Virat kohli: కోహ్లీ నుంచి 'టెంపర్‌' మూవీ టైపు డైలాగ్‌! గోల్డెన్‌ డక్స్‌ నేర్పిన పాఠమిది

IPL 2022, Virat Kohli: క్రికెట్‌ తనకు అన్నీ చూపించేస్తోందని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంటున్నాడు. ఏబీ డివిలియర్స్‌ను తానెంతో మిస్‌ అవుతున్నానని చెబుతున్నాడు.

FOLLOW US: 

First Ball Ducks In IPL, Return Of AB de Villiers Virat Kohli Bares All In Interview WATCH: క్రికెట్‌ తనకు చూపించాల్సినవన్నీ చూపించేస్తోందని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంటున్నాడు. ఇలా డకౌట్లు కావడం తన కెరీర్లో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు. ఏబీ డివిలియర్స్‌ను తానెంతో మిస్‌ అవుతున్నానని చెబుతున్నాడు. ఆర్సీబీ ఇన్‌సైడర్‌ మిస్టర్‌ నాగ్స్‌ (డానిష్‌ సైత్‌)కు ఇచ్చిన ముఖాముఖిలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఐపీఎల్‌ 2022లో విరాట్‌ కోహ్లీ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా త్వరగా ఔటవుతున్నాడు. 2022కు ముందు ఐపీఎల్‌ కెరీర్లో మూడుసార్లు డకౌట్‌ అయితే ఈ ఒక్క సీజన్లోనే మూడుసార్లు డకౌట్‌గా మారాడు. మే 8న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులోనూ సున్నాకే వెనుదిరిగాడు.

'ఇలా నాకెప్పుడూ జరగలేదు. నాకు తెలిసి నా కెరీర్‌ మొత్తంలో ఇలాంటివి చూడలేదు. అందుకే నవ్వుకుంటూ వెళ్లిపోతున్నాను. ఆట చూపించాల్సిన ప్రతిదీ నేను చూస్తున్నానని అనిపిస్తోంది' అని కోహ్లీ అన్నాడు. 'ఫస్ట్‌బాల్‌ డక్స్‌ అవుతున్నా. రెండోసారి డకౌట్‌ అయినప్పుడు నీలాగే (మిస్టర్‌ నాగ్స్‌) నిస్సహాయంగా అనిపించింది. ఇలాంటిది నా కెరీర్లో ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు నేను క్రికెట్లో అన్నీ చూశాను. సుదీర్ఘంగా క్రికెట్‌ ఆడుతున్నాను. అందుకే అన్నీ చూసేశాను' అని విరాట్‌ చెప్పాడు.

మీకైమైనా పెట్స్‌ ఉన్నాయా అని నాగ్స్‌ అడిగిన ప్రశ్నకు విరాట్‌ నో అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. 'అదేంటీ, మీకు మూడు డక్స్‌ ఉన్నాయిగా' అని నాగ్స్‌ అనడంతో ఇద్దరూ నవ్వుల్లో మునిగితేలారు. ఇతరుల అభిప్రాయాలు, విమర్శలకు తాను దూరంగా ఉంటానని కోహ్లీ చెప్పాడు. ఎందుకంటే తాను అనుభవించేది, తానెలా ఫీలయ్యేది వారికి తెలియదు కదా అని ప్రశ్నించాడు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ గురించి ప్రశ్నించగా అతడినెంతో మిస్సవుతున్నానని అన్నాడు. వచ్చే ఏడాది ఏదో ఒక పాత్రలో అతడు ఆర్సీబీలో చేరతాడని ధీమా వ్యక్తం చేశాడు.

'నేను ఏబీడీని చాలా మిస్సవుతున్నా. నేనతడితో రెగ్యులర్‌గా మాట్లాడతాను. గోల్ఫ్‌ చూసేందుకు ఈ మధ్యే తన కుటుంబంతో అమెరికాకు వెళ్లాడు. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రదర్శనను బాగా గమనిస్తున్నాడు. ఏదో విధంగా వచ్చే ఏడాది అతడు జట్టులో చేరతాడని అనుకుంటున్నా' అని విరాట్‌ అన్నాడు.

Published at : 11 May 2022 06:51 PM (IST) Tags: Virat Kohli IPL 2022 Virat Kohli Interview virat kohli on ab de villiers Virat Kohli Performance Virat Kohli In IPL 2022 Virat Kohli Ducks RCB In IPL 2022

సంబంధిత కథనాలు

IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్‌మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?

IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్‌మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?

IPL Final, RR vs GT Fantasy 11: ఐపీఎల్‌ ఫైనల్‌ ఫాంటసీ XIలో బెస్ట్‌ టీమ్‌ ఇదే!

IPL Final, RR vs GT Fantasy 11: ఐపీఎల్‌ ఫైనల్‌ ఫాంటసీ XIలో బెస్ట్‌ టీమ్‌ ఇదే!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: లక్షా పదివేల మంది ఎదుట ట్రోఫీ ఎత్తేది ఎవరు? RRపై 2-0తో GTదే పైచేయి!

IPL 2022, GT vs RR Final: లక్షా పదివేల మంది ఎదుట ట్రోఫీ ఎత్తేది ఎవరు? RRపై 2-0తో GTదే పైచేయి!

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!

టాప్ స్టోరీస్

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!

The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!