By: ABP Desam | Updated at : 28 May 2023 01:13 AM (IST)
హార్దిక్ పాండ్యా, మహేంద్ర సింగ్ ధోని (ఫైల్ ఫొటో) ( Image Source : Twitter )
Ahmedabad Weather Forecast: ఐపీఎల్ 2023 సీజన్ చివరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మ్యాచ్ జరగనుంది. అయితే మ్యాచ్ రోజు వర్షం కురుస్తుందా?
చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య రాత్రి 7.30 గంటలకు టైటిల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దీనికి ముందు ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ ముగింపు వేడుకలో పలువురు పెద్ద స్టార్లు కనిపించనున్నారు. ఐపీఎల్ 2023 ముగింపు వేడుక సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది.
ఫైనల్స్ రోజు వాతావరణం ఎలా ఉంటుంది?
ఆదివారం అహ్మదాబాద్‌లో వాతావరణం ఎలా ఉండనుంది? Weather.com సైట్ ప్రకారం ఆదివారం అహ్మదాబాద్‌లో వర్షం కురిసే అవకాశం లేదు. ఆదివారం అహ్మదాబాద్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో వర్షం లేదని అభిమానులకు శుభవార్త వినిపించింది. అదేమిటంటే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ ను అభిమానులు ఆస్వాదించనున్నారు.
ఐపీఎల్ 2023 సీజన్ క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ భారీ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 233 పరుగులు సాధించింది. అనంతరం ముంబై ఇండియన్స్ 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 62 పరుగులతో విజయం సాధించింది. మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌లో తలపడనుంది.
ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (61: 38 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ తన స్పెల్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (129: 60 బంతుల్లో, ఏడు ఫోర్లు, 10 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అంతకు ముందు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ భారీ విజయం సాధించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ 81 పరుగులతో విజయం సాధించింది. మే 26వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్స్ ఆడనుంది.
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్ తన స్పెల్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక ముంబై బ్యాటర్లలో కామెరాన్ గ్రీన్ (41: 23 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
R Ashwin: 'ఐపీఎల్ వార్‌ఫేర్'పై స్పందించిన యాష్ - NO 4పై చర్చే వద్దన్న లెజెండ్
Gautam Gambhir: లక్నో స్ట్రాటజిక్ కన్సల్టెంట్‌గా ఎమ్మెస్కే! మెంటార్ పదవికి గంభీర్ రిజైన్ చేస్తున్నాడా!
IPL 2024: 2024 ఐపీఎల్ విదేశాల్లో జరుగుతుందా? - లోక్‌సభ ఎన్నికలే కారణమా?
Yuzvendra Chahal: ఆర్సీబీ మీద చాలా కోపమొచ్చింది, నమ్మించి మోసం చేశారు: చాహల్ సంచలన వ్యాఖ్యలు
MS Dhoni: న్యూ లుక్‌లో ధోని - ఐపీఎల్ గెలిచాక తొలిసారి చెన్నైకి తలా - ఆ సినిమా ప్రమోషన్ కోసమేనా?
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>