By: Rama Krishna Paladi | Updated at : 20 Apr 2023 12:04 PM (IST)
పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Image Source : Twitter, IPL )
PBKS vs RCB, IPL 2023:
ఐపీఎల్ 2023లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఢీకొంటున్నాయి. మొహాలి వేదికగా డిష్యూం.. డిష్యూం చేయనున్నాయి. మరి వీరిలో ఎవరిది ఆధిపత్యం? రీసెంట్ ఫామ్ ఏంటి? మొహాలి పిచ్ రిపోర్టు ఏంటి?
పంజాబే.. కింగ్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారీ ట్రోఫీ ముద్దాడలేదు. ప్లేఆఫ్స్ మాత్రం చాలా సార్లు చేరుకున్నాయి. మొదట్నుంచీ ఆర్సీబీలో స్టార్లకు పెద్దపీట వేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ ఆ ప్రయత్నం చేసినా ఎవ్వరూ నిలవడం లేదు. ఈసారి మాత్రం కాస్త గట్టిగానే కనిపిస్తోంది. ఇక పొట్టి లీగులో ఆర్సీబీపై పంజాబ్‌దే స్పష్టమైన ఆధిపత్యం. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 30 సార్లు తలపడితే 17-13తో భల్లే.. భల్లే టీమ్‌దే అప్పర్ హ్యాండ్. మొహాలిలో మాత్రం 3-3తో సమంగా ఉన్నారు.
5-1 తేడాతో అప్పర్ హ్యాండ్!
ఐపీఎల్‌లో మూడేళ్ల నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పంజాబ్ కింగ్స్ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. చివరిసారి తలపడ్డ ఆరు సార్లలో పంజాబ్ ఏకంగా ఐదు సార్లు గెలిచింది. ఆర్సీబీ ఒకే ఒక్కసారి విజయం సాధించింది. 2020లో పంజాబ్ రెండు మ్యాచూల్లోనూ గెలిచింది. 2021లో మాత్రం చెరోటి గెలిచారు. 2022లో మాత్రం కంప్లీట్ డామినేషన్ పంజాబ్‌దే. అటు ఛేజింగ్.. ఇటు డిఫెండ్ చేయడంలో ఆరితేరింది.
మొహాలి రిపోర్ట్
మొహాలి పెద్ద స్టేడియమే అయినా పరుగుల వరద పారుతుంది. 2018 నుంచి యావరేజి ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 175గా ఉంది. అయితే యావరేజి ఫస్ట్ ఇన్నింగ్స్ విన్నింగ్ టోటల్ మాత్రం 186గా ఉంది. వాతావరణం వేడిగా ఉక్కపోతగా ఉంటుంది. వర్షం కురిసే ఛాన్సు లేకపోలేదు. మొహాలిలో మొత్తం 57 మ్యాచులు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 25, ఛేదన జట్టు 32 సార్లు గెలిచాయి. టాస్ ఓడిన జట్టు విజయాల శాతం 50.88గా ఉండటం విశేషం. బౌలర్లకు వికెట్లు పడగొట్టడం అంత ఈజీ కాదు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహి పాల్ లోమ్రార్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోను యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్వెస్, హిమాన్షు శర్మ, రీస్ టాప్లీ.
పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్సే, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబడ రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, సామ్ కరణ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కేవరప్ప, మోహిత్ రాఠి, శివమ్ సింగ్.
#SherSquad, who will provide the @EbixCash Moment Of The Match when we take on RCB at Sadda Akhada? 🤔#JazbaHaiPunjabi #SaddaPunjab #PBKSvRCB #TATAIPL pic.twitter.com/zQk8cnY0Gz
— Punjab Kings (@PunjabKingsIPL) April 20, 2023
CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
IPL Final 2023: నేను సిక్సర్లు మాత్రమే కొడతా - వైరల్ అవుతున్న శివం దూబే ప్రాక్టీస్ వీడియో!
IPL Final 2023: ఐపీఎల్ ఫైనల్ ఏ టైంకి స్టార్ట్ అయితే ఎన్ని ఓవర్లు పడతాయి - 11:56 వరకు వెయిటింగ్!
ఫైనల్‌ను అడ్డుకున్న వరుణుడు - వర్షం కారణంగా టాస్ ఆలస్యం!
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!