అన్వేషించండి

IPL 2024: ఢిల్లీ-రాజస్థాన్‌ మ్యాచ్‌, రికార్డులు ఎవరివైపు.?

DC vs RR, IPL 2024: ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఇరు జట్లు 28సార్లు తలపడ్డాయి. ఇందులో 13సార్లు ఢిల్లీ విజయం సాధించగా... 15 సార్లు రాజస్థాన్‌ గెలిచింది.

DC vs RR IPL 2024 Head to head Records :ఐపీఎల్‌ 56వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో రాజస్థాన్‌ రాయల్స్(RR) సమరానికి సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే రాజస్థాన్‌ దాదాపుగా ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టగా.... ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాడుతోంది. 

సమఉజ్జీలుగా..
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఇరు జట్లు 28సార్లు తలపడ్డాయి. ఇందులో 13సార్లు ఢిల్లీ విజయం సాధించగా... 15 సార్లు రాజస్థాన్‌ గెలిచింది. రాజస్థాన్‌పై ఢిల్లీ అత్యధిక స్కోరు 207 పరుగులుకాగా... ఢిల్లీపై రాజస్థాన్‌ అత్యధిక స్కోరు 222 పరుగులు. ఢిల్లీ అత్యల్ప స్కోరు 60 పరుగులు కాగా.... రాజస్థాన్‌ అత్యల్ప స్కోరు 115. ఢిల్లీలో ఇరు జట్లు ఎనిమిది మ్యాచుల్లో తలపడగా ఢిల్లీ క్యాపిటల్స్ అయిదుసార్లు గెలిచింది: రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. 

పిచ్ రిపోర్ట్‌
అరుణ్ జైట్లీ స్టేడియంలోని ఫ్లాట్ పిచ్ ఈ సీజన్‌లో బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. ఈ సీజన్‌లో ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్‌లలో మొత్తం 6 ఇన్నింగ్స్‌లలో 220 కంటే ఎక్కువ పరుగులు నమోదయ్యాయి. బౌండరీలు కేవలం కేవలం 60 మీటర్ల దూరంలోనే ఉండడం బ్యాటర్లకు కలిసివస్తుంది. ఈ మ్యాచ్‌లోనూ పిచ్‌ బౌలింగ్‌కు సహకరిస్తుందని అంచనా వేయడం కష్టమే. కాబట్టి బ్యాటర్లు భారీ స్కోర్లు నమోదు చేయవచ్చు. అరుణ్‌జైట్లీ  మైదానంలో జరిగే ‌ప్లాట్‌ పిచ్‌పై పంత్‌, మెక్‌గుర్క్‌ రాణిస్తే ఢిల్లీకి తిరుగుండదు.

జట్లు:
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, జోస్ బట్లర్, కుల్దీప్ సిన్, కునాల్ సింగ్ రాథోడ్, నాంద్రే బర్గర్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ , షిమ్రాన్ హెట్మేయర్, శుభమ్ దూబే, రోవ్‌మన్ పావెల్, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, ట్రెంట్ బౌల్ట్,  యుజ్వేంద్ర చాహల్ మరియు తనుష్ కోటియన్. 
 
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఖలీల్ అహ్మద్ ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా మరియు షాయ్ హోప్.

టాప్ హెడ్ లైన్స్

Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget