అన్వేషించండి

IPL 2024: రికార్డుల్లో బెంగళూరుపై కోల్‌కత్తాదే పైచేయి

RCB vs KKR : ఐపీఎల్‌లో విజయాల పరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉన్న బెంగళూరు- కోల్‌కత్తా మధ్య..చిన్నస్వామి స్టేడియం వేదికగా కీలక మ్యాచ్‌ జరగనుంది.

IPL 2024 RCB vs KKR match head to head records : ఐపీఎల్‌(IPL2024)లో విజయాల పరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉన్న బెంగళూరు(RCB)- కోల్‌కత్తా(KKR) మధ్య..చిన్నస్వామి స్టేడియం వేదికగా కీలక మ్యాచ్‌ జరగనుంది. గత మ్యాచ్‌లో గెలిచి మంచి ఊపు మీదున్న ఇరు జట్లు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి విజయాల పరంపర కొనసాగించాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటివరకూ  బెంగళూరు- కోల్‌కత్తా మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌కే మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 32 మ్యాచ్‌లో తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 18 మ్యాచ్‌లు గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు 14 మ్యాచ్‌లు గెలిచింది. 


పిచ్‌ రిపోర్ట్‌
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. షార్ట్ బౌండరీలు బ్యాటర్లకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తాయి. మ్యాచ్‌ గడుస్తున్నా కొద్దీ పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. బౌండరీలు చిన్నవిగా ఉండడంతో బ్యాటర్లు క్రీజులో నిలబడితే భారీ స్కోరు సాధ్యమేనని మాజీలు అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీపైనే అందరి కళ్లు కేంద్రీకృతమై ఉంది. 

కోహ్లీపై భారీ అంచనాలు..?
రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై విరాట్‌... విక్టరీ ఇన్నింగ్స్‌ ఆడాడు. కోహ్లీ 49 బంతుల్లో 77 పరుగులు చేసి ఆర్సీబీని గెలిపించాడు. సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుండడం బెంగళూరుకు కలిసిరానుంది. విరాట్‌ కోహ్లీతో పాటు దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్ రూపంలో పవర్ హిట్టింగ్‌లతో బెంగళూరు బ్యాటింగ్‌ లైనప్‌ చాలా బలంగా ఉంది. కార్తీక్, లోమ్రోర్‌ల జోడీ గత మ్యాచ్‌లోనూ రాణించడం బెంగళూరుకు కలిసి రానుంది. మహ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్‌లతో కూడిన బెంగళూరు బౌలింగ్ కూడా బలంగా కనిపిస్తోంది. పేస్‌లో బెంగళూరు కాస్త బలంగా కనిపిస్తున్నా స్పిన్ విభాగంలో మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. మాక్స్‌వెల్ బౌలింగ్‌లో రాణిస్తున్నా.... బ్యాటింగ్‌లో విఫలం కావడం బెంగళూరు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తమ విజయాల పరంపరను కొనసాగించేందుకు ఆర్సీబీ ఎదురుచూస్తోంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్‌తో బలంగా ఉంది. హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కత్తా విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ ఓపెనర్ల జోడి మారే అవకాశం ఉంది. కోల్‌కత్తాను ఓపెనింగ్‌ సమస్య ఇంకా వెంటాడుతూనే ఉంది. ఓపెనింగ్ స్థానంపై కోల్‌కత్తా ప్రయోగాలు చేస్తూనే ఉంది. 


బెంగళూరు జట్టు( అంచనా): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, ఆకాష్ దీప్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, స్వప్నిల్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, విల్ జాక్స్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్.

కోల్‌కత్తా జట్టు( అంచనా): శ్రేయస్ అయ్యర్(కెప్టెన్‌), రస్సెల్, ఫిల్ సాల్ట్, వెంకీ అయ్యర్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, ఆరోన్ వరుణ్, హర్షిత్ రాణా, నితేష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ప్రజాపాలన ముగింపు కార్యక్రమాల షెడ్యూల్ విడుదల- 7,8,9 తేదీల్లో ధూంధాం
ప్రజాపాలన ముగింపు కార్యక్రమాల షెడ్యూల్ విడుదల- 7,8,9 తేదీల్లో ధూంధాం కార్యక్రమాలు
Pushpa 2 Review - పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?
పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?
Pushpa 2 Dialogues: మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP DesamAllu Arjun Sandhya Theatre Pushpa 2 | పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్యా థియేటర్ కు బన్నీ | ABP DesamShinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desamగోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ప్రజాపాలన ముగింపు కార్యక్రమాల షెడ్యూల్ విడుదల- 7,8,9 తేదీల్లో ధూంధాం
ప్రజాపాలన ముగింపు కార్యక్రమాల షెడ్యూల్ విడుదల- 7,8,9 తేదీల్లో ధూంధాం కార్యక్రమాలు
Pushpa 2 Review - పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?
పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?
Pushpa 2 Dialogues: మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
Rayachoti Teacher Death: తరగతి గదిలో ఉపాధ్యాయుని అనుమానాస్పద మృతి - విద్యార్థులు కొట్టడం వల్లే చనిపోయాడా?, రాయచోటిలో విషాద ఘటన
తరగతి గదిలో ఉపాధ్యాయుని అనుమానాస్పద మృతి - విద్యార్థులు కొట్టడం వల్లే చనిపోయాడా?, రాయచోటిలో విషాద ఘటన
Daaku Maharaaj: బాలయ్య ‘డాకు మహారాజ్’పై ఇక డౌట్స్ అవసరం లేదు, సంక్రాంతి బరికి బొమ్మ రెడీ
బాలయ్య ‘డాకు మహారాజ్’పై ఇక డౌట్స్ అవసరం లేదు, సంక్రాంతి బరికి బొమ్మ రెడీ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
Embed widget