RCB IPL 2023 Schedule: బెంగళూరు ఐపీఎల్ షెడ్యూల్ ఇదే - తొలి మ్యాచ్‌లో రోహిత్ వర్సెస్ విరాట్!
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి షెడ్యూలు ఇదే.
IPL 2023 Royal Challengers Bangalore Schedule: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL 2023లో తమ ప్రస్థానాన్ని ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభించనుంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ముంబై ఇండియన్స్ సవాల్ విసరనుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని ఆర్సీబీ ఏప్రిల్ 6వ తేదీన సీజన్‌లో రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ సీజన్‌లో మూడో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జాయింట్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జాయింట్‌ల మధ్య ఏప్రిల్ 10వ తేదీన చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
IPL 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌ల షెడ్యూల్
2 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు v ముంబై ఇండియన్స్, చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
6 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు v కోల్‌కతా నైట్ రైడర్స్, ఈడెన్ గార్డెన్ స్టేడియం, కోల్‌కతా
10 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు v లక్నో సూపర్ జాయింట్స్, చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
15 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్, చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
17 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్, చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
20 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్, PCA స్టేడియం, మొహాలి
23 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్, చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
26 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్, ఎన్. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
మే 1, 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు v లక్నో సూపర్ జాయింట్స్, ఎకానా స్టేడియం, లక్నో
6 మే 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు v ఢిల్లీ క్యాపిటల్స్, అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ
9 మే 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్, వాంఖడే స్టేడియం, ముంబై
14 మే 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్, సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, జైపూర్
18 మే 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్, హైదరాబాద్
21 మే 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్, ఎన్. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి స్క్వాడ్
వికెట్ కీపర్లు: అనుజ్ రావత్, దినేష్ కార్తీక్.
బ్యాటర్లు: ఫాఫ్ డు ప్లెసిస్ (SA), ఫిన్ అలెన్ (NZ), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్ (ENG).
ఆల్ రౌండర్లు: వనిందు హసరంగా (SL), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్ (AUS), షాబాజ్ అహ్మద్, సోను యాదవ్, మనోజ్ భాండాగే.
బౌలర్లు: ఆకాశ్ దీప్, జోష్ హేజిల్‌వుడ్ (AUS), సిద్దార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లీ (ENG), అవినాష్ సింగ్, రాజన్ కుమార్, రీస్ టోప్లీ (ENG), హిమాన్షు శర్మ.