అన్వేషించండి

IPL 2024: విరామం తర్వాత వచ్చే కోహ్లీ, మరింత ప్రమాదకరం: కైఫ్‌

Mohammad Kaif on Virat Kohli: టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీకి ఎప్పుడు ఎలా ఆడాలో బాగా తెలుసని అన్నాడు.

Beware of Virat Kohli!! Mohammad Kaif to IPL Teams: మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌((IPL) తొలి దశ మ్యాచ్‌లకు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లోనే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB), చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK)అమితీమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌(Mohammad Kaif)... కోహ్లీ( Virat Kohli) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ రెండేళ్ల నుంచి అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడని.. ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ బాదిన తర్వాత మరింత దూకుడుగా ఉన్నాడని గుర్తు చేశాడు. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీకి ఎప్పుడు ఎలా ఆడాలో బాగా తెలుసని అన్నాడు. విరామం తీసుకొని వచ్చాక అతడిని ఆపడం ఎవరితరమూ కాదని... కొందరు విశ్రాంతి తీసుకుని వచ్చాక కుదురుకోవడానికి సమయం తీసుకుంటారని... కోహ్లీ తీరు దానికి భిన్నమని కైఫ్‌ ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. విరామం తర్వాత బరిలోకి దిగుతున్న కోహ్లీ మరింత ప్రమాదకరంగా ఆడతాడని.... ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే విరాట్ కీలకమని కైఫ్‌ వ్యాఖ్యానించాడు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్‌లో తలపడనుంది. 


పాక్ క్రికెటర్‌ ఏమన్నాడంటే..? 
కోహ్లీని టీ 20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకపోతే అంతకన్నా పిచ్చి నిర్ణయం ఇంకోటి ఉండదని పాక్‌ క్రికెటర్‌ మహమ్మద్‌ ఇర్పాన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ను తీసుకోవద్దని చెప్పేవారంతా గల్లీ క్రికెట్‌ ఆడిన వారేనని కూడా విమర్శించాడు. ఇటీవల భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ విధ్వంసాన్ని చూడలేదా అని నిలదీశాడు. భారత్‌కు కొన్ని మ్యాచుల్లో విరాట్‌ ఒంటిచేత్తో విజయాలు అందించిన విషయాన్ని గుర్తు చేశాడు. కోహ్లీని వచ్చే టీ20 ప్రపంచ కప్‌లోనూ జట్టులోకి తీసుకోవాలని.. భారత జట్టుకు కోహ్లీ అతిపెద్ద ఆస్తి అని ఇర్ఫాన్‌ అన్నాడు. కోహ్లీ ఉంటే మానసికంగా భారత్‌ పైచేయి సాధిస్తుందని కూడా అన్నాడు. విమర్శలు చేసేవారంతా గత ప్రపంచ కప్‌ను గమనించాలని కూడా ఇర్ఫాన్‌ వెల్లడించాడు. కోహ్లీ లేకపోతే భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌ లీగ్‌ స్టేజ్‌లోనే కనీసం 4 మ్యాచ్‌ల వరకు ఓడిపోయేదిన్నాడు . వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 765 పరుగులు చేశాడు. . తృటిలో వ‌ర‌ల్డ్‌క‌ప్ చేజారినా ఈ టోర్నమెంట్‌లో విరాట్ ఆడిన ఇన్నింగ్స్ అంద‌రికి గుర్తే. 765 ప‌రుగులు సాధించి లీడింగ్ ర‌న్‌స్కోర‌ర్ గా రికార్డ్ సాధించాడు. దాద‌పు 95 యావ‌రేజ్‌తో ఆడిన కోహ్లీ మెత్తం 3 సెంచ‌రీలు, 6 హాఫ్ సెంచ‌రీల‌తో క‌దం తొక్కాడు.


అభిమానుల ఆగ్రహం
అయితే, 2024 టీ20 ప్రపంచ‌కప్‌న‌కు కోహ్లిని ఎంపిక చేయకపోవచ్చే ప్రచారం జ‌రుగుతున్న నేపథ్యంలో విరాట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. టీ20 ల‌కు మాత్ర‌మే కాదు, క్రికెట్ లో కోహ్లీ రికార్డుల‌ను గుర్తుచేస్తున్నారు. గ‌తంలో గెలిపించిన మ్యాచ్‌ల‌ను గుర్తు చేస్తున్నారు. బీసీసిఐ ఈ ఆలోచ‌న‌ను త‌క్ష‌ణం విర‌మించుకోవాల‌నే కింగ్ కోహ్లీ జ‌ట్లులో ఉండాల్సిందే అని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏది ఏమైనా ఈ సారి ఐపీయ‌ల్ ని బీసీసిఐ కూడా చాలాసీరియ‌స్ గా తీసుకొనే అవ‌కాశ‌మే ఉంది. మే మొద‌టి వారంలో జట్టు ఆట‌గాళ్ల వివరాలను ఐసీసీకి అందజేయాల్సి ఉంది. ఈలోగా బీసీసిఐ ఏ నిర్ణ‌యం తీసుకొంటుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Parvesh Verma BJP: కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
Arvind Kejriwal: మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
Anna Hazare On AAP Loss: హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi Elections Results 2025 | మాస్టర్ మైండ్ Manish Sisodia ను వీక్ చేశారు..ఆప్ ను గద్దె దింపేశారు | ABP DesamDelhi Elections Results 2025 | Delhi గద్దె Arvind Kejriwal దిగిపోయేలా చేసింది ఇదే | ABP DesamArvind Kejriwal Lost Election | ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా ఓటమి | ABP DesamDarien Gap Crossing in Telugu | మానవ అక్రమరవాణాకు దారి చూపెడుతున్న మహారణ్యం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parvesh Verma BJP: కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
Arvind Kejriwal: మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
Anna Hazare On AAP Loss: హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Bandi Sanjay: అవినీతి, అక్రమాల ఆప్‌ను ఢిల్లీ ప్రజలు ఊడ్చిపారేశారు - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అవినీతి, అక్రమాల ఆప్‌ను ఢిల్లీ ప్రజలు ఊడ్చిపారేశారు - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Delhi Elections 2025: ఢిల్లీలో మ్యాజిక్​ ఫిగర్​ దాటిన బీజేపీ, హస్తినలో ఆప్ కోటకు బీటలు!
ఢిల్లీలో మ్యాజిక్​ ఫిగర్​ దాటిన బీజేపీ, హస్తినలో ఆప్ కోటకు బీటలు!
Delhi Election Results: మనం మనం కొట్లాడుకుంటే ఇట్లుంటాది - ఢిల్లీ ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా మీమ్ రిప్లై
మనం మనం కొట్లాడుకుంటే ఇట్లుంటాది - ఢిల్లీ ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా మీమ్ రిప్లై
PM Modi: 'ANR భారతదేశానికి గర్వ కారణం' - అక్కినేని ఫ్యామిలీ మీట్‌పై ప్రధాని మోదీ ట్వీట్
'ANR భారతదేశానికి గర్వ కారణం' - అక్కినేని ఫ్యామిలీ మీట్‌పై ప్రధాని మోదీ ట్వీట్
Embed widget