అన్వేషించండి

IPL 2022, CSK: ధోనీ భాయ్‌ అంతా OK, కానీ జడ్డూ గాయపడితే CSK సిచ్యువేషన్‌ ఏంది?

CSK IPL 2022: మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ జట్లలో CSK ఒకటి! కెప్టెన్ మహీ తన బుర్రకు పదును పెడితే ఎంతటి ప్రత్యర్థైనా వెనక్కి తగ్గాల్సిందే. IPL 2022లో ఈ జట్టెలాగుంది? వీరికి ఉన్న అవకాశాలేంటి? ఇబ్బందులేంటి?

Chennai Super Kings IPL 15: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఒకటి (CSK) ! ఈ టీమ్‌ కాంబినేషన్‌ చూస్తే అంతా వయసు మీరిన వాళ్లే కనిపిస్తారు. మరోవైపు అప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో ఎంటరవుతున్న కుర్రాళ్లు ఉంటారు. ఆ జట్టు బలం, బలహీనత ఎంఎస్‌ ధోనీ. అతనొక్కడే టైపులో మహీ తన బుర్రకు పదును పెడితే ఎంతటి ప్రత్యర్థైనా తోక ముడవాల్సిందే. మెగా వేలం తర్వాత ఈ జట్టెలాగుంది? ఐపీఎల్‌-15లో వీరికి ఉన్న అవకాశాలేంటి? ఇబ్బందులేంటి?

అతనొక్కడే బలం, బలహీనత!

సీఎస్‌కే ఈ సీజన్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా అడుగు పెడుతోంది. ఐపీఎల్‌ మెగా వేలం ముగిసిన తర్వాత దాదాపుగా తన కోర్‌ టీమ్‌ను రూపొందించుకున్నట్టే కనిపిస్తోంది. లీగులో ఈ ఫ్రాంచైజీకి తిరుగులేని చరిత్ర ఉంది. అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌ చేరింది. ఎక్కువ ఫైనళ్లు ఆడింది. నాలుగు సార్లు గెలిచింది. ఈ విజయాల వెనక ఉన్నది మహేంద్ర సింగ్‌ ధోనీ అనడంలో డౌటే లేదు. మరి ఈ సీజన్‌ తర్వాత అతనుంటాడా? లేదా? అన్నదానిని బట్టి ఆ జట్టు భవిష్యత్తు ఉండనుంది. గత సీజన్లో ముంబయిలో ఆడిన మ్యాచుల్లో సీఎస్‌కే ఎక్కువ గెలిచింది. ఈ సారీ అక్కడే జరుగుతుండటంతో ధోనీ సేన ప్లేఆఫ్స్‌ చేరుకోవడం గ్యారంటీ! ఇందుకు పరిస్థితులు అనుకూలించాలి.

CSK Core group రెడీ
 
సీఎస్‌కే కోర్‌ గ్రూపులో రుతురాజ్‌ గైక్వాడ్‌, అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, మొయిన్‌ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోనీ, రాబిన్‌ ఉతప్ప, దీపక్‌ చాహర్‌ ఉన్నారు. అయితే మిచెల్‌ శాంట్న్‌ర్‌, శివమ్‌ దూబె, మిచెల్‌ శాంట్నర్‌, డ్వేన్‌ ప్రిటోరియస్‌, డేవాన్‌ కాన్వే, క్రిస్‌ జోర్డాన్‌ నమ్మదగ్గ ఆటగాళ్లు. ఇక మహీశ్‌ తీక్షణ, రాజ్‌వర్దన్‌ హంగర్‌గేకర్‌, తుషార్‌ దేశ్‌పాండే, జగదీశన్‌, కేఎం ఆసిఫ్‌ వంటి యంగ్‌ ప్లేయర్స్‌ ఉన్నారు. శార్దూల్‌ ఠాకూర్‌ వంటి ఆటగాడు లేకపోవడం మైనస్‌. పైగా ఇప్పుడు దీపక్‌ చాహర్‌ గాయపడ్డాడు. ఇక రవీంద్ర జడేజా కాకుండా మరో స్వదేశీ స్పిన్నర్‌ లేడు.

CSK Playing XI ఈజీ కాదు

సీఎస్‌కే తన తుది జట్టును ఎలా రూపొందిస్తుందన్నది ఇంట్రెస్టింగ్‌. ఓపెనర్లుగా రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వే/నారాయణ్‌ జగదీశన్‌ వస్తారు. వన్‌డౌన్లో మొయిన్‌ అలీ, ఆ తర్వాత అంబటి రాయుడు, రాబిన్‌ ఉతప్ప, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోనీ ఉంటారు. డ్వేన్‌ బ్రావో, దీపక్‌ చాహర్ తప్పనిసరి. క్రిస్ జోర్డాన్‌, ఆడమ్‌ మిల్న్‌ లో ఒకరు ఎంపికవుతారు. మహీశ్‌ తీక్షణను తీసుకోవచ్చు. ఇక్కడ ఒక చిక్కుంది. గాయంతో కొన్ని మ్యాచులకు దీపక్ చాహర్‌ అందుబాటులో ఉండడు. అలాంటప్పుడు విదేశీ పేసర్‌ను ఎంచుకుంటే డేవాన్‌ కాన్వేకు చోటు దక్కదు. ఇంకా మిడిలార్డర్‌లో కాంబినేషన్‌ సెట్‌ అవ్వదు. దీనినెలా అధిగమిస్తారో చూడాలి. సీఎస్‌కే కోర్‌ టీమ్‌లో ఎవరైనా గాయపడితే వారిని రిప్లేస్‌ చేయడం అంత ఈజీ కాదు. ఉదాహరణకు జడ్డూ గాయపడితే ఆ స్థాయిలో మరొకరిని తీసుకురాలేరు. ముఖ్యంగా ముంబయి పిచ్‌లపై స్పిన్ బౌలర్లకు డిమాండ్‌ ఎక్కువ!

ఐపీఎల్ 2022లో సీఎస్కే లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్ (CSK's full schedule in IPL 2022):   

CSK vs KKR, మార్చి 26 - రాత్రి 7.30 గంటలకు, వాంఖేడె స్టేడియం
CSK vs LSG, మార్చి 31 - రాత్రి 7.30 గంటలకు, బ్రబౌర్న్
CSK vs PBKS, ఏప్రిల్ 3 - రాత్రి 7.30 గంటలకు, బ్రబౌర్న్
CSK vs SRH, ఏప్రిల్ 9 - మధ్యాహ్నం 3.30 గంటలకు, డీవై పాటిల్ స్టేడియం
CSK vs RCB, ఏప్రిల్ 12 - రాత్రి 7.30 గంటలకు, డీవై పాటిల్ స్టేడియం
CSK vs Gujarat ఏప్రిల్ 17 - రాత్రి 7.30 గంటలకు, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణే
CSK vs MI, ఏప్రిల్ 21- రాత్రి 7.30 గంటలకు, డీవై పాటిల్ స్టేడియం
CSK vs PBKS, ఏప్రిల్ 25 - రాత్రి 7.30 గంటలకు, వాంఖేడె స్టేడియం
CSK vs SRH, మే 1 - రాత్రి 7.30 గంటలకు, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణే
CSK vs RCB, మే 4 - రాత్రి 7.30 గంటలకు, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణే
CSK vs DC, మే 8 - రాత్రి 7.30 గంటలకు, డీవై పాటిల్ స్టేడియం
CSK vs MI, మే 12 - రాత్రి 7.30 గంటలకు, వాంఖేడె స్టేడియం
CSK vs GT, మే 15 - మధ్యాహ్నం 3.30 గంటలకు, వాంఖేడె స్టేడియం
CSK vs RR, మే 20 - రాత్రి 7.30 గంటలకు, బ్రబౌర్న్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
Embed widget