
IPL 2023: రూ.16.25 కోట్ల రేటు - మధ్యలోనే వదిలేసి పోతున్న స్టార్ ఆల్‌రౌండర్!
ఢిల్లీతో మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ స్వదేశానికి తిరిగి వెళ్లిపోనున్నాడు.

Indian Premier League 2023: చివరి లీగ్ మ్యాచ్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి బెన్ స్టోక్స్ రూపంలో పెద్ద దెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా ముఖ్యం. ఇంగ్లండ్, ఐర్లాండ్‌ల మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌కు, యాషెస్ సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు బెన్ స్టోక్స్ స్వదేశానికి వెళ్లిపోయాడు.
ఈ సీజన్‌లో బెన్ స్టోక్స్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వినిపిస్తున్న వార్తల ప్రకారం మే 20వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ తర్వాత బెన్ స్టోక్స్ ఇంగ్లండ్‌కు బయలుదేరుతారు. ఒకవేళ చెన్నై ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంటే బెన్ స్టోక్స్ జట్టుకు అందుబాటులో ఉండడు.
ఐపీఎల్‌లో ఆడేందుకు రాకముందే బెన్ స్టోక్స్ యాషెస్ సన్నాహకానికి సంబంధించి ఐపీఎల్ నుంచి త్వరగా తిరిగి రావడంపై ప్రకటన ఇచ్చాడు. జూన్ 1వ తేదీ నుంచి ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. యాషెస్‌కు ముందు సన్నాహం లాగా కూడా ఈ మ్యాచ్‌ను చూడవచ్చు. ఈ రెండు సిరీస్‌లకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు త్వరలో జట్టును ప్రకటించవచ్చు.
ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో చెన్నై రూ.16.25 కోట్లకు బెన్ స్టోక్స్ ను తమ జట్టులో చేర్చుకుంది. స్టోక్స్‌కు ఆడే అవకాశం లభించిన రెండు మ్యాచ్‌ల్లో అతను బ్యాట్‌తో 15 పరుగులు చేశాడు. ఇది కాకుండా అతను బౌలింగ్ వేసిన ఒకే ఓవర్లో 18 పరుగులు సమర్పించాడు. మోకాలి సమస్య కారణంగా బెన్ స్టోక్స్ 2 మ్యాచ్‌ల ఐపీఎల్‌లో ఆడలేదు. ఆ తర్వాత అతను పూర్తి ఫిట్‌గా ఉన్నా అతడిని జట్టులోకి తీసుకోలేదు.
టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడి జాబితాలో ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చేరాడు. పాకిస్థాన్ తో జరిగిన రెండో టెస్టులో మూడో రోజు ఆటలో అతను తన 107వ సిక్సును కొట్టాడు. దీంతో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ రికార్డును సమం చేశాడు. బ్రెండన్ కూడా టెస్టుల్లో 107 సిక్సులు బాదాడు. ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుకు మెక్ కల్లమ్ కోచ్ గా వ్యవహరిస్తుండడం విశేషం.
టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో స్టోక్స్ చేరాక... డ్రెస్సింగ్ రూం నుంచి కోచ్ బ్రెండన్ అతడిని చప్పట్లతో అభినందించాడు. మెక్ కల్లమే 176 ఇన్నింగ్సుల్లో 107 సిక్సులు కొడితే.. స్టోక్స్ 160 ఇన్నింగ్సుల్లోనే ఆ మార్కును అందుకున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గిల్ క్రిస్ట్ మూడో స్థానంలో ఉన్నాడు.
An emotion for all ages! 🥳#AarilirundhuAruvadhuVarai #WhistlePodu 🦁💛 pic.twitter.com/akCqXIc4rh
— Chennai Super Kings (@ChennaiIPL) May 15, 2023
A Fifer of Fire! Hats off for that team hat trick! 🥳#WhistlePodu #Yellove @BhuviOfficial
— Chennai Super Kings (@ChennaiIPL) May 15, 2023
Seems like it all happened yesterday! Here’s Anbuden Summarised! ⚡️⏩#YellorukkumThanks #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/t3AHif0GK6
— Chennai Super Kings (@ChennaiIPL) May 15, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

