By: ABP Desam | Updated at : 04 May 2022 07:19 PM (IST)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ (ipl twitter)
IPL 2022 Chennai Super Kings opt to bowl against royal challengers bangalore match 49 in mca stadium: ఐపీఎల్ 2022లో మ్యాచ్ 49లో చెన్నై సూపర్‌కింగ్స్ టాస్ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. డ్యూ కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందన్నాడు. మిచెల్ శాంట్నర్ స్థానంలో మొయిన్ అలీని తీసుకుంటున్నామని పేర్కొన్నాడు. తమ జట్టులో ఎలాంటి మార్పుల్లేవని బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు.
CSKదే పైచేయి
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆఖరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆడిన 9లో 3 విజయాలు అందుకుంది. ఇకపై అన్ని మ్యాచులూ గెలిస్తూ పోతే టెక్నికల్‌గా ప్లేఆఫ్స్‌కు అవకాశం ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సిచ్యువేషన్ మాత్రం భిన్నం. 10 మ్యాచుల్లో 5 గెలిచి 5 ఓడింది. 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచులో గెలిస్తే నాలుగో స్థానంలోకి వెళ్లిపోతుంది. కాగా ఆర్సీబీపై చెన్నైదే పైచేయి. ఇప్పటి వరకు వీరు 29 మ్యాచుల్లో తలపడితే సీఎస్‌కే 19 సార్లు గెలిచింది. ఈ సీజన్లో చివరి మ్యాచులోనూ వారిదే విజయం.
RCB vs CSK Playing XI
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, డ్వేన్ ప్రిటోరియస్, మహేశ్ థీక్షణ, సిమ్రన్‌జీత్ సింగ్, ముకేశ్ చౌదరి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోస్ హేజిల్‌వుడ్
Namma XI is all set😍#RCBvCSK #WhistlePodu #Yellove💛🦁💛 pic.twitter.com/VnMuPdELs5
— Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2022
A special one for @msdhoni as he is all set to don the yellow jersey for the 200th time.#TATAIPL #RCBvCSK pic.twitter.com/9Zmt77fm4w
— IndianPremierLeague (@IPL) May 4, 2022
#CSK have won the toss and they will bowl first against #RCB.
— IndianPremierLeague (@IPL) May 4, 2022
A look at the Playing XI for #RCBvCSK
Live - https://t.co/qWmBC0lKHS #TATAIPL pic.twitter.com/MyCp99JoJI
RR vs RCB, Mohammed Siraj: ఇదేంది సిరాజ్ మియా! హైదరాబాదీ పేస్ కెరటం కెరీర్లో కోరుకోని రికార్డు
IPL 2022, Faf du Plessis: ఆర్సీబీ భవిష్యత్తు చెప్పిన డుప్లెసిస్ - భారత కల్చర్‌కు పెద్ద ఫ్యాన్ అంటూ పొగడ్త
IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !
RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!
RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!
Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు, నారా లోకేష్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు
Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
IAS Couple Dog : ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ? బదిలీ అయిన ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!