అన్వేషించండి

IPL 2023 Points Table: పాయింట్ల పట్టికలో ముందుకొచ్చిన సన్‌రైజర్స్ - టాప్‌లో ఎవరున్నారు?

పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ ఎనిమిదో స్థానానికి చేరుకుంది.

IPL 2023 Updated Points Table: ఐపీఎల్ 16వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ మొదటి విజయాన్ని నమోదు చేయడం ద్వారా పాయింట్ల పట్టికలో తమ ఖాతాను తెరిచింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 144 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.1 ఓవర్లలోనే ఛేదించడంతోపాటు నెట్ రన్‌రేట్‌ను కూడా కొంత మెరుగుపరుచుకుంది.

ఇప్పుడు పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఇందులో జట్టు నెట్ రన్‌రేట్ -1.502గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇవి రెండూ ఇప్పటి వరకు పాయింట్ల ఖాతా తెరవలేకపోయాయి. ముంబై నెట్ రన్‌రేట్ ప్రస్తుతం -1.394 కాగా, ఢిల్లీ రన్‌రేట్ -2.092గా ఉంది.

మొదటి స్థానంలో రాజస్తాన్
పాయింట్ల పట్టికలో 14 లీగ్ మ్యాచ్‌లు ముగియగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు నాలుగు పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండిట్లో గెలిచింది. అందులో వారి నెట్ రన్‌రేట్ 2.067గా నిలిచింది. దీంతో కోల్‌కతా, లక్నో జట్లు పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో గుజరాత్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించిన కోల్‌కతా జట్టు ఇప్పుడు నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది, ఇందులో జట్టు నెట్ రన్‌రేట్ 1.375గా ఉంది. అదే సమయంలో లక్నో జట్టు దగ్గ కూడా నాలుగు పాయింట్లే ఉన్నప్పటికీ మూడో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.

ప్రస్తుతం, పాయింట్ల పట్టికలో, చెన్నై సూపర్ కింగ్స్ మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో వారి నెట్ రన్‌రేట్ 0.356గా ఉంది. ఇప్పుడు ఆరో స్థానంలో పంజాబ్ కింగ్స్ జట్టు ఉంది. వారు నాలుగు పాయింట్లతో ఉన్నారు. జట్టు నెట్ రన్‌రేట్ -0.235 అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.

ఐపీఎల్ - 16లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. గుజరాత్ టైటాన్స్  - కోల్‌కతా  నైట్  రైడర్స్ మధ్య ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన సీజన్ 13వ మ్యాచ్‌లో జీటీకి స్టాండ్ ఇన్ స్కిప్పర్‌గా బరిలోకి దిగిన  రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వికెట్లతో  చెలరేగాడు. ఈ సీజన్ లో  ఇదే తొలి హ్యాట్రిక్  కావడం గమనార్హం. కేకేఆర్  ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రషీద్ ఈ అద్భుతాన్ని చేశాడు. వరుస బంతుల్లో ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్ లతో పాటు ఆర్సీబీతో గత మ్యాచ్‌లో గడగడలాడించిన  శార్దూల్ ఠాకూర్‌ను ఔట్ చేశాడు.  తద్వారా  ఈ సీజన్ లో తొలి హ్యాట్రిక్ తీసిన బౌలర్ గానే గాక   పలు రికార్డులను నమోదు చేశాడు.

రషీద్ ఖాన్ హ్యాట్రిక్  ఈ సీజన్ తో పాటు గుజరాత్ టైటాన్స్‌కు కూడా మొదటిదే. గతేడాది ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టుకు  ఇదే ఫస్ట్ హ్యాట్రిక్. ఇక మొత్తంగా ఐపీఎల్ లో   22వది. రషీద్ ఖాన్‌కు  కూడా ఐపీఎల్ లో ఇదే ఫస్ట్ హ్యాట్రిక్. గతంలో అతడు  కరేబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్ తో  పాటు ఐర్లాండ్ తో అంతర్జాతీయ  మ్యాచ్ లో హ్యాట్రిక్ తీశాడు. మొత్తంగా అతడికి టీ20 ఫార్మాట్‌లో ఇది నాలుగో హ్యాట్రిక్. తద్వారా రషీద్.. టీ20లలో  మూడు సార్లు హ్యాట్రిక్ తీసిన  ఆండ్రూ టై, అమిత్ మిశ్రా,  ఆండ్రూ రసెల్, ఇమ్రాన్ తాహిర్ ల రికార్డును అధిగమించాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget