SRH vs MI: సన్‌రైజర్స్ ఇయ్యాల గెలిస్తే బతికుంటరు! లేదంటే ఇంటికొస్తరు!
SRH vs MI: ఐపీఎల్ 2022లో 65వ మ్యాచులో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తలపడుతున్నాయి. సన్‌రైజర్స్‌కు మాత్రం ఇవాళ గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కు ఛాన్స్!
IPL 2022 srh vs mi preview sunrisers hyderabad last chance to playoff : ఐపీఎల్ 2022లో 65వ మ్యాచులో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తలపడుతున్నాయి. వాంఖడే ఇందుకు వేదిక. ఐదుసార్లు ఛాంపియన్ రోహిత్ సేనకు ఎలాగూ అవకాశాల్లేవ్. సన్‌రైజర్స్‌కు మాత్రం అలా కాదు. ఇవాళ గెలిస్తే ప్లేఆఫ్స్‌కు ఛాన్స్! లేదంటే ఇంటికే. మరి వీరిలో ఎవరిది పైచేయి. తుది జట్లలో ఎవరుంటారు?
SRH 2 గెలిచినా చెప్పలేం!
ముంబయి ఇండియన్స్ ఈ సీజన్లో 12 మ్యాచులాడితే 3 గెలిచి 9 ఓడింది. 6 పాయింట్లతో ఆఖర్లో నిలిచింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం 12 మ్యాచుల్లో 5 గెలిచి 7 ఓడారు. 10 పాయింట్లు, -0.270 రన్‌రేట్‌తో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన కేన్ సేన ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి టాప్-2లోకి వెళ్లింది. మధ్యలో అనూహ్యంగా చతికిల పడింది. వరుసగా ఐదు ఓడిపోయింది. ఇప్పటికే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేవు! టెక్నికల్‌గా ఉన్న ఛాన్స్ నిజం అవ్వాలంటే నేడు కచ్చితంగా భారీ రన్‌రేట్‌తో గెలవాలి. లేదంటే నిరాశగా వెనుదిరగాలి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 10-8తో సన్‌రైజర్స్ కాస్త వెనకబడింది.
వాంఖడేలో SRHకు గండం!
సన్‌రైజర్స్ హైదరాబాద్ వాంఖడేలో 9 మ్యాచులు ఆడితే ఇప్పటి వరకు గెలిచింది కేవలం ఒక్కటే! అంటే నేటి మ్యాచులో గెలవడం అంత ఈజీ కాదు! ఓపెనర్ అభిషేక్ శర్మనే సన్‌రైజర్స్‌లో టాప్ స్కోరర్. మిగతావాళ్లు అంచనాలు అందుకోలేదు. అద్భుతంగా ఆడే మూడో స్థానం వదిలేసి కేన్ మామ ఎందుకు ఓపెనింగ్ చేస్తున్నాడో ఎవరికీ అర్థమవ్వట్లేదు. హైదరాబాద్ ఐదు మ్యాచులు గెలిచిందంటే అందులో రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, అయిడెన్ మార్‌క్రమ్ బాగా ఆడటం వల్లే. ఈ మధ్య వీరు బ్యాటింగ్‌ను డెప్త్‌గా తీసుకెళ్లడం లేదు. భాగస్వామ్యాలు నెలకొల్పడం లేదు. బౌలింగ్ పరంగా సన్‌రైజర్స్‌కు తిరుగులేదు. భువీ, ఉమ్రాన్, నటరాజన్, జన్‌సెన్, సుందర్ ఫర్వాలేదు.
MIలో కుర్రాళ్లకు పరీక్ష
ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ తమ బెంచ్ స్ట్రెంత్‌ను చెక్ చేసుకుంటోంది. ఏ ఆటగాళ్లు ఏ స్థానంలో బాగా ఆడుతున్నారు? ఒత్తిడి ఎదుర్కొనేటప్పుడు వారి పట్టుదల, ఆటతీరు ఎలా ఉందో గమనిస్తున్నారు. హైదరాబాదీ యువ కెరట తిలక్ వర్మ ఆ జట్టులో టాప్ స్కోరర్. సూర్యకుమార్‌తో అతడు నెలకొల్పిన భాగస్వామ్యాలే ఆ జట్టును రక్షించాయి. ఇషాన్, రోహిత్ ఫామ్‌లో లేకపోవడం పెద్ద ఇబ్బందిగా మారిపోయింది. మిడిలార్డర్ అంత పటిష్ఠంగా అనిపించడం లేదు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా కీలకం అవుతాడు. కేన్, ఇషాన్‌పై అతడికి మంచి రికార్డుంది. కొత్త కుర్రాళ్లకు ఛాన్స్‌లు ఇస్తారని అనిపిస్తోంది.
SRH vs MI Probable XI
ముంబయి ఇండియన్స్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, త్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, డేనియెల్ సామ్స్, హృతిక్ షోకీన్, రమన్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరిడీత్, కుమార్ కార్తికేయ
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, శశాంక్ సింగ్ / గ్లెన్ ఫిలిప్స్, మార్కో జన్‌సెన్ / కార్తీక్ త్యాగీ, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్
Maximum effort at the nets before tonight's big game. 💪🏾#MIvSRH #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/EPEhYD4ww7
— SunRisers Hyderabad (@SunRisers) May 17, 2022