. దీంతో స్టేడియం మొత్తం హోరెత్తి పోయింది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వైర‌లైంది. 

టాటా మోటార్స్ సూప‌ర్బ్ నిర్ణయం..
టోర్నమెంట్ స్పాన్సర్ అయిన టాటా.. త‌న సబ్సిడ‌రీ కంపెనీ అయిన టాటా మోటార్స్ నిబంధనల ప్రకారం, మైదానంలోని కారును బంతి తాకితే గ్రాస్‌రూట్ క్రికెట్ అభివృద్ధి కోసం కంపెనీ రూ. 5 లక్షల విరాళం అందజేస్తుంది. గ్రీన్ కొట్టిన సిక్సర్ వల్ల ఇప్పుడు ఆ నగదును క్రికెట్ అభివృద్ధికి వెచ్చించనున్నారు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న గ్రీన్, ఈ మ్యాచ్‌తో మళ్ళీ తన పాత జోరును అందుకున్నాడు. కేవలం 55 బంతుల్లోనే 79 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నాడు.

కేకేఆర్ భారీ స్కోరు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే చుక్కెదురైంది. గుజరాత్ పేసర్లు కాగిసో రబడా (3/29), మహమ్మద్ సిరాజ్ (2/23) ధాటికి కేకేఆర్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో గ్రీన్ క్రీజులోకి వచ్చాడు. రోవ్‌మన్ పావెల్ (27) తో కలిసి నాలుగో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత అనుకూల్ రాయ్ సహాయంతో జట్టు స్కోరును 180 పరుగులకు చేర్చాడు. గ్రీన్ పోరాటం వల్ల కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. మ‌రోవైపు పవర్ హిట్టర్ కామెరూన్ గ్రీన్ ఫామ్‌లోకి రావడం కేకేఆర్ క్యాంప్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ మ్యాచ్‌లో గ్రీన్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. ఒక పక్క వికెట్లు పడుతున్నా వెనక్కి తగ్గకుండా గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడి జట్టును గట్టెక్కించాడు. ఈ సీజన్‌లో గ్రీన్ రాబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Embed widget