IPL 2022 Fastest Delivery: ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన లాకీ ఫెర్గూసన్ - SRH పేసర్ ఉమ్రాన్ మాలిక్ రికార్డు బద్దలు
IPL 2022 Fastest Delivery: నిన్నటి వరకు ఐపీఎల్ సీజన్ 15లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా నిలిచిన ఉమ్రాన్ మాలిక్ రికార్డ్ చివరి మ్యాచ్‌లో బద్ధలైంది. పేసర్ లాకీ ఫెర్గూసన్ ఫాస్టెస్ట్ డెలివరీ సంధించాడు.

IPL 2022 Fastest Delivery: ఐపీఎల్ 2022లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు దొరికిన ఆశా కిరణం ఉమ్రాన్ మాలిక్. వేగంగా బంతులు సంధిస్తూ దిగ్గజ ఆటగాళ్ల బ్యాట్‌కు సైతం బ్రేకులు వేశాడు. అయితే నిన్నటి వరకు ఐపీఎల్ సీజన్ 15లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా నిలిచిన సన్‌రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ రికార్డ్ చివరి మ్యాచ్‌లో బద్ధలైంది. గుజరాత్ టైటాన్స్ పేసర్ లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ 2022లో ఫాస్టెస్ట్ డెలివరీ సంధించిన బౌలర్‌గా నిలిచాడు.
రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ 2022 టైటిల్ పోరులో జట్టుకు కప్ అందించాలన్న కసితో బౌలింగ్ చేశాడు లాకీ ఫెర్గూసన్. ఈ క్రమంలో గంటకు 157.3 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు గుజరాత్ టైటాన్స్ పేపర్. తద్వారా ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించి ఫాస్టెస్ట్ బౌలర్ ఆఫ్ ది సీజన్‌గా లాకీ ఫెర్గూసన్ తన పేరిట రికార్డు లిఖించుకున్నాడు. సన్ రైజర్స్ పేపర్ గరిష్టంగా గంటకు 157 కి.మీ వేగంతో బాల్ వేసి నిన్నటి వరకు సీజన్‌లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉన్నాడు. టైటిల్ పోరులో గుజరాత్ పేసర్ లాకీ ఫెర్గూసన్ బంతితో నిప్పులు చెరుగుతూ సీజన్‌లో వేగవంతమైన బౌలర్‌గా రికార్డు సాధించాడు.
I thought Umran Malik's record is going to stay but Lockie Ferguson has bettered him now with a 157.3 kph thunderbolt to Jos Buttler.#GTvRR | #IPLFinal pic.twitter.com/cNn8Q3xQze
— Prasenjit Dey (@CricPrasen) May 29, 2022
ప్రతి మ్యాచ్‌లోనూ ఉమ్రాన్‌కే అవార్డ్.. కానీ
ఈ సీజన్‌లో సన్ రైజర్స్ ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను పేసర్ ఉమ్రాన్ మాలిక్ అందుకున్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లు పేసర్ ఉమ్రాన్ బంతి వేగాన్ని అందుకోలేకపోయారు. ఐపీఎల్ 2022లో మెరుగ్గా రాణించిన ఉమ్రాన్ మాలిక్ 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. కొన్ని మ్యాచ్‌లలో తన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ వైపు మ్యాచ్ తిప్పేశాడు. అయితే సీజన్ చివరి మ్యాచ్ టైటిల్ పోరులో రాజస్తాన్ పై గుజరాత్ పేసర్ లాకీ ఫెర్గూసన్ వేగవంతమైన బంతులు సంధించి సన్ రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ రికార్డును బద్దలుకొట్టాడు.
Also Read: IPL 2022 Winner: రాయల్స్‌ను రఫ్ఫాడించిన టైటాన్స్ - ఆఖరి అడుగుపై బోల్తా పడిన రాజస్తాన్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

