అన్వేషించండి

IPL 2024: అహ్మదాబాద్‌ ఫ్లైట్ టికెట్‌ బుక్‌ చేసుకునేదెవరు? అస్సాం ట్రైన్‌ ఎక్కేది ఎవరు? సీఎస్‌కే, ఆర్సీబీ మధ్య మహా సంగ్రామం

RCB vs CSK: ఐపిఎల్ ఈ సీజన్‌లోనే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్‌ సిద్ధమయ్యాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ నాకౌట్ కానుంది.

RCB vs CSK Match Preview : ఐపీఎల్‌(IPL)లో ప్లే ఆఫ్‌ చేరే ఆఖరి జట్టు ఏదో తేల్చే కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లోనే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)- చెన్నై సూపర్ కింగ్స్‌(CSK) సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధిస్తే బెంగళూరు ప్లే ఆఫ్‌(Play off) చేరనుండగా... మ్యాచ్ గెలిచినా.. వర్షం పడి రద్దైనా... ఉత్కంఠభరితంగా సాగి ఓడిపోయినా చెన్నై ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టనుంది. ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు డూ ఆర్ డైగా మారింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ నాకౌట్ కానుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాలంటే మాత్రం గెలవడంతోపాటు నెట్ రన్‌ రన్‌ను కీలకంగా మారనుంది. 

బెంగళూరు అద్భుతం చేస్తుందా
ప్రస్తుతం ప్లేఆఫ్‌లకు కేవలం ఒక స్థానం మాత్రమే మిగిలి ఉంది. అధికారికంగా మూడు జట్లు ప్లే ఆఫ్‌ రేసులో ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీలో ఉన్నాయి.  కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో నెట్ రన్ రేట్‌ దారుణంగా ఉండడంతో ప్లే ఆఫ్‌ చేరడం దాదాపు అసాధ్యం. ఇక చెన్నై-బెంగళూరు మధ్యే పోరు జరగనుంది. ప్రస్తుతం చెన్నై ఖాతాలో 14 పాయింట్లు ఉండగా.. నెట్ రన్ రేట్ + 0.528గా ఉంది. అదే ఆర్సీబీ విషయానికి వస్తే.. ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉండగా.. నెట్ రన్ రేట్ + 0.387గా ఉంది. ఈ డూ-ఆర్-డై మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ఏం చేస్తాయన్నది కీలకంగా మారింది. మ్యాచ్‌లో ఎవరు గెలిచినా అభిమానులకు మాత్రం ఇది పూర్తి వినోదాన్నిపంచనుంది. 

వర్షమే ప్రధాన అడ్డంకి
ఈ ఐపీఎల్‌లోనే కీలకమైన ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్రికెట్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.  మ్యాచ్‌ జరిగే రోజున బెంగళూరులో వర్షం కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వెదర్.కామ్‌ వెల్లడించింది. రోజంతా 73 శాతం, సాయంత్రం 6 గంటల సమయంలో 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సదరు వెబ్‌సైట్‌ పేర్కొంది. 

ఆత్మవిశ్వాసంతో బెంగళూరు
 ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కోహ్లి గత ఐదు మ్యాచుల్లో మూడు అర్ధసెంచరీలతో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ చివరి రెండు మ్యాచుల్లో సింగిల్‌ డిజిట్‌కే అవుటైనా ఈ కీలక మ్యాచ్‌ల సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. మిడిలార్డర్‌లో రజత్ పాటిదార్, కామెరూన్ గ్రీన్ ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ కూడా నిలిస్తే చెన్నై బౌలర్లకు కష్టాలు తప్పవు. బౌలింగ్‌ విభాగంలో లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, గ్రీన్, స్వప్నిల్ సింగ్‌ రాణిస్తున్నారు. చెన్నై జట్టులో కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్‌లో జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతూ మంచి టచల్‌ ఉన్నాడు. రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్‌, శివమ్ దూబే రాణిస్తే చెన్నైకు తిరుగుండదు. పేసర్ సిమర్‌జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే రాణిస్తున్నారు. 

జట్లు:
బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్ , మహమ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

చెన్నై సూపర్‌కింగ్స్‌: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, MS ధోనీ, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, మొయిన్ సింద్, మొయిన్ సింద్ మిచెల్ సాంట్నర్, అజయ్ జాదవ్ మండల్, ప్రశాంత్ సోలంకి, ముఖేష్ చౌదరి, సిమర్‌జీత్ సింగ్, ఆర్‌ఎస్ హంగర్గేకర్, అరవెల్లి అవనీష్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
The Raja Saab: రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
Embed widget