Suresh Raina Gujarat Titans: గుజరాత్ టైటాన్స్‌తో సురేశ్ రైనా - ట్విటర్లో ట్రెండింగ్!
Suresh Raina with GujaratTitans: సురేశ్ రైనా పేరు ట్విటర్లో ట్రెండింగ్ అవుతోంది. గుజరాత్ టైటాన్స్ Hashtagను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.
IPL 2022 Suresh Raina: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, ఎంఎస్ ధోనీ (MS Dhoni) మిత్రుడు సురేశ్ రైనా (Suresh Raina) పేరు ట్విటర్లో ట్రెండింగ్ అవుతోంది. 'గుజరాత్ టైటాన్స్‌తో సురేశ్ రైనా' అనే (Suresh Raina with GujaratTitans) హ్యాష్‌ట్యాగ్‌ను అతడి అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇందుకో కారణం ఉంది!
'మిస్టర్ ఐపీఎల్'గా (Mister IPL)పేరు తెచ్చుకున్న సురేశ్ రైనాను ఐపీఎల్ 2022 వేలంలో (IPL Auction 2022) ఎవరూ కొనుగోలు చేయలేదు. అతడి పేరు రాగానే అన్ని ఫ్రాంచైజీలు ఏమాత్రం స్పందించలేదు. ఇన్నాళ్లూ అతడు సేవ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ సైతం వదిలేసింది. కనీస ధర రూ.2 కోట్లకు కూడా దక్కించుకొనేందుకు వెనుకాడింది. దాంతో రెండోసారి అతడు వేలం జాబితా నుంచి తన పేరు వెనక్కి తీసుకున్నాడు.
రైనాను సీఎస్‌కే తీసుకోకపోవడంతో అభిమానులు నిరాశచెందారు. అతడిని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. జట్టు కూర్పు మేరకు అతడిని తీసుకోలేకపోయామని సీఎస్‌కే యాజమాన్యం వివరించినా వారు అంగీకరించలేదు. అయితే ఇంగ్లాండ్ ఆటగాడు జేసన్ రాయ్ (Jason Roy) ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించాడు. బయో బుడగ ఒత్తిడి తట్టుకోలేక పోతున్నానని, అందుకే రావడం లేదని ప్రకటించాడు. దాంతో గుజరాత్ టైటాన్స్‌లో ఒక స్థానం ఖాళీ అయ్యింది. ఆ ప్లేస్‌లో సురేశ్ రైనాను తీసుకోవాలని అభిమానులు ట్రెండింగ్ చేస్తున్నారు.
చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఐపీఎల్‌లో రెండేళ్ల నిషేధం వేటు వేసినప్పుడు గుజరాత్ లయన్స్ జట్టుకు సురేశ్ రైనా కెప్టెన్సీ చేశాడు. దాంతో గుజరాత్ జెర్సీని రైనా మరోసారి వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అందుకే అతడి పేరును ట్విటర్లో ట్రెండింగ్ చేస్తున్నారు.
Jason Roy 🔄 Suresh Raina. Possible !!!! Excited?#CricketTwitter
— Gujarat Titans (@Gujarat_Titan) March 1, 2022
Tell your honest feedback.....👀🏆#GujaratTitans pic.twitter.com/kn0r4mHsAG
Suresh Raina to replace Jason Roy from #GujaratTitans .@ImRaina #SureshRaina𓃵 fans right now
— Joker (@JOKER_TRENDS) March 2, 2022
👇👇👇 pic.twitter.com/JCclfBNDvb
Dear @gujarat_titans , As Roy is out It's your sign to get back the Don Suresh Raina back and win the IPL with Mr. IPL 😎 #JasonRoy pic.twitter.com/GlzKFvtQlL
— Aditi (@Sev_Khamani) February 28, 2022
Suresh Raina with #GujaratTitans tag trending in cricket @ImRaina pic.twitter.com/LD9YWc6pSV
— Raina_memes 48 (@Raina_Memes_) March 1, 2022
Suresh Raina is part of #GujaratTitans squad
— Bleeding Arc (@Jeet69435549) March 2, 2022
Mean while #Raina fans : pic.twitter.com/pIRjUbXFQh
Jason Roy - Out ❎
— Anujj Roy 🕊 (@_anujjroy_) March 2, 2022
Suresh Raina - In ☑️#sureshraina #raina #jasonroy #GujaratTitans @ImRaina pic.twitter.com/Zpii09be8z
Benefits of including Suresh Raina in the squad.
— RG Krishna (@RGKrishna192) March 2, 2022
1.Your team will get a huge fan base which will help your team to become champion.🏆
2. Best middle order bastman and part time spin Bowler.🧡
3. IPL Experience Player and also have captaincy experience.💯#GujaratTitans #ipl2022 pic.twitter.com/Uk1Oxch4ES