CSK Vs KKR Live Updates: 18.3 ఓవర్లలో కోల్‌కతా స్కోరు 133-4, ఆరు వికెట్లతో విజయం
ఐపీఎల్ 2022 సీజన్ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఆ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
LIVE
Background
ఐపీఎల్ (IPL 2022) సరికొత్త సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Superkings), గతేడాది రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knightriders) తలపడుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే మ్యాచ్ మొదలవుతోంది. ఇప్పటికే జట్లన్నీ మ్యాచు కోసం ప్రాక్టీస్ చేశాయి. ఐపీఎల్ (csk vs kkr) తొలి మ్యాచుకు సంబంధించి ఆరుగురు ఆటగాళ్లపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వారు ఎలా ఆడతారోనని అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా (Jaddu) నిజమైన రాక్‌స్టార్‌గా మారిపోయాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌కు (CSK) కెప్టెన్‌గా ఎంపికవ్వడమంటే మాటలు కాదు. కొత్త కెప్టెన్‌పై ఫ్యాన్స్ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 151 మ్యాచులాడిన అతడు 2386 పరుగులు చేశాడు. 127 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్లో ఒక ఓవర్లో 37 పరుగులు దంచికొట్టాడు. మొత్తంగా 16 మ్యాచుల్లో 227 కొట్టాడు. ఈ సీజన్‌కు ముందు మంచి ఫామ్‌లో ఉన్నాడు.
మహేంద్ర సింగ్ ధోని
మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్ నుంచి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడటం లేదు కాబట్టి ఈ సీజన్లో రాణించాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు 193 మ్యాచులాడిన అతడు 4746 పరుగులు చేశాడు. ఈ సీజన్లో 400 పరుగుల కొట్టి 5000 రన్స్ మైలురాయి దాటాలని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కెప్టెన్సీ భారం లేదు కాబట్టి బాగా బ్యాటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రుతురాజ్ గైక్వాడ్
చెన్నై యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. గతేడాది 16 మ్యాచుల్లో 635 కొట్టాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. పెద్దగా అవకాశాలు రాలేదు గానీ దేశవాళీలో మాత్రం పరుగుల వరద పారించాడు. సీజన్‌కు ముందు గాయపడటం కాస్త కలవరపరిచే అంశం. అతడు చివరి సీజన్ ప్రదర్శనే మళ్లీ రిపీట్ చేయాలని సీఎస్‌కే ఆశ.
శ్రేయస్ అయ్యర్
ఇండియన్ క్రికెట్లో ఒక ప్రామిసింగ్ క్రికెటర్‌గా ఎదిగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas). ఇన్నాళ్లూ దిల్లీకి ఆడిన అతడు కేకేఆర్‌కు (KKR) కెప్టెన్‌గా వచ్చేశాడు. ఇన్నింగ్స్‌ను బట్టి రన్‌రేట్‌ను పరుగెత్తించే ఆటగాడు. సీజన్‌కు ముందు అంతర్జాతీయ క్రికెట్లో దుమ్మురేపాడు. టెస్టు సిరీసులో అలరించాడు. ఇప్పటి వరకు 87 ఐపీఎల్ మ్యాచుల్లో 2375 పరుగులు చేశాడు. కొత్త కెప్టెన్‌పై కేకేఆర్‌కు భారీ ఆశలే ఉన్నాయి.
వరుణ్ చక్రవర్తి
ఆర్కిటెక్టర్‌గా ఉద్యోగ ప్రయాణం మొదలు పెట్టి టీఎన్‌పీఎల్‌లో మిస్టరీ స్పిన్నర్‌గా మారి ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు వరుణ్ చక్రవర్తి. తన మిస్టరీ స్పిన్‌తో మహామహులనే బోల్తా కొట్టిస్తున్నాడు. 31 ఐపీఎల్ మ్యాచుల్లో అతడు 6.82 ఎకానమీ, 20.50 స్ట్రైక్‌రేట్‌తో 36 వికెట్లు తీశాడు. అతడిని ఎదుర్కోవడం అంత సులభమైన విషయం కాదు.
వెంకటేష్ అయ్యర్
గత సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్ చేరిందంటే ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ మెరుపులే కారణం! తన ఎడమచేతి వాటం బ్యాటింగ్‌తో కేకేఆర్ ఓపెనింగ్ అవసరాలు తీర్చేశాడు. తనలోని డిస్ట్రక్టివ్ బ్యాటింగ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. 10 మ్యాచుల్లోనే 370 పరుగులు చేశాడు. 4 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. బంతితోనూ మ్యాజిక్ చేశాడు. 8.3 ఓవర్లు విసిరి 3 వికెట్లు తీశాడు.
18.3 ఓవర్లలో కోల్‌కతా స్కోరు 133-4, ఆరు వికెట్లతో కోల్‌కతా విజయం
ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో కోల్‌కతా ఆరు వికెట్లతో విజయం సాధించింది.
శ్రేయస్ అయ్యర్ 20(19)
జాక్సన్ 3(3)
ఆడం మిల్నే 2.3-0-19-0
18 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 126-4
డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. శామ్ బిల్లింగ్స్ అవుటయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 126-4గా ఉంది.
శ్రేయస్ అయ్యర్ 14(17)
జాక్సన్ 2(2)
డ్వేన్ బ్రేవో 4-0-20-3
17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 122-3
రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 122-3గా ఉంది.
శ్రేయస్ అయ్యర్ 12(15)
శామ్ బిల్లింగ్స్ 25(20)
రవీంద్ర జడేజా 4-0-25-0
15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 104-3
రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 104-3గా ఉంది.
శ్రేయస్ అయ్యర్ 8(10)
శామ్ బిల్లింగ్స్ 11(13)
రవీంద్ర జడేజా 4-0-31-1
14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 98-3
మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 98-3గా ఉంది.
శ్రేయస్ అయ్యర్ 6(8)
శామ్ బిల్లింగ్స్ 7(9)
మిషెల్ శాంట్నర్ 4-0-31-1