అన్వేషించండి

ఐపీఎల్ 2024 రెండో మ్యాచ్‌లో పంజాబ్, ఢిల్లీ ఢీ - గెలుపు అవకాశాలు ఎవరికి?

PBKS Vs DC: ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి.

IPL 2024: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో రెండో ఆస‌క్తిక‌ర స‌మ‌రానికి రంగం సిద్ధ‌మైంది. మొహాలీ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ పంజాబ్ కింగ్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 3.30 నిమిషాల‌కు మెద‌లుకానుంది ఈ మ్యాచ్‌. ఈసారి కొత్త ఆట‌గాళ్లు, భారీ హిట్ట‌ర్ల చేరిక‌తో రెండు టీంలు క‌ళక‌ళ‌లాడిపోతున్నాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఈ రెండు జ‌ట్లు టైటిల్ గెల‌కవ‌క‌పోవ‌డం వీరిని నిరాశ‌ప‌రిచేదే. అయితే వీరిద్ద‌రి రికార్డులు ఎలా ఉన్నాయి. ఈ టీమ్‌లో టాప్ ఆట‌గాళ్లు ఎవ‌రు ప్ర‌స్తుత సీజ‌న్‌లో  ఈ రెండు జట్ల బ‌లాబ‌లాలు ఏంటి. టైటిల్ వేట‌లో ఎంత దూరంలో ఉన్నారు లాంటి వివ‌రాలు చూద్దాం..

ఢిల్లీ ఆయుధం అత‌నే
ముందుగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ గురించి చెప్పాలంటే పెద్ద జ‌ట్టుగానే క‌నిపిస్తుంది. కానీ, టోర్నీలో మ్యాచ్‌లు జ‌రిగే కొద్దీ ప‌ల‌చ‌బ‌డిపోతారు అన్న పేరుంది. ప్ర‌స్తుత ఢిల్లీ టీమ్‌లో రిష‌బ్‌పంత్ చేరిక కొంత బ‌లాన్నిచ్చేదే. రోడ్డు ప్ర‌మాదం వ‌ల్ల గ‌త సీజ‌న్ లో ఆడ‌లేక‌పోయిన పంత్ ప్ర‌స్తుతం అందుబాటులోకివ‌చ్చాడు. ఇక డేవిడ్ వార్న‌ర్ ఉండ‌నే ఉన్నాడు. మిచెల్ మార్ష్‌, రికీ బుయ్‌, స్ట‌బ్స్‌, పృథ్వీషా లాంటి బ్యాట‌ర్లు ఉండ‌గా, నోర్జే, ముఖేష్‌కుమార్‌, ఇషాంత్ శ‌ర్మ బౌలింగ్ భారాన్ని మోయాలి. కానీ 15 నెల‌ల త‌ర్వాత క్రికెట్ ఆడుతున్న పంత్‌, ఫామ్‌లో లేని పృథ్వీషా ఢిల్లీ ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తుందో చూడాలి. ఇక జ‌ట్టుకి కొండంత అండ అంటే అక్ష‌ర్‌ప‌టేల్‌, కుల్‌దీప్ యాద‌వ్ అని చెప్పొచ్చు. అలాగే స‌డ‌న్‌గా సీజ‌న్ నుంచి డ్రాప్ అయిన హ్యారీ బ్రూక్‌ల‌తో కొంత బ‌ల‌హీన‌ప‌డ‌టం వాస్తవం.

పంజాబ్ బ‌లంగానే...
ఇక పంజాబ్ విష‌యానికొస్తే పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో స‌త‌మ‌త‌మ‌య్యే పంజాబ్‌ ఈ సారి పేప‌ర్ మీద బ‌లంగానే క‌నిపిస్తోంది. శిఖ‌ర్‌ధావ‌న్ కెప్టెన్సీలో బ‌రిలోకిదిగుతున్న పంజాబ్...  బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్‌, రోసోవ్‌, ప్ర‌భుసిమ్ర‌న్‌సింగ్‌, జితేశ్‌శ‌ర్మ ల‌తో ప‌టిష్టంగా ఉంది. ఇక బౌలింగ్‌లో చాలినన్ని వ‌న‌రులున్నాయి. క‌గిసో ర‌బ‌డ‌, హ‌ర్ష‌ల్‌ప‌టేల్‌, అర్ష‌దీప్ సింగ్‌, క్రిస్‌వోక్స్‌, అల్‌రౌండ‌ర్ సామ్‌క‌ర‌ణ్, రాహుల్ చాహ‌ర్ ల‌తో స‌మ‌ర్ధ‌వంతంగా క‌నిపిస్తోంది. కాబట్టి పంజాబ్‌తో పోటీ అంత సులువుకాద‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తోంది ఈ జ‌ట్టు.

ఇవీ రికార్డులు
ఇక ఈ రెండు టీమ్‌ల మ‌ధ్య గణాంకాలు ప‌రిశీలిస్తే....ఇప్ప‌టివ‌ర‌కు వీళ్లిద్ద‌రి మ‌ధ్య 32మ్యాచ్ లు జ‌రిగితే, ఢిల్లీ16 మ్యాచ్‌లు, పంజాబ్ 16 మ్యాచ్‌లు గెలిచింది. 2021 నుంచి వ‌రుసగా పంజాబ్ పై పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన ఢిల్లీ వ‌రుస‌గా 6 మ్యాచ్‌లు గెలిచింది. కానీ గ‌త సీజ‌న్‌లో పంజాబ్ ఒక మ్యాచ్ గెలిచింది.

ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య‌ జ‌రిగిన మ్యాచ్‌ల్లో సొంత గ్రౌండ్ అడ్వాంటేజ్ పంజాబ్ వైపే ఉంద‌ని రికార్డులు చెబుతున్నాయి. త‌మ సొంత వేదిక‌ల‌మీద ఢిల్లీతో జ‌రిగిన 7 మ్యాచ్‌ల్లో పంజాబ్ 6 మ్యాచ్‌ల్లో విజ‌య‌దుందుభి మోగిస్తే ఢిల్లీ ఒక్క‌సారి మాత్ర‌మే విజ‌యం సాధించింది.  ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య చివ‌రి మ్యాచ్ లో 14 ప‌రుగుల తేడాతో పంజాబ్ విజ‌యం సాధించింది. హోంగ్రౌండ్ అడ్వాంటేజ్ ని అందిపుచ్చుకొని పంజాబ్ పూర్తి ఏక‌ప‌క్షంగా మ్యాచ్‌లు గెలిచింది. 

ఇది ఇలా ఉంటే త‌ట‌స్థ వేదిక‌ల మీద జ‌రిగిన మ్యాచ్‌ల్లో ఢిల్లీ పంజాబ్‌కింగ్స్ ని డామినేట్  చేసింది. ఇండియాలోని ఇత‌ర వేదిక‌లు, ఓవ‌ర్సీస్ లో వీళ్లిద్ద‌రిమ‌ధ్య‌  13 మ్యాచ్‌లు జ‌రిగితే అందులో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 9 మ్యాచ్‌లు గెలిస్తే పంజాబ్ కేవ‌లం 4 చోట్ల విజ‌యం సాధించింది. ఇక హోం గ్రౌండ్‌ల్లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో రెండు జ‌ట్లు చెరో 6 గెలిచాయి. ఈ ఐపీయ‌ల్ 2024 సీజ‌న్‌లో  వీరి మ‌ధ్య మెద‌టి మ్యాచ్ మొహాలీ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. దీంతో సొంత గ్రౌండ్ అయిన పంజాబ్ కి అద‌న‌పు అడ్వాంటేజ్ అంటున్నారు విశ్లేష‌కులు. 

వీళ్లిద్ద‌రి మ‌ధ్య ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్‌ల్లో మ‌యాంక్ అగ‌ర్వాల్ 450, డేవిడ్ వార్న‌ర్ 405, శిఖ‌ర్ ధావ‌న్ 396 ప‌రుగుల‌తో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లుగా ఉన్నారు. ఇక 20 వికెట్ల‌తో అక్ష‌ర్ ప‌టేల్ అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడు కాగా, చెరి 14 వికెట్ల‌తో ఇర్ఫాన్ ప‌ఠాన్‌, సందీప్ శ‌ర్మ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక శిఖ‌ర్ ధావ‌న్ , సిమ్ర‌న్‌జీత్ కౌర్ సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లుగా ఉన్నారు.
 
రెండు జ‌ట్ల మ‌ధ్య విజ‌యాల్లో పెద్ద‌గా అంత‌రాల్లేక పోవ‌డం, పంజాబ్ కొంత బ‌లంగా క‌నిపించ‌డం చూస్తుంటే.. మేమంటే మేమే గెలుస్తామ‌నే విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నాయి రెండు టీంలు. ఇరు జ‌ట్ల‌కు ఈ సీజ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కం కావ‌డంతో పోరు మాత్రం ర‌స‌వ‌త్త‌రంగాఉండే అవ‌కాశాలున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP DesamUS Election Results 5 Reasons for Kamala Harris Defeat

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
Vangalapudi Anitha: 'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Mancherial News: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
Embed widget