అన్వేషించండి

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్ - అయినా జైల్లోనే !

Vamsi Jail: వల్లభనేని వంశీకి బెయిల్ లభించింది. అయితే ఒక్క కేసులోనే బెయిల్ లభించింది. దీంతో జైల్లోనే ఉండనున్నారు.

Bail For Vallabhaneni Vamsi: వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీకి ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనకు ఈ బెయిల్ లభించింది. ఈ కేసులోనే మొదటగా వంశీ అరెస్టు అయ్యారు. ఆ తర్వాత వంశీపై పలు కేసులు నమోదయ్యాయి. అలాగే టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు ఇటీవలే న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. ఈ ఒక్క కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇతర కేసుల్లో ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 

ఇటీవలే చార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు                    

సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీని అరెస్టు చేసి మూడు నెలలు కావడంతో పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే   వంశీ తన అనుచరులోత కలిసి సత్యవర్థన్ ను కిడ్నాప్ చేశారని దర్యాప్తులో తేలిందని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.  తాము చెప్పినట్లు వినకపోతే  సత్యవర్థన్ తో పాటు ఆయన  కుటుంబాన్ని అంతమొందిస్తామని బెదిరించి  అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించినట్లు తేలిందన్నారు.  

సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి.. కేసు ఉపసంహరించేలా అఫిడవిట్ పై సంతకాలు             
 
విజయవాడ శివారు రామవరప్పాడులోని బల్లెంవారివీధి నుంచే సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి, భయపెట్టారు.  కేసు ఉపసంహరించుకుంటున్నట్లుగా అఫిడవిట్‌పై సంతకాలు చేయించుకున్నారని తర్వాత న్యాయస్థానానికి తీసుకెళ్లి ఆ కేసుకు తనకు సంబంధం లేదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనంటూ న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇప్పించారు.  కోర్టులో చెప్పిన దానికి కట్టుబడకపోతే నీ కుటుంబసభ్యుల్ని చంపేస్తామంటూ బెదిరించారు.              

సీసీ ఫుటేజీలతో సాక్ష్యాలు                                 

సత్యవర్ధన్‌ను ఫిబ్రవరి 11న రాత్రి హైదరాబాద్‌లోని మై హోమ్‌ భూజాలో ఉన్న వంశీ ఇంటికి తీసుకెళ్లారు.  ఆ రాత్రంతా సత్యవర్ధన్‌ను చిత్రహింసలు పెట్టారు. తర్వాత  పొట్టి రాము, వేల్పూరి వంశీ, ఎం.వేణులు ఏపీ 40బీజీ 5005 నంబరు క్రెటా కారులో విశాఖపట్నం తీసుకెళ్లారు.  12న అక్కడ హోటల్‌ చందనలో సత్యవర్ధన్‌ను నిర్బంధించారు. తర్వాత  చేబ్రోలు శ్రీనివాస్‌ ఇంట్లో ఉంచారు.  తేలప్రోలు రాము, శివరామకృష్ణ, లక్ష్మీపతి కూడా అక్కడే ఉన్నారని సత్యవర్ధన్‌ను విజయవాడ నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి వేల్పూరి వంశీ తీసుకెళ్లారని చార్జిషీట్‌లో పోలీసులు చెప్పారు. సాక్ష్యాలుగా సత్యవర్ధన్ ను తీసుకెళ్తున్న సీసీటీవీ ఫుటేజీలను, ఇతర ఆధారాలను సమర్పించారు.         

ఆరోగ్యం బాగోలేదని చెప్పిన వంశీ   

అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని కోర్టుకు వంశీ చెప్పారు.  చార్జి,షీటు దాఖలు చేయడంతో పాటు .. అరెస్టు చేసి మూడు నెలలు అయినందున  ఆయనకు బెయిల్ మంజూరు అయింది.  

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
Samantha Ruth Prabhu : ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
Kriti Sanon GIVA Ad: కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Embed widget