Liam Livingstone: పంజాబ్‌కు భారీ షాక్ - మొదటి మ్యాచ్‌కు లివింగ్‌స్టోన్ దూరం - ఎప్పుడు రావచ్చు!
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ మొదటి మ్యాచ్‌కు లివింగ్‌స్టోన్ దూరం కానున్నాడు.
![Liam Livingstone: పంజాబ్‌కు భారీ షాక్ - మొదటి మ్యాచ్‌కు లివింగ్‌స్టోన్ దూరం - ఎప్పుడు రావచ్చు! IPL 2023: Liam Livingstone to Miss Punjab Kings Vs Kolkata Knight Riders Opening Clash Liam Livingstone: పంజాబ్‌కు భారీ షాక్ - మొదటి మ్యాచ్‌కు లివింగ్‌స్టోన్ దూరం - ఎప్పుడు రావచ్చు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/ea2a434cd133f5fdf9c484b8ecac32221680101321209344_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Liam Livingstone Punjab Kings vs Kolkata Knight Riders IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో పంజాబ్ కింగ్స్ మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 1వ తేదీన మొహాలీలో జరగనుంది. దీనికి ముందు పంజాబ్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు వెటరన్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్ తన తొలి మ్యాచ్‌లో ఆడలేడు. ఒక నివేదిక ప్రకారం అతను గాయంతో బాధపడుతున్నాడు. అతనికి ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాలేదు. గతేడాది డిసెంబర్‌లో లివింగ్‌స్టోన్ గాయం పాలయ్యాడు.
ఇంగ్లాండ్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ కారణంగా చాలా కాలంగా మైదానంలోకి రాలేదు. గతేడాది డిసెంబర్‌లో పాకిస్థాన్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. ఈ టెస్టు నుంచి అతడు మైదానంలోకి దిగలేదు. పంజాబ్ తొలి మ్యాచ్ కోల్‌కతాతో జరగనుంది. ఇది ఏప్రిల్ 1వ తేదీన జరగనుంది. అయితే లివింగ్‌స్టోన్ ఫిట్‌నెస్‌కు సంబంధించి ఇంకా క్లియరెన్స్ రాలేదు. క్రిక్‌ఇన్‌ఫో నివేదిక ప్రకారం లివింగ్‌స్టోన్ తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండవచ్చు.
లివింగ్‌స్టోన్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. అతను 2019 ఏప్రిల్‌లో తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుండి ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు లివింగ్‌స్టోన్ ఆడాడు. ఈ సమయంలో లివింగ్‌స్టోన్ 549 పరుగులు, నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు. లివింగ్‌స్టోన్‌కు చివరి సీజన్ మరింత ప్రభావవంతంగా సాగింది. అతను 14 మ్యాచ్‌ల్లో 437 పరుగులు చేశాడు. అంతకుముందు అతను 2021లో 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. ఇందులో అతను 42 పరుగులు చేశాడు. కాగా 2019లో నాలుగు మ్యాచ్‌ల్లో 70 పరుగులు సాధించాడు.
లివింగ్‌స్టోన్ 24 టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లలో 423 పరుగులు చేశాడు. 12 వన్డేల్లో 250 పరుగులు చేశాడు. టెస్టు మ్యాచ్ కూడా ఆడాడు. లివింగ్‌స్టోన్ నుంచి పంజాబ్ కింగ్స్ మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. కానీ అతను కేకేఆర్‌కు మ్యాచ్‌లో రంగంలోకి దిగలేడు.
పంజాబ్ కింగ్స్ షెడ్యూల్
1 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, PCA స్టేడియం, మొహాలీ
5 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్, ACA స్టేడియం, గౌహతి
9 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజీవ్ గాంధీ స్టేడియం, హైదరాబాద్
13 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్, PCA స్టేడియం, మొహాలీ
15 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, ఎకానా స్టేడియం, లక్నో
20 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, PCA స్టేడియం, మొహాలీ
22 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ వాంఖడే స్టేడియం, ముంబై
28 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, పిసిఎ స్టేడియం, మొహాలీ
30 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియం, చెన్నై
3 మే 2023: పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్, PCA స్టేడియం, మొహాలీ
8 మే 2023: పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
13 మే 2023: పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
17 మే 2023: పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, PCA స్టేడియం, మొహాలీ
19 మే 2023: పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్, PCA స్టేడియం, మొహాలీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)