(Source: ECI/ABP News/ABP Majha)
RR vs LSG: టాస్ గెలిచిన సంజూ! రాహుల్ సేనదే ఫస్ట్ బ్యాటింగ్
RR vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో నేడు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. రాజస్థాన్ సారథి సంజూ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
RR vs LSG, IPL 2023:
ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో నేడు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ వేశారు. రాజస్థాన్ సారథి సంజూ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. వికెట్ చాలా బాగుందన్నాడు. నాలుగేళ్ల తర్వాత ఇక్కడ ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. ఆడమ్ జంపా స్థానంలో జేసన్ హోల్డర్‌ను తీసుకున్నామని వివరించాడు.
'మేం మొదట బౌలింగ్ చేస్తాం. వికెట్ చాలా బాగుంది. నాలుగేళ్ల తర్వాత జైపుర్‌కు వచ్చి ఆడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఒత్తిడి ఎదురైనప్పుడు ఎలా ఆడతామన్నదే ముఖ్యం. మేం ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతున్నాం. జంపా ప్లేస్‌లో జేసన్ వస్తున్నాడు' అని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.
Are we ready to witness some monstrous hits off @MStoinis' bat tonight in Jaipur 😉 #TATAIPL | #RRvLSG | @LucknowIPL pic.twitter.com/6Ytr2VkV8D
— IndianPremierLeague (@IPL) April 19, 2023
'మేం కూడా బౌలింగే చేయాలనుకున్నాం. జైపుర్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. తొలుత బ్యాటింగ్ చేస్తున్నాం కాబట్టి మంచి స్కోరు చేయడం ముఖ్యం. చాలా మ్యాచుల్లో మేం బాగానే ఆడాం. బౌలింగ్, బ్యాటింగ్‌లో స్పష్టతతో ఉన్నాం. మా జట్టు సెటిలైంది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉంచేందుకు ట్రై చేస్తున్నాం. క్వింటన్ డికాక్‌కు ఈ మ్యాచులోనూ చోటు దక్కలేదు. మరికొంత టైమ్ ఎదురు చూడక తప్పదు. అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకిష్టం. కానీ తప్పదు..' అని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.
The gloves are off, and the bats are blazing 🔥@josbuttler vs @klrahul, who will come out on top?#RRvsLSG #IPL2023 #TATAIPL | @LucknowIPL @rajasthanroyals pic.twitter.com/lJtCL78EKY
— JioCinema (@JioCinema) April 19, 2023
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్‌మైయిర్, ధ్రువ్ జోరెల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, నికోలస్ పూరన్, మార్కస్ స్టాయినిస్, ఆయుష్ బదోనీ, నవీన్ ఉల్ హఖ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, యుధ్‌వీర్ చరక్
రాయల్స్‌దే అప్పర్ హ్యాండ్!
లక్నో సూపర్ జెయింట్స్ ఇండియన్ ప్రీమియర్ లీగులో గతేడాదే అరంగేట్రం చేసింది. ప్లేఆఫ్ చేరుకొని అదరగొట్టింది. అయితే రాజస్థాన్ రాయల్స్ చేతిలో వరుసగా రెండు సార్లు ఓడింది. 2022 ఏప్రిల్ 10న 3 పరుగులు, మే 15న 24 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అందుకే ఈ సారి ప్రతీకారం తీర్చుకోవాలని ట్రై చేస్తోంది. కాగా ఛేదనలో లక్నో జట్టుకు మెరుగైన రికార్డు లేదు. ఛేదనలో విన్నింగ్స్ పర్సెంటేజీ కనీసం 20 అయినా లేదు. గతేడాది రాయల్స్ చేతిలో రెండుసార్లూ ఛేదనలోనే విఫలమైంది.
Rajasthan Royals Skipper Sanju Samson wins the toss and elects to bowl first in their first home game in Jaipur.
— IndianPremierLeague (@IPL) April 19, 2023
Live - https://t.co/gyzqiryPIq #TATAIPL #RRvLSG #IPL2023 pic.twitter.com/58U0FhChXJ