PBKS vs LSG: గబ్బర్ వచ్చేశాడు! టాస్ గెలిచేశాడు!
PBKS vs LSG: ఐపీఎల్ 2023లో నేడు 38వ మ్యాచ్ జరుగుతోంది. మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. మ్యాచ్ టాస్ వేశారు.
PBKS vs LSG, IPL 2023:
ఐపీఎల్ 2023లో నేడు 38వ మ్యాచ్ జరుగుతోంది. మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని చెప్పాడు. జట్టులో రెండు మార్పులు చేసినట్టు పేర్కొన్నాడు.
A look at the Playing XI for #PBKSvLSG
— IndianPremierLeague (@IPL) April 28, 2023
Live - https://t.co/6If1I4nOXs #TATAIPL #PBKSvLSG #IPL2023 pic.twitter.com/IpUXZgyoBk
'మేం మొదట బౌలింగ్ చేస్తాం. నా భుజం బాగుంది. నొప్పేమీ లేదు. మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాం. ఇంకా ఏడు మ్యాచులున్నాయి. ఎక్కువ గెలవాలని కోరుకుంటున్నాం. రెండు మార్పులు చేశాం. మాథ్యూ షార్ట్ బదులు సికిందర్ రజా వస్తున్నాడు. ఓ ఫాస్ట్ బౌలర్ అరంగేట్రం చేస్తున్నాడు' అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు.
'ఏ జట్టుకు ఆడినా మోటివేషన్ ఒకేలా ఉంటుంది. అవును.. మొహాలి కండీషన్స్ నాకు బాగా తెలుసు. వికెట్ బాగుంది. డ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే టాస్ గెలిస్తే తొలుత బౌలింగ్ ఎంచుకుంటారు. సేమ్ టీమ్‌తో వస్తున్నాం' అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.
పంజాబ్ కింగ్స్: అథర్వ తైడె, శిఖర్ ధావన్, సికిందర్ రజా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరణ్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, కాగిసో రబాడా, రాహుల్ చాహర్, గురునూర్ బ్రార్, అర్షదీప్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టాయినిస్, కృనాల్ పాండ్య, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, నవీన్ ఉల్ హఖ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్
Congratulations to Gurnoor Brar who is all set to make his debut for the @PunjabKingsIPL
— IndianPremierLeague (@IPL) April 28, 2023
Live - https://t.co/6If1I4omN0 #TATAIPL #PBKSvLSG #IPL2023 pic.twitter.com/DyNzwaKHhN
లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) గెలుపు అవకాశాలను చేజేతులా వదులుకుంటోంది. మ్యాచ్ మొత్తం పట్టుబిగించి కొద్దిలో సడలిస్తోంది. ప్రత్యర్థులకు అవకాశం ఇస్తోంది. దీన్నుంచి వేగంగా బయటపడాలి. ఇక ఛేదనలో మరింత దూకుడుగా ఉండాలి. భీకరమైన బ్యాటింగ్ లైనప్ పెట్టుకొని టార్గెట్లను ఛేజ్ చేసేందుకు ఇబ్బంది పడుతోంది. కేఎల్ రాహుల్ (KL Rahul) ఫామ్‌లోకి వచ్చాడు. స్లో పిచ్‌లపై అదరగొడుతున్నాడు. అయితే మిగతా వికెట్లపై అటాకింగ్ మోడ్ అవసరం. కైల్ మేయర్స్ ప్లేస్‌లో డికాక్‌కు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. దీపక్ హుడా, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోనీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. స్టాయినిస్, పూరన్ ఎప్పటికీ డేంజరే. లక్నో బౌలింగ్ మాత్రం అద్భుతం! మార్క్‌వుడ్‌కు రెస్ట్ ఇచ్చినా.. నవీనుల్ హఖ్ అదరగొడుతున్నాడు. యుధ్‌వీర్ బాగున్నాడు. అవేశ్ ఖాన్ గురించి తెలిసిందే. స్టాయినిస్ మీడియం పేస్‌తో వికెట్లు తీస్తున్నాడు. బిష్ణోయ్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. అమిత్ మిశ్రా లేటు వయసులోనూ సత్తా చాటుతున్నాడు.
#PBKS have won the toss and elect to bowl first against #LSG.
— IndianPremierLeague (@IPL) April 28, 2023
Live - https://t.co/6If1I4omN0 #TATAIPL #PBKSvLSG #IPL2023 pic.twitter.com/L8b7dO7Va3