By: ABP Desam | Updated at : 19 May 2022 02:58 PM (IST)
Edited By: Ramakrishna Paladi
గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Image: Starsports telugu twitter)
GT vs RCB: ఐపీఎల్ 2022లో 67వ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడుతున్నాయి. వాంఖడే (Wankhede Stadium) ఇందుకు వేదిక. ఈ మ్యాచ్ ఆర్సీబీకి ఫైనల్ కాని ఫైనల్ లాంటిది! ఇందులో గెలిచినా ప్లేఆఫ్స్ చేరుకుంటారో తెలియని సిచ్యువేషన్. మరి ఈ రెండు జట్లలో ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?
RCB అటో ఇటో!
టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్, ఐదో స్థానంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు లీగ్‌స్టేజ్‌లో ఇదే చివరి మ్యాచ్! ఇప్పటికే 10 మ్యాచులు గెలిచిన హార్దిక్ సేన 20 పాయింట్లతో ఉంది. వారికి గెలిచినా, ఓడినా పోయేదేం లేదు. ఆర్సీబీకి మాత్రం ఇచ్చి కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. 14 పాయింట్లు ఉన్నప్పటికీ నెగెటివ్ రన్‌రేట్ (-0.323) వారి ప్లేఆఫ్స్ ఆశలకు అడ్డంకిగా మారిపోయింది. గుజరాత్‌పై మామూలుగా గెలిస్తే చాలదు. మొత్తంగా రన్‌రేట్ పాజిటివ్‌కు వచ్చేయాలి. ఇక నాలుగో స్థానంలో దిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవాలని ప్రార్థించాలి. ఏదేమైనా వారి భవిష్యత్తు వారి చేతుల్లో లేదు.
స్వేచ్ఛగా GT
గుజరాత్ టైటాన్స్‌పై ఒత్తిడేమీ లేదు. దాంతో స్వేచ్ఛగా ఈ మ్యాచ్ ఆడుతుంది. మధ్యలో కొన్ని మ్యాచులు ఓడినా ఆటగాళ్లు మళ్లీ ఫామ్‌లోకి రావడంతో విజయాల బాట పట్టింది. స్వేచ్ఛగా, అటాకింగ్ గేమ్ ఆడటం వారికి కలిసొచ్చింది. శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా చక్కని ఓపెనింగ్ పాట్నర్‌షిప్‌లు నెలకొల్పుతున్నారు. హార్దిక్, మిల్లర్, తెవాతియా ఫామ్‌లోకి వచ్చారు. ఒక బౌలింగ్‌కు తిరుగులేదు. మహ్మద్ షమి, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, ప్రదీప్ సంగ్వాన్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. సరైన సమయాల్లో వికెట్లు తీస్తున్నారు.
RCB 80+ తేడాతో గెలవగలదా?
బెంగళూరు ఈ మ్యాచులో గెలవడం అంత ఈజీ కాదు! భారీ తేడాతో విజయం అందుకోవాలంటే విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మాక్స్‌వెల్‌లో ఎవరో ఒకరు సెంచరీ స్కోరు కొట్టాల్సిందే. మిగిలిన వాళ్లు వేగంగా ఆడుతూ పరుగులు రాబట్టాలి. ఆ తర్వాత డీకే తన ఫైర్ పవర్ చూపించాలి. కానీ టైటాన్స్ బౌలింగ్‌లో అటాక్ చేయడం కష్టతరం. ఇక చివరి మ్యాచులో ఎక్కువ పరుగులు ఇచ్చిన జోష్ హేజిల్‌వుడ్ ఫామ్ అందుకొని వికెట్లు తీయాలి. హర్షల్ పటేల్ ఫర్వాలేదు. హసరంగ తన స్పిన్‌తో వికెట్లు తీస్తున్నాడు. ఏదేమైనా ఈ మ్యాచులో ఆర్సీబీ కనీసం 80 పరుగుల తేడాతో గెలవాలి.
GT vs RCB Probable XI
గుజరాత్ టైటాన్ష్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, లాకీ ఫెర్గూసన్ / అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమి, ప్రదీప్ సంగ్వాన్ / యశ్ దయాల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, రజత్ పాటిదార్, మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రర్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, వనిందు హసరంగ, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్
IPL 2024 Retention List: రాకపోకలు ముగిశాక, ప్రాంఛైజీల పరిస్థితి ఇలా ఉంది
IPL 2024 : ముంబై గూటికి హార్దిక్ పాండ్యా , రెండు గంటల్లోఇన్ని ట్విస్ట్‌లా..?
IPL 2024 Retentions: ఐపీఎల్లో జట్లు వదులుకున్న ఆటగాళ్లు , షాక్ ఇచ్చిన కొందరి ఆటగాళ్ల రిలీజ్
IPL 2024: ఐపీఎల్ సందడి ఎప్పటినుంచంటే.? - వేలానికి సమీపిస్తున్న గడువు
Hardik Pandya: ముంబై గూటికి హార్దిక్ పాండ్యా! , ఐపీఎల్ చరిత్రలో భారీ ట్రేడ్ జరుగుతుందా?
Janasena Meeting: డిసెంబర్ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?
సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం
Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు
Jagan Case: కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్ఐఏ కౌంటర్
/body>