RR vs DC Preview: కరోనాపై యుద్ధం చేస్తున్న దిల్లీ, 'హిట్‌'మైయిర్‌ లేని రాజస్థాన్‌కు పోటీ!

RR vs DC Preview: ఐపీఎల్‌ 2022లో 58వ మ్యాచులో రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals), దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) తలపడనున్నాయి. మరి వీరిలో ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?

FOLLOW US: 

RR vs DC Preview: ఐపీఎల్‌ 2022లో 58వ మ్యాచులో రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals), దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) తలపడనున్నాయి. డీవై పాటిల్‌ స్టేడియం (DY Patil Stadium) ఇందుకు వేదిక. లీగ్‌ దశ చరమాంకానికి చేరుతుండటంతో రెండు జట్లకు ఇది కీలక మ్యాచుగా మారింది. మరి వీరిలో ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?

RRదే బెటర్‌ సిచ్యువేషన్‌

ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. 11 మ్యాచులాడి 7 గెలిచి 4 ఓడిపోయింది. 14 పాయింట్లు, 0.326 రన్‌రేట్‌తో ఉంది. మిగిలిన వారితో పోలిస్తే కొద్దిగా బెటర్‌ పొజిషన్‌లోనే ఉంది. మరోవైపు 11 మ్యాచుల్లో 5 గెలిచిన దిల్లీ 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరో మూడు జట్లు 10 పాయింట్లతోనే ఉన్నా పాజిటివ్‌ రన్‌రేట్‌ వారిని పై స్థాయిలో ఉంచింది. అందుకే నేటి మ్యాచులో గెలవడం పంత్‌ సేనకు అత్యవసరం. లేదంటే ప్లేఆఫ్స్‌పై ఆశలు వదిలేసుకోవచ్చు. రాజస్థాన్‌, దిల్లీ దాదాపుగా సమవుజ్జీలే! ఇవి రెండు ఇప్పటి వరకు 25 మ్యాచుల్లో తలపడగా 13-12తో రాజస్థాన్‌ కాస్త పై చేయి సాధించింది.

RR స్వేచ్ఛగా ఆడితే

ప్లేఆఫ్‌ చేరుకొనేందుకు కాస్త కుషన్‌ ఉండటంతో రాజస్థాన్‌ రాయల్స్‌పై మరీ ఒత్తిడేమీ లేదు! స్వేచ్ఛగా ఆడితే గెలుస్తారు. జోస్‌ బట్లర్‌, యశస్వీ జైశ్వాల్‌ ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ తన వికెట్‌ విలువ తెలుసుకొని ఆడాలి. అతను క్రీజులో ఉంటే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మిడిలార్డర్లో రియాన్‌ పరాగ్‌, పడిక్కల్‌ ఉన్నారు. సూపర్‌ ఫామ్‌లో సిక్సర్లు బాదేస్తున్న హెట్‌మైయిర్‌ తన భార్య ప్రసవించడంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడి స్థానంలో జిమ్మీ నీషమ్‌, డుసెన్‌, మిచెల్‌లో ఒకరికి ఛాన్స్‌ వస్తుంది. బౌలింగ్‌ పరంగా రాజస్థాన్‌కు తిరుగులేదు. యూజీ, యాష్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, కుల్దీప్‌ సేన్‌, ప్రసిద్ధ్‌ దుమ్మురేపుతున్నారు.

DCకి కరోనాయే శత్రువు

ఈ సీజన్లో ప్రత్యర్థుల కన్నా ఎక్కువగా కరోనా వైరస్సే దిల్లీని ఓడించింది! చెన్నై మ్యాచుకు ముందూ బృందంలో ఒకరికి కొవిడ్‌ రావడంతో కనీసం టీమ్‌ మీటింగ్‌ పెట్టుకోలేకపోయారు. పంత్‌ సేన ప్లేఆఫ్స్‌ చేరుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచుల్ని మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. లేదంటే ఆశలు వదిలేసుకోవాల్సిందే. వార్నర్‌, పృథ్వీ షా, కేస్‌ భరత్‌, మిచెల్‌ మార్ష్‌, రిషభ్‌ పంత్‌, రోమన్‌ పావెల్‌లో కనీసం ఇద్దరు నిలిస్తే భారీ స్కోర్లు వస్తాయి. బౌలింగ్‌ విభాగం ఇంకాస్త మెరుగ్గా వ్యూహాలు రచిస్తే బెటర్‌. శార్దూల్‌, కుల్దీప్‌, నోకియా ఫర్వాలేదు. అదిరే ఆటగాళ్లు ఉన్నా వ్యూహాల అమల్లో విఫలమవ్వడమే దిల్లీ కొంప ముంచుతోంది.

RR vs DC Probable XI

దిల్లీ క్యాపిటల్స్‌: డేవిడ్‌ వార్నర్‌, కేఎస్ భరత్‌ /పృథ్వీ షా, మిచెల్‌ మార్ష్‌, రిషభ్ పంత్‌, రోమన్‌ పావెల్‌, రైపల్‌ పటేల్‌ / లలిత్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ఆన్రిచ్‌ నార్జ్‌, ఖలీల్‌ అహ్మద్‌

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజు శాంసన్‌, దేవదత్‌ పడిక్కల్‌, రియాన్‌ పరాగ్‌, జిమ్మీ నీషమ్‌ / డుసెన్‌ / డరైల్‌ మిచెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ సేన్‌

Published at : 11 May 2022 01:24 PM (IST) Tags: IPL Delhi Capitals Rishabh Pant IPL 2022 Rajasthan Royals Sanju Samson DY Patil Stadium IPL 2022 news rr vs dc rr vs dc highlights

సంబంధిత కథనాలు

RR vs RCB, Mohammed Siraj: ఇదేంది సిరాజ్‌ మియా! హైదరాబాదీ పేస్‌ కెరటం కెరీర్లో కోరుకోని రికార్డు

RR vs RCB, Mohammed Siraj: ఇదేంది సిరాజ్‌ మియా! హైదరాబాదీ పేస్‌ కెరటం కెరీర్లో కోరుకోని రికార్డు

IPL 2022, Faf du Plessis: ఆర్సీబీ భవిష్యత్తు చెప్పిన డుప్లెసిస్‌ - భారత కల్చర్‌కు పెద్ద ఫ్యాన్‌ అంటూ పొగడ్త

IPL 2022, Faf du Plessis: ఆర్సీబీ భవిష్యత్తు చెప్పిన డుప్లెసిస్‌ - భారత కల్చర్‌కు పెద్ద ఫ్యాన్‌ అంటూ పొగడ్త

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!

RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!

టాప్ స్టోరీస్

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

NTR Centenary Celebrations : ఎన్టీఆర్ అప్పట్లోనే చేసి చూపించారు - అవినీతికి పాల్పడితే మంత్రినీ వదల్లేదు !

NTR Centenary Celebrations :   ఎన్టీఆర్ అప్పట్లోనే చేసి చూపించారు - అవినీతికి పాల్పడితే మంత్రినీ వదల్లేదు !