అన్వేషించండి

IPL 2024: ప్రతీకారం కోసం చెన్నై - ఆధిపత్యం కోసం లక్నో, ఐపీఎల్ పోరు ఆసక్తికరం

CSK vs LSG : : డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై, లక్నోపై ప్రతీకారానికి సిద్ధమైంది. . చెన్నైలో మ్యాచ్ జరుగుతుండడం, ధోనీ మెరుపులు మెరిపిస్తుండడంతో vచిదంబరం స్టేడియానికి అభిమానులు పోటెత్తనున్నారు

IPL 2024 CSK vs LSG  Preview and prediction : ఐపీఎల్‌(IPL)లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్(CSK)... లక్నో(LSG)పై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. గత మ్యాచ్‌లో క్వింటన్‌ డికాక్‌, కెప్టెన్‌ కె.ఎల్‌.రాహుల్‌  చెలరేగడంతో చెన్నైపై లక్నో విజయాన్ని అందుకుంది. ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రుతురాజ్‌ గైక్వాడ్‌ సేన తహతహలాడుతోంది. చెన్నైలో ఈ మ్యాచ్ జరుగుతుండడం... ధోనీ మెరుపులు మెరిపిస్తుండడంతో చెన్నైలోని చిదంబరం స్టేడియానికి అభిమానులు పోటెత్తనున్నారు. మైదానం మొత్తం పసుపుమయంగా మారనుంది. పాయింట్ల పట్టికలో నాలుగు స్థానంలో ఉన్న చెన్నై... అయిదో స్థానంలో ఉన్న లక్నో ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలోపైకి ఎగబాకాలని చూస్తున్నాయి.

హోంగ్రౌండ్‌లో చెన్నైతో కష్టమే
 చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. హౌంగ్రౌండ్‌లో చెన్నైను ఓడించడం  అంత తేలికైన విషయం కాదు. చెన్నై అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. హోంగ్రౌండ్‌లో చెన్నై ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లోనూ విజయాలు సాధించి ప్లే ఆఫ్‌కు చేరాలని చెన్నై వ్యూహాలు రచిస్తోంది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే రాణిస్తుండడం చెన్నైకు కలిసి వస్తోంది. లక్నోతో జరిగిన గత మ్యాచ్‌లో వీరిద్దరూ తడపడడం ఆ  జట్టుకు కలిసి వచ్చింది. ఈసారి  లక్నోకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గెలవాలని చెన్నై పట్టుదలతో ఉంది. అయితే ఓపెనర్ రచిన్ రవీంద్ర ఫామ్ చెన్నైను ఆందోళన పరుస్తున్న వేళ  అజింక్యా రహానేని చెన్నై ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది. ఇప్పుడు రుతురాజ్‌  వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఓపెనర్‌గా రుతురాజ్‌ మూడుసార్లు 50కుపైగా పరుగులు సాధించాడు. రుతురాజ్‌ మళ్లీ ఓపెనర్‌గా వస్తాడా.. లేక వన్‌డౌన్‌లోనే కొనసాగుతాడా అన్నదానిపై స్పష్టత లేదు. రవీంద్ర జడేజా కూడా టచ్‌లోకి రాగా... మొయిన్ అలీ, MS ధోనీ చివర్లో ధాటిగా ఆడుతున్నారు. లక్నోతో మ్యాచ్‌లో మరోసారి బ్యాటర్లు మెరవాలని చెన్నై కోరుకుంటోంది. చెన్నై బౌలింగ్ బలంగా ఉంది. మతీషా పతిరాణ మెరుగ్గా రాణిస్తున్నాడు. దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్‌లు కూడా ఫామ్‌ అందుకుంటే లక్నోకు కష్టాలు తప్పవు. జడేజా బౌలింగ్‌లో ఇంకా రాణించాల్సి ఉంది. 


లక్నోకు బ్యాటింగ్‌ సమస్య
లక్నోను బ్యాటింగ్‌ సమస్య వేధిస్తోంది. క్వింటన్‌ డికాక్‌, రాహుల్‌, దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్‌లు ఉన్నా భారీ స్కోర్లు నమోదు చేయడంలో లక్నో తడబడుతోంది. పూరన్‌ భారీ ఇన్నింగ్స్ ఆడాలని లక్నో కోరుకుంటోంది. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగితే లక్నో బౌలింగ్‌ బలోపేతం అవుతోంది. పేసర్లు మొహ్సిన్ ఖాన్, యష్ ఠాకూర్ చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌లో మెరుగ్గానే రాణించారు. మాట్ హెన్రీ తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యా మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది. రవి బిష్ణోయ్ ఎలా రాణిస్తాడో చూడాలి.

జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ధోని, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరాణ, మతీషా సింధు , మోయిన్ అలీ, మిచెల్ శాంట్నర్, షేక్ రషీద్, అరవెల్లి అవనీష్, మహేశ్ తీక్షణ, హంగర్గేకర్, సిమర్జీత్ సింగ్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, అజయ్ జాదవ్ మండల్, రిచర్డ్ గ్లీసన్, దీపక్ చాహర్.

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్‌), దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్, యశ్ ఠాకూర్, మణిమారన్ సిద్ధార్థ్, ప్రేరక్ మన్కడ్, అర్షద్ మన్కడ్, ఖాన్, కృష్ణప్ప గౌతం, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, నవీన్-ఉల్-హక్, దేవదత్ పడిక్కల్, యుధ్వీర్ సింగ్ చరక్, మయాంక్ యాదవ్, అర్షిన్ కులకర్ణి.

టాప్ హెడ్ లైన్స్

Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
Abishek Porel Arrest: ఐపీఎల్ స్టార్ అభిషేక్ పోరెల్ కు బిగ్ షాక్.. తక్షణమే అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశం
ఐపీఎల్ స్టార్ అభిషేక్ పోరెల్ కు బిగ్ షాక్.. తక్షణమే అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశం
Hitman Records Alert: రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!
రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget