By: ABP Desam | Updated at : 27 Feb 2022 05:31 PM (IST)
Edited By: Ramakrishna Paladi
csk-vs-kkr
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగు సరికొత్త సీజన్లో మొదట తలపడే జట్లేవో తెలిసిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరంభ పోరులో తలపడనున్నాయి. 2022, మార్చి 26న ఈ రెండు జట్లు వాంఖడే వేదికగా పోరాడుతాయని సమాచారం.
CSK vs KKR
ఐపీఎల్ 2022 సీజన్ మొత్తంగా మహారాష్ట్రలోనే జరగనుంది. ముంబయిలోని వాంఖడే, డీవై పాటిల్, సీసీఐ స్టేడియాల్లో 55, పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో 15 మ్యాచులు జరగనున్నాయి. ఈ సారి పది జట్లు ఉండటంతో లీగు మ్యాచుల సంఖ్య 70కి పెరుగుతున్నాయి. ఆ తర్వాత ప్లేఆఫ్స్ మ్యాచులు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహిస్తారని తెలుస్తోంది.
పాత పద్ధతే
ఐపీఎల్ ఆరంభ మ్యాచు ప్రత్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వాహకులు ఒక పద్ధతిని అనుసరిస్తారు. గత సీజన్ ఫైనల్లో తలపడ్డ రెండు జట్లతోనే తర్వాత సీజన్ మొదటి మ్యాచు ఆడతాయి. అందుకే ఈ సీజన్ తొలి మ్యాచులోనూ చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడతాయి.
2011 IPL మోడల్
ఈ సీజన్లో పది జట్లు ఉండటంతో 2011 మోడల్‌నే బీసీసీఐ అనుసరిస్తోంది. పది జట్లను రెండు గ్రూపులుగా విభజించాయి. ట్రోఫీలు గెలిచిన జట్లను బట్టి సీడింగ్ ఇచ్చారు. ప్రతి జట్లు 14 లీగు మ్యాచులు ఆడుతుంది. ఒక్కో గ్రూపులోని ఐదు జట్లు మిగతా నాలుగు జట్లతో రెండు లీగు మ్యాచులు ఆడతాయి. మరో గ్రూపులోని ఒక జట్టుతో రెండు, మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతాయి.
గ్రూపులు ఇవే...
గ్రూప్-ఏలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians), కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఉన్నాయి. ఇక గ్రూప్-బిలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), పంజాబ్ కింగ్స్ (Punjab Kings), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఉండనున్నాయి.
ఏ స్టేడియంలో ఎన్ని మ్యాచులంటే
ముంబయిలోని వాంఖడే, సీసీఐ మైదానాల్లో 20 మ్యాచులు ఉంటాయి. సీసీఐ, ఎంఐసీ స్టేడియాల్లో 15 చొప్పున జరుగుతాయి. అన్ని జట్లు వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాల్లో నాలుగు చొప్పున ఆడతాయి. సీసీఐ, ఎంసీఐలో మూడు చొప్పున ఆడతాయి.
Shahid Afridi On Indian Cricket: ప్రపంచ క్రికెట్‌ను ఇండియా శాసిస్తోంది- భారత్ ఏం చెబిదే అదే జరుగుతుంది: అఫ్రిదీ
IPL Media Rights: ఐపీఎల్ మీడియా హక్కులపై జే షా కీలక కామెంట్స్!
IPL Media Rights: మళ్లీ స్టార్ చేతికే ఐపీఎల్ టీవీ రైట్స్, డిజిటల్ రైట్స్ దక్కించుకున్న వయాకాం - BCCIకి రూ.50 వేల కోట్లు!
IPL Streaming App: హాట్‌స్టార్‌కు నో ఛాన్స్ - ఇక ఐపీఎల్ ఆ యాప్‌లోనే - సబ్స్క్రిప్షన్ రూ.300 లోపే!
IPL Media Rights: బీసీసీఐ మీద కనకవర్షం - రూ.44 వేల కోట్లకు అమ్ముడుపోయిన ఐపీఎల్ మీడియా రైట్స్ - ఎవరికి దక్కాయంటే?
Chiru In Modi Meeting : మోదీ, జగన్‌తో పాటు చిరంజీవి కూడా ! - నాలుగో తేదీన ఏపీలో
Weather Updates: రెయిన్ అలర్ట్ - ఏపీలో అక్కడ భారీ వర్షాలు, తెలంగాణలో ఆ ప్రాంతాలకు IMD వర్ష సూచన - ఎల్లో అలర్ట్ జారీ
Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు
Horoscope 29th June 2022: ఈ రాశివారికి గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి