SRH vs MI: ఆరెంజ్ ఆర్మీలో 5 ఆటగాళ్లంటే ముంబయికి హడల్!
SRH vs MI: ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో విజయం కోసం పట్టుదలగా ఉంది. ఐదుగురు ఆటగాళ్లకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. వారు గనక అంచనాలకు తగ్గట్టు రాణిస్తే ఆరెంజ్ ఆర్మీదే గెలుపు!
![SRH vs MI: ఆరెంజ్ ఆర్మీలో 5 ఆటగాళ్లంటే ముంబయికి హడల్! IPl 2023 SRh vs MI Harry brook Rahul Tripathi marco jansen maynak markande srh key players SRH vs MI: ఆరెంజ్ ఆర్మీలో 5 ఆటగాళ్లంటే ముంబయికి హడల్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/18/ec3936410f7f49c3b32b72a468e1c7761681810480635251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
SRH vs MI, IPl 2023:
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో విజయం కోసం పట్టుదలగా ఉంది. ముంబయి ఇండియన్స్‌ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకుంది. ఐదుగురు ఆటగాళ్లకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. వారు గనక అంచనాలకు తగ్గట్టు రాణిస్తే ఆరెంజ్ ఆర్మీదే గెలుపు! ఇంతకీ వాళ్లెవరు! ఏంటీ వాళ్ల స్పెషాలిటీ!
హ్యారీ బ్రూక్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కోట్లు పెట్టి కొనుకున్న ఆటగాడు హ్యారీ బ్రూక్ (Harry Brook). తొలి మూడు మ్యాచుల్లో ఆడిందేమీ లేదు. త్వరగా పెవిలియన్ చేరాడు. నాలుగో మ్యాచులో ఓపెనర్‌గా వచ్చి విధ్వంసం సృష్టించాడు. ఏకంగా సెంచరీ కొట్టేశాడు. ప్రస్తుతానికి ఆరెంజ్ ఆర్మీలో టాప్ స్కోరర్ అతడే. 129 రన్స్ చేశాడు. అతడి సెంచరీలో ఎక్కువగా కవర్ పాయింట్, బ్యాక్‌వర్గ్ పాయింట్ మధ్యే స్కోర్ వచ్చింది. కాబట్టి ముంబయి అతడికి ఎలాంటి రూమ్ ఇవ్వకపోవచ్చు. ఆ వ్యూహాన్ని బద్దలు కొడితే బ్రూక్స్ పని పూర్తవుతుంది.
రాహుల్ త్రిపాఠి: ఇండియన్ క్రికెట్లో రాహుల్ త్రిపాఠి (Rahul Tripathi) ఓ అన్‌సంగ్ హీరో! మంచి టెక్నిక్.. అంతకు మించిన టైమింగ్.. ఎలిగాంట్ బ్యాటింగ్ అతడి సొంతం. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌కు నిలకడగా పరుగులు చేస్తుంది అతనొక్కడే. 4 మ్యాచుల్లో 39 సగటు, 123 స్ట్రైక్‌రేట్‌తో 117 రన్స్ చేశాడు. అతనాడితే సన్‌రైజర్స్ భారీ స్కోరు చేయడం ఖాయం.
అభిషేక్ శర్మ: సన్‌రైజర్స్ హైదరాబాద్ రీటెయిన్ చేసుకున్న ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma). దేశవాళీ క్రికెట్లో పంజాబ్‌కు కెప్టెన్సీ చేస్తున్నాడు. ఈ సీజన్లో 2 మ్యాచుల్లో 160 స్ట్రైక్‌రేట్‌తో 32 రన్స్ చేశాడు. మిడిలార్డర్లో అయిడెన్ మార్‌క్రమ్‌కు అతడు అండగా ఉండాలి. లెఫ్ట్‌హ్యాండర్ కావడం.. లాఫ్టెడ్ షాట్లు ఆడటం అతడి స్పెషాలిటీ. ఐపీఎల్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో అత్యంత వేగంగా రన్స్ చేస్తున్న ఆటగాడు అభిషేక్
మార్కో జన్‌సెన్: ఈ యువ ఆటగాడు ఆరెంజ్ ఆర్మీకి ఎంతో ఇంపార్టెంట్. వేగంగా.. కన్‌సిస్టెంట్‌గా బంతులు వేయడం తడి స్పెషాలిటీ. ఈ ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో 4 వికెట్లు తీసుకున్నాడు. పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో బౌలర్. ఎకానమీ 7.53. ముంబయి ఓపెనింగ్ జోడీని ఇబ్బంది పెట్టగలడు జన్ సెన్ (Marco Jansen). గతంలో ఆ ఫ్రాంచైజీకి ఆడిన అనుభవం ఉంది.
మయాంక్ మర్కండే: సన్‌రైజర్స్ అంటేనే బలమైన బౌలింగ్ లైనప్! అలాంటిది ఈ సీజన్లో టాప్ 10లో ఎవ్వరూ లేరు. మయాంక్ మర్కండే ఒక్కడే 11వ ర్యాంకులో ఉన్నాడు. 2 మ్యాచుల్లో 7 సగటు, 5.25 ఎకానమీతో 6 వికెట్లు తీశాడు. బెస్ట్ 15/4. సగటు 8 బంతులకు ఒక వికెట్ తీస్తున్నాడు. ముంబయిని కట్టడి చేయాలన్నా.. త్వరగా వికెట్లు పడగొట్టాలన్నా మర్కండే (Mayank Markande) కీలకం. పైగా ముంబయి ఎక్స్ ప్లేయర్ అతడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్
తొలుత బ్యాటింగ్ చేస్తే: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జన్‌సెన్, మయాంక్ మర్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్
తొలుత బౌలింగ్ చేస్తే: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జన్‌సెన్, మయాంక్ మర్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ కూర్పు బాగా కుదిరింది. దీనిని కదలించాల్సిన అవసరం లేదు. వాషింగ్టన్ సుందర్‌ను తన సామర్థ్యం మేరకు ఉపయోగించుకోవడం అవసరం. తొలుత బ్యాటింగ్ హ్యారీబ్రూక్ తుది జట్టులో ఉంటాడు. తొలుత బౌలింగ్ చేస్తే నటరాజన్ ఉంటాడు. అవసరాన్ని బట్టి వీరే ఇంపాక్ట్ ప్లేయర్లుగా మారతారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)