(Source: ECI/ABP News/ABP Majha)
SRH vs MI: సన్‌రైజర్స్ ప్లేయింగ్ XIలో అతడు! మళ్లీ.. ముంబయి ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్?
SRH vs MI, IPL 2023: సన్‌రైజర్స్, ముంబయి మ్యాచులు ఎప్పుడూ ఇంట్రెస్టింగానే సాగుతాయి. భీకరమైన బౌలర్లు ఉండటమే ఇందుకు కారణం. మరి నేటి మ్యాచులో రెండు ఫ్రాంచైజీలు ఎలాంటి జట్లను బరిలోకి దించనున్నాయి?
SRH vs MI, IPl 2023:
సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మ్యాచులు ఎప్పుడూ ఇంట్రెస్టింగానే సాగుతాయి. తక్కువ స్కోర్లే నమోదైనా ప్రతిసారీ డిఫెండ్ చేసుకొనేందుకే ప్రయత్నిస్తాయి. భీకరమైన బౌలర్లు ఉండటమే ఇందుకు కారణం. మరి నేటి మ్యాచులో రెండు ఫ్రాంచైజీలు ఎలాంటి జట్లను బరిలోకి దించనున్నాయి? ఇంపాక్ట్ ప్లేయర్ల స్ట్రాటజీ ఏంటి?
Firestorm is coming and in some style 🔥🧡 pic.twitter.com/MJH1cobZYX
— SunRisers Hyderabad (@SunRisers) April 17, 2023
సన్‌రైజర్స్ హైదరాబాద్
తొలుత బ్యాటింగ్ చేస్తే: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జన్‌సెన్, మయాంక్ మర్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్
తొలుత బౌలింగ్ చేస్తే: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జన్‌సెన్, మయాంక్ మర్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ కూర్పు బాగా కుదిరింది. దీనిని కదలించాల్సిన అవసరం లేదు. వాషింగ్టన్ సుందర్‌ను తన సామర్థ్యం మేరకు ఉపయోగించుకోవడం అవసరం. తొలుత బ్యాటింగ్ హ్యారీబ్రూక్ తుది జట్టులో ఉంటాడు. తొలుత బౌలింగ్ చేస్తే నటరాజన్ ఉంటాడు. అవసరాన్ని బట్టి వీరే ఇంపాక్ట్ ప్లేయర్లుగా మారతారు.
ముంబయి ఇండియన్స్
తొలుత బ్యాటింగ్ చేస్తే: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కామెరాన్ గ్రీన్, నెహాల్ వాధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, రిలే మెరిడీత్, డువాన్ జన్‌సెన్ / జేసన్ బెరెన్‌డార్ఫ్
తొలుత బౌలింగ్ చేస్తే: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, కామెరాన్ గ్రీన్, నెహాల్ వాధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, రిలే మెరిడీత్, డువాన్ జన్‌సెన్ / జేసన్ బెరెన్‌డార్ఫ్, అర్షద్ ఖాన్ / అర్జున్ తెందూల్కర్
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడ్డ జట్టునే ముంబయి ఇండియన్స్ దించే అవకాశం ఉంది. అర్జున్ తెందూల్కర్‌ను చివరి మ్యాచులో రెండు ఓవర్లకే ఉపయోగించారు. సూర్యకుమార్ యాదవ్ ఇంప్టాక్ ప్లేయర్‌గా ఉంటాడు. తొలుత బ్యాటింగ్ చేస్తే నేరుగా జట్టులో ఉంటాడు. ఒకవేళ తొలుత బౌలింగ్ చేస్తే అర్జున్ తెందూల్కర్ ఉంటాడు.
ఉప్పల్ పిచ్ రిపోర్ట్!
ఉప్పల్ వికెట్ సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. బౌలర్లకే ఎక్కువగా అనుకూలిస్తుంది. సీమర్లు, స్పిన్నర్లు వికెట్లు తీస్తుంటారు. నిలబడితే బ్యాటర్లు దంచికొట్టగలరు. డ్యూ ఫ్యాక్టర్ సైతం తక్కువే ఉంటుంది. అందుకే ఇక్కడ స్వల్ప స్కోర్లనూ డిఫెండ్ చేసుకోగలరు. ఇప్పటి వరకు ఉప్పల్‌లో 66 ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 28, ఛేదన జట్టు 38 గెలిచాయి. టాస్ గెలిచిన వారికన్నా ఓడిన వారికే విజయాల శాతం (66.67) ఎక్కువ. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజి 158 రన్స్‌గా ఉంది.
Everytime Harry picks up the bat 👇🏼
— SunRisers Hyderabad (@SunRisers) April 17, 2023
"What a WOW, WOW, WOW 😍🔥" pic.twitter.com/lzmYXov8q5