అన్వేషించండి

RR Vs CSK: రాజస్తాన్, చెన్నై హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి? - గెలుపు గుర్రాలు ఎవరు?

ఐపీఎల్‌లో నేడు సాయంత్రం రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.

Rajasthan Royals vs Chennai Super Kings, IPL 2023 Match 37: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శామ్సన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ జట్లు నేడు ముఖాముఖిగా తలపడనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ హైవోల్టేజీ మ్యాచ్ జరగనుంది.

హెడ్ టు మ్యాచ్‌ల్లో ఎవరిది రికార్డు?
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ మధ్య 27 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో చెన్నై 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరోవైపు రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఒక మ్యాచ్ ఇప్పటికే జరిగింది. అంతకుముందు ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో సంజూ శామ్సన్ జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈసారి ఎవరిది పైచేయి?
ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే బ్యాటింగ్ పరంగా ఇరు జట్లు దాదాపు సమానంగానే ఉన్నాయి. బౌలింగ్ లో మాత్రం చెన్నై జట్టు కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. చెన్నై ఫాస్ట్ బౌలర్లలో అనుభవజ్ఞులైన బౌలర్లు లేరు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌లో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, జాసన్ హోల్డర్ వంటి మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్ విభాగం బాగుంది. రవీంద్ర జడేజా, మహీష్ తీక్షణ, మొయిన్ అలీ వంటి స్పిన్నర్లు ఉన్నారు. కానీ రాజస్థాన్‌లో అత్యుత్తమ స్పిన్ త్రయం (యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, ఆడం జంపా) ఉంది.

ఈ టోర్నీలో మొదటి రెండు మ్యాచులు చూస్తే చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Superkings)  ఏం ఆడుతుందో అనిపించింది! సీజన్‌ సగం ముగిసే సరికి తిరగులేని పొజిషన్లో నిలిచింది. ఇందుకు ఒకే ఒక్క రీజన్‌ సీఎస్కే బ్యాటింగ్‌ యూనిట్‌. బలహీనమైన తమ బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌పై ఒత్తిడి లేకుండా పెద్ద టోటల్స్‌ చేస్తున్నారు. సాధారణంగా నెమ్మదిగా పరుగుల వేట ఆరభించే ధోనీసేన.. ఈసారి మెరుపులు మెరిపిస్తోంది. రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వే అదరగొడుతున్నారు. కాన్వే అయితే డిస్ట్రక్టివ్‌గా ఆడుతున్నాడు. అజింక్య రహానె వీర బాదుడు బాదడం ప్రెజర్‌ తగ్గిస్తోంది. మిడిలార్డర్లో శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా బాగా ఆడుతున్నారు. అంబటి రాయుడు, ధోనీ గురించి తెలిసిందే. బౌలింగ్‌ పరంగా ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి. బెన్‌స్టోక్స్‌, దీపక్‌ చాహర్‌ అందుబాటులో లేరు. ప్రత్యర్థుల ముందు భారీ లక్ష్యాలు ఉండటం... ధోనీ వ్యూహాలతో ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నారు. నెమ్మది పిచ్‌లుండే జైపుర్‌లో సీఎస్కే బ్యాటింగ్‌ ఎలా ఉంటుందో చూడాలి.

రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు (అంచనా)
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రన్ హెట్‌మేయర్, ధ్రువ్ జురెల్, ఆర్ అశ్విన్, సందీప్ శర్మ, ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు (అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, మతిషా పతిరనా, ఆకాష్ సింగ్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget