అన్వేషించండి
Advertisement
IPL 2024 SRH vs KKR: కోల్‌కత్తాను ఢీకొడుతున్న హైదరాబాద్- భీకర పోరు ఖాయం, ఫైనల్లో తొలి అడుగు ఎవరిదో?
KKR vs SRH Match Preview: మూడేళ్ల తర్వాత ప్లే ఆఫ్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నేరుగా ఫైనల్ చేరేందుకు అడ్డుగా ఉన్న కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో తొలి ప్లే ఆఫ్ పోరుకు సమాయత్తమైంది.
IPL 2024 Qualifier 1 KKR vs SRH : మూడేళ్ల తర్వాత ప్లే ఆఫ్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కీలక సమరానికి సిద్ధమైంది. నేరుగా ఫైనల్ చేరేందుకు అడ్డుగా ఉన్న కోల్‌కత్తా నైట్ రైడర్స్(KKR)తో తొలి ప్లే ఆఫ్ పోరుకు సమాయత్తమైంది. ఈ మ్యాచ్‌లోనే గెలిచి ఐపీఎల్(IPL) టైటిల్ పోరుకు అర్హత సాధించాలని... హైదరాబాద్- కోల్‌కత్తా నైట్ రైడర్స్ వ్యూహాలు రచిస్తున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కోల్‌కత్తా-హైదరాబాద్ జట్ల బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగా ఉండడంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరు జట్ల బౌలింగ్ కాస్త బలహీనంగా ఉండడం కూడా భారీ స్కోర్లు నమోదుకు మార్గం సుగుమం చేసేలా ఉంది. కోల్‌కత్తా ఈ ఐపీఎల్‌లో ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టు కాగా... హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది.
బ్యాటర్లపై హైదరాబాద్ భారం
కోల్‌కత్తాతో జరుగుతున్న ప్లే ఆఫ్ సమరంలో హైదరాబాద్ ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఓపెనర్లు ట్రానిస్ హెడ్- అభిషేక్ శర్మ భీకర ఫామ్‌లో ఉన్నారు. గత కొన్ని మ్యాచుల్లో కాస్త తడబడిన హెన్రిచ్ క్లాసెన్ కూడా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్ ఝుళిపించడంతో హైదరాబాద్ మేనేజ్‌మెంట్ సంతృప్తిగా ఉంది. పంజాబ్ కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలవడం హైదరాబాద్ ఆత్మ విశ్వాసాన్న రెట్టింపు చేసింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ కు షాక్ ఇస్తూ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 70 మ్యాచ్‌ల లీగ్ రౌండ్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుంది. అయితే ప్లే ఆఫ్‌కు సిద్ధమయ్యేందుకు ఇరు జట్లకు తగినంత సమయం లేకపోవడం ఇరు జట్లపై ఒత్తిడిని పెంచుతోంది. కోల్‌కత్తా, హైదరాబాద్ వందల కిలోమీటర్లు ప్రయాణించి ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగి నరేంద్రమోదీ స్టేడియానికి చేరుకున్నాయి.
ఓపెనర్లపైనే భారం
హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్-అభిషేక్ శర్మ ఇద్దరూ 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధిస్తూ సన్‌రైజర్స్‌కు వరుస విజయాలు అందిస్తున్నారు. ట్రానిస్ హెడ్ బ్యాట్‌తో దూకుడును ప్రదర్శిస్తున్నాడు. హెడ్ ఈ సీజన్‌లో ఒక శతకం, నాలుగు అర్థ శతకాలతో ఇప్పటికే 533 పరుగులు సాధించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 41 సిక్సర్లు కొట్టిన భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ... 467 పరుగులు సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. హెన్రిచ్ క్లాసెన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. మిచెల్ స్టార్క్ నేతృత్వంలోని కోల్‌కత్తా బౌలింగ్ దళాన్ని ప్యాట్ కమిన్ నేతృత్వంలోని బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
కోల్‌కత్తా భీకరంగా
కోల్‌కత్తా కూడా బ్యాటింగ్‌లో చాలా బలంగా ఉంది. అయితే ఈ సీజన్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్న ఫిల్ సాల్ట్... ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఆడేందుకు స్వదేశానికి వెళ్లడం కోల్‌కత్తాను దెబ్బ తీసింగి. సాల్ట్ ఈ సీజన్‌లో 435 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ స్థానాన్ని కోల్‌కత్తా ఎవరితో భర్తీ చేస్తుందో చూడాలి. సునీల్ నరైన్ 461 పరుగులతో భీకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. కెప్టెన్ అయ్యర్ 287 పరుగులు చేసి పర్వాలేదనిపిస్తున్నాడు. నితీష్ రానా విఫలమవుతుండడం కోల్‌కత్తాను ఆందోళన పెడుతోంది.
జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), KS భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ సింగ్, రమణదీప్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్, అల్లా గజన్‌ఫర్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్‌రమ్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్ .
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion