By: ABP Desam | Updated at : 19 Mar 2022 06:06 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఫ్రాంచైజీలకు టెన్షన్ టెన్షన్! ఐపీఎల్ తొలివారానికి ఈ క్రికెటర్లు ఔట్!
ఇండియన్ ప్రీమియర్ లీగుకు మరో వారం రోజులే ఉంది! ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లను ఇప్పటికే క్యాంపులకు పిలిపించాయి. ప్రాక్టీస్ చేయిస్తున్నాయి. మిగతా ఆటగాళ్లతో కలిసిపోయేలా సరదా ఆటలు ఆడిస్తున్నాయి. అయితే కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ మొదలైన మొదటి వారంలో అందుబాటులో ఉండకపోవడం, కొందరు లీగ్ మొత్తానికీ దూరమవ్వడం ఫ్రాంచైజీలకు ఆందోళన కలిగిస్తోంది.
ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 26 నుంచి మొదలవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మొదటి మ్యాచులో తలపడుతున్నాయి. ఈ సారి మ్యాచులన్నీ ముంబయి, పుణెలోనే జరుగుతున్నాయి. ఇందుకోసం కఠిన బయో బబుల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రెగ్యులర్‌గా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఎప్పట్లాగే ఈసారీ కొందరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ పైత్యాన్ని ప్రదర్శించారు. సీజనుకు అందుబాటులో ఉంటామని వేలంలో పేర్లు నమోదు చేయించుకున్నారు. తీరా సీజన్ దగ్గరపడుతుండటం, క్యాంపులకు రమ్మనడంతో బయో బుడగ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని వెనక్కి తగ్గారు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ జేసన్ రాయ్, కోల్‌కతా ఆటగాడు అలెక్స్ హేల్స్ తప్పుకున్నారు. ఇంగ్లాండ్ పేసర్ మార్క్‌వుడ్ మోచేతికి గాయం కావడంతో సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదు.
We will miss you this season, speedster! @MAWood33 🚀 #LucknowSuperGiants family wishes our Woody a speedy recovery!💪
🎥: Fancode #AbApniBaariHai #TataIPL #IPL2022 #CricketNews #CricketUpdates pic.twitter.com/Kf9S1gUJuO — Lucknow Super Giants (@LucknowIPL) March 18, 2022
ఇక ద్వైపాక్షిక సిరీసుల వల్ల కొందరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు మొదటి వారం అందుబాటులో ఉండటం లేదు. పాకిస్థాన్‌తో వన్డే, టీ20 సిరీసులు ఆడుతుండటమే ఇందుకు కారణం. ఆరోన్ ఫించ్, ప్యాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ హేజిల్‌వుడ్, మార్కస్ స్టాయినిస్ తొలివారం ఐపీఎల్‌కు రారు. ఇక ఇంగ్లాండ్, వెస్టిండీస్ సైతం టెస్టు సిరీసు ఆడుతోంది. దాంతో కైల్ మేయర్స్, అల్జారీ జోసెఫ్, జానీ బెయిర్‌స్టో తొలుత రాకపోవచ్చు.
ఆటగాడు | దేశం | ఐపీఎల్ జట్టు |
Pat Cummins | Australia | Kolkata Knight Riders |
Aaron Finch | Australia | Kolkata Knight Riders |
Glenn Maxwell | Australia | Royal Challengers Bangalore |
Josh Hazlewood | Australia | Royal Challengers Bangalore |
Marcus Stoinis | Australia | Lucknow Super Giants |
Kyle Mayers | West Indies | Lucknow Super Giants |
Alzaari Joseph | West Indies | Gujarat Titans |
Jason Roy | England | Gujarat Titans |
Jonny Bairstow | England | Punjab Kings |
Mark Wood | England | Lucknow Super Giants |
Virat Kohli: మైదానంలోనే కాదు బయట కూడా కింగే - 2022 మోస్ట్ పాపులర్ క్రికెటర్‌గా విరాట్!
Womens IPL Bidders: రూ.1289 కోట్లతో WIPL ఫ్రాంచైజీ కొన్న అదానీ - 5 జట్ల విక్రయంతో బీసీసీఐ రూ.4669 కోట్ల సంపద!
Ravindra Jadeja Tweet: ఆ రెండు పదాలతో సీఎస్కే ఫ్యాన్స్‌ను థ్రిల్ చేసిన జడ్డూ!
Rishabh Pant: పంత్‌కు ప్రత్యామ్నాయం - వేట ఇంకా కొనసాగుతుంది - పాంటింగ్ ఏమన్నాడంటే?
Womens IPL Media Rights: విమెన్స్ ఐపీఎల్ - ఒక్కో మ్యాచుకు రూ.7 కోట్లు ఇస్తున్న వయాకామ్!
TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ
KTR: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మా దారిలోనే ఇతర రాష్ట్రాలు ప్లాన్ : మంత్రి కేటీఆర్
Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !
Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్లో సంజయ్ దత్, హీరోయిన్గా త్రిష