అన్వేషించండి

IPL 2024: ఢిల్లీదే బ్యాటింగ్‌, బౌండరీల జాతరేనా?

IPL 2024, DC vs MI : ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకుంది. ఇరు జట్లకు కీలకమవం ఈ మ్యాచ్‌ లో ఢిల్లీని తక్కువ పరుగులకే కట్టడి చేయాలని ముంబై  భావిస్తోంది.

 DC vs MI IPL 2024 Mumbai Indians opt to bowl: ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై(MI) బౌలింగ్ తీసుకుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకం కావడంతో ఢిల్లీని తక్కువ పరుగులకే కట్టడి చేయాలని ముంబై  భావిస్తోంది. కానీ చిన్న మైదానంలో ఢిల్లీని తక్కువ పరుగులకే కట్టడి చేయడం కష్టమే. ఢిల్లీ  బ్యాటర్లు ఎంత స్కోరు చేస్తారన్న దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బుమ్రా ఈ మ్యాచ్‌లో కీలకంగా మారే అవకాశం ఉంది. వరుసగా విఫలమవుతున్న ఢిల్లీ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఎలా రాణిస్తాడన్న దానిపై ఆసక్తి నెలకొంది. రిషబ్ పంత్ -జస్ప్రీత్ బుమ్రా మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. మైదానం చిన్నదిగా ఉండడంతో  ఫోర్లు, సిక్సర్లు కొట్టడం తేలిక. ఢిల్లీ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. ఈ పిచ్ స్పిన్నర్లకు కూడా సహకరిస్తుంది. ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ 6వ స్థానంలో, ముంబై  9వ స్థానంలో ఉన్నాయి.

పిచ్‌ ఎలా ఉందంటే..?
దేశంలోని పురాతన స్టేడియాల్లో అరుణ్‌ జైట్లీ (కోట్లా) ఒకటి. ఇప్పటికే ఈ మైదానంలో కొన్ని వందల మ్యాచులు జరిగాయి. ఈ పిచ్‌ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. బ్యాటర్లు నిలబడితే పరుగులు చేయగలరు. ఇక్కడ ఛేజింగ్‌ చేసిన జట్టే అత్యధిక సార్లు విజయం సాధించింది. 
 
రిషభ్‌ పంతే బలం
ఢిల్లీ గత నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ప్లే ఆఫ్‌ రేసులో మరింత ముందుకు దూసుకుపోవాలని పంత్‌ సేన చూస్తోంది. కెప్టెన్‌ రిషబ్ పంత్ ఫామ్‌లోకి రావడం ఢిల్లీకి అతిపెద్ద సానుకూలాంశం. కీపింగ్‌లో కూడా పంత్‌ ఇరగదీస్తున్నాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ నాక్‌ ఆడాడు. జాక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్‌ కూడా మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఓపెనర్ పృథ్వీ షా నుంచి ఢిల్లీ భారీ స్కోరు ఆశిస్తోంది. డేవిడ్ వార్నర్ ఫామ్ కోల్పోవడం ఢిల్లీని కలవరపెడుతోంది. ట్రిస్టన్ స్టబ్స్ కూడా ధాటిగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. గుజరాత్‌పై విజయంలో అక్షర్ పటేల్ తనలోని బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ఢిల్లీ స్పిన్‌ బౌలింగ్‌ బాగానే ఉన్నా.. పేస్‌ దళమే బలహీనంగా మారింది. పేసలర్‌ అన్రిచ్ నార్ట్జే 13.36 సగటుతో పరుగులు ఇవ్వడం ఢిల్లీకి ప్రధాన సమస్యగా మారింది. ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ రాణిస్తే ఢిల్లీ బౌలింగ్‌ సమస్య తీరినట్లే.
 
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్, యష్ ధుల్, షాయ్ హోప్, పృథ్వీ షా, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, స్వస్తిక్ చికారా, ఇషాంత్ శర్మ, ఝే రిచర్డ్సన్, రసిఖ్ దార్ సలామ్, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నార్ట్జే, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, ఖలీల్ అహ్మద్, సుమిత్ కుమార్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, లలిత్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్.
 
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్ (వికెట్), అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, హార్విక్ దేశాయ్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamCyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Embed widget