అన్వేషించండి

DC vs CSK LIVE: చాన్నాళ్లకు ధోని మార్కు ఫినిష్.. నాలుగు వికెట్ల విజయంతో ఫైనల్స్‌కు చెన్నై!

IPL 2021 DC vs CSK, Qualifier 1 LIVE: ఐపీఎల్‌లో నేడు జరగనున్న క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. చెన్నై కెప్టెన్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

19.4 ఓవర్లలో ముగిసేసరికి చెన్నై స్కోరు 173-6, నాలుగు వికెట్లతో చెన్నై విజయం
టామ్ కరన్ వేసిన ఈ ఓవర్లో మొదటి బంతికే మొయిన్ అలీ అవుటయినా.. ధోని మూడు బౌండరీలతో మ్యాచ్‌ను ముగించాడు. చెన్నై నాలుగు వికెట్లతో విజయం సాధించింది.
ధోని 18(6)
జడేజా 0(0)
టామ్ కరన్ 3.4-0-29-3

-----

19 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 160-5, లక్ష్యం 173 పరుగులు
ఆవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. మొదటి బంతికే అక్షర్ పటే్‌కు క్యాచ్ ఇచ్చి గైక్వాడ్ అవుటయ్యాడు. రెండో బంతికి మొయిన్ అలీ బౌండరీ కొట్టగా, ఐదో బంతికి ధోని సిక్సర్ కొట్టాడు. చెన్నై విజయానికి ఆరు బంతుల్లో 13 పరుగులు కావాలి.
ధోని 6(3)
మొయిన్ అలీ 16(11)
ఆవేష్ ఖాన్ 4-0-47-1

-------

18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 149-4, లక్ష్యం 173 పరుగులు
ఆన్రిచ్ నోర్జే వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. మొదటి బంతి, ఐదో బంతికి గైక్వాడ్ బౌండరీలు కొట్టాడు. చెన్నై విజయానికి 12 బంతుల్లో 24 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 70(49)
మొయిన్ అలీ 11(9)
ఆన్రిచ్ నోర్జే 4-0-31-1

-------

17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 138-4, లక్ష్యం 173 పరుగులు
ఆవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి గైక్వాడ్ బౌండరీ కొట్టాడు. చెన్నై విజయానికి 18 బంతుల్లో 35 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 60(44)
మొయిన్ అలీ 10(8)
ఆవేష్ ఖాన్ 3-0-36-0

-------

16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 129-4, లక్ష్యం 173 పరుగులు
ఆన్రిచ్ నోర్జే వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి మొయిన్ అలీ బౌండరీ కొట్టాడు. చెన్నై విజయానికి 24 బంతుల్లో 44 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 53(40)
మొయిన్ అలీ 8(6)
ఆన్రిచ్ నోర్జే 3-0-20-1

-------

15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 121-4, లక్ష్యం 173 పరుగులు
కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి రాయుడు రనౌట్ అయ్యాడు. చెన్నై విజయానికి 30 బంతుల్లో 52 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 52(39)
మొయిన్ అలీ 1(1)
కగిసో రబడ 3-0-16-2
రాయుడు (రనౌట్ అయ్యర్/రబడ) (1: 3 బంతుల్లో)

-------

14 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 117-3, లక్ష్యం 173 పరుగులు
టామ్ కరన్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. మూడో బంతికి రాబిన్ ఊతప్ప అవుటయ్యాడు. ఆశ్చర్యకరంగా ధోని శార్దూల్‌ను ముందు పంపగా.. మొదటి బంతికే అవుటయ్యాడు. చెన్నై విజయానికి 36 బంతుల్లో 56 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 50(37)
రాయుడు 0(0)
టామ్ కరన్ 3-0-16-2
రాబిన్ ఊతప్ప (సి) శ్రేయస్ అయ్యర్ (బి) టామ్ కరన్ (63: 44 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు)
శార్దూల్ ఠాకూర్ (సి) శ్రేయస్ అయ్యర్ (బి) టామ్ కరన్ (0: 1 బంతి)

-------

13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 111-1, లక్ష్యం 173 పరుగులు
రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. రెండు, మూడు బంతులకు రాబిన్ ఊతప్ప బౌండరీలు సాధించాడు. చెన్నై విజయానికి 42 బంతుల్లో 62 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 46(34)
రాబిన్ ఊతప్ప 62(42)
రవిచంద్రన్ అశ్విన్ 2-0-19-0

----------

12 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 99-1, లక్ష్యం 173 పరుగులు
కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. చెన్నై విజయానికి 48 బంతుల్లో 74 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 44(32)
రాబిన్ ఊతప్ప 52(38)
కగిసో రబడ 2-0-19-0

-------

11 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 94-1, లక్ష్యం 173 పరుగులు
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్ ఓవర్ రెండో బంతికి సిక్సర్, మూడో బంతికి సిక్సర్ కొట్టాడు. చెన్నై విజయానికి 54 బంతుల్లో 79 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 40(28)
రాబిన్ ఊతప్ప 51(36)
అక్షర్ పటేల్ 3-0-23-0

---------

10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 81-1, లక్ష్యం 173 పరుగులు
టామ్ కరన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ఓవర్ చివరి బంతికి రెండు పరుగులతో ఊతప్ప అర్థ సెంచరీ పూర్తయింది. చెన్నై విజయానికి 60 బంతుల్లో 92 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 27(23)
రాబిన్ ఊతప్ప 51(35)
టామ్ కరన్ 2-0-10-0

--------

9 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 75-1, లక్ష్యం 173 పరుగులు
రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. చెన్నై విజయానికి 66 బంతుల్లో 98 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 25(20)
రాబిన్ ఊతప్ప 47(32)
రవిచంద్రన్ అశ్విన్ 1-0-7-0

--------

8 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 68-1, లక్ష్యం 173 పరుగులు
టామ్ కరన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. చెన్నై విజయానికి 72 బంతుల్లో 105 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 21(17)
రాబిన్ ఊతప్ప 44(29)
టామ్ కరన్ 1-0-4-0

--------

ఏడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 64-1, లక్ష్యం 173 పరుగులు
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. చెన్నై విజయానికి 78 బంతుల్లో 109 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 19(14)
రాబిన్ ఊతప్ప 42(26)
అక్షర్ పటేల్ 2-0-10-0

-------

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 59-1, లక్ష్యం 173 పరుగులు
ఆవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. రాబిన్ ఊతప్ప ఓవర్ రెండు, ఐదు బంతులకు సిక్సర్లు, మూడో, చివరి బంతికి ఫోర్లు కొట్టాడు. చెన్నై విజయానికి 84 బంతుల్లో 114 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 16(10)
రాబిన్ ఊతప్ప 40(24)
ఆవేష్ ఖాన్ 2-0-27-0

---------

ఐదు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 39-1, లక్ష్యం 173 పరుగులు
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. ఐదో బంతికే రుతురాజ్ గైక్వాడ్ ఫోర్ కొట్టాడు. చెన్నై విజయానికి 90 బంతుల్లో 134 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 16(10)
రాబిన్ ఊతప్ప 20(18)
అక్షర్ పటేల్ 1-0-5-0

--------

నాలుగు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 34-1, లక్ష్యం 173 పరుగులు
కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. మొదటి బంతికే రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్ కొట్టాడు. తర్వాత ఐదో బంతికి రాబిన్ ఊతప్ప కూడా బౌండరీ సాధించాడు. చెన్నై విజయానికి 96 బంతుల్లో 139 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 12(8)
రాబిన్ ఊతప్ప 19(14)
కగిసో రబడ 1-0-14-0

---------

మూడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 20-1, లక్ష్యం 173 పరుగులు
ఆన్రిచ్ నోర్జే వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. చెన్నై విజయానికి 102 బంతుల్లో 153 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 4(5)
రాబిన్ ఊతప్ప 13(11)
ఆన్రిచ్ నోర్జే 2-0-12-1

---------

రెండు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 16-1, లక్ష్యం 173 పరుగులు
ఆవేశ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి రాబిన్ ఊతప్ప ఫోర్ కొట్టాడు. చెన్నై విజయానికి 108 బంతుల్లో 157 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 3(4)
రాబిన్ ఊతప్ప 10(6)
ఆవేశ్ ఖాన్ 1-0-7-0

-----------

మొదటి ఓవర్ ముగిసేసరికి చెన్నై స్కోరు 8-1, లక్ష్యం 173 పరుగులు
ఆన్రిచ్ నోర్జే వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి డుఫ్లెసిస్ క్లీన్ బౌల్డయ్యాడు. చెన్నై విజయానికి 114 బంతుల్లో 165 పరుగులు కావాలి.
రుతురాజ్ గైక్వాడ్ 2(2)
రాబిన్ ఊతప్ప 5(2)
ఆన్రిచ్ నోర్జే 1-0-8-1
ఫాఫ్ డుఫ్లెసిస్ (బి) నోర్జే (1: 2 బంతుల్లో)

--------

20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 172-5, చెన్నై లక్ష్యం 173 పరుగులు
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి పంత్ ఫోర్ కొట్టాడు. చివరి బంతికి రెండు పరుగులతో పంత్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చెన్నై విజయానికి 120 బంతుల్లో 173 పరుగులు కావాలి.
టామ్ కరన్ 0(1)
రిషబ్ పంత్ 51(35)
శార్దూల్ ఠాకూర్ 3-0-36-0

----------

19 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 164-5
డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి పంత్ సిక్సర్ కొట్టాడు. నాలుగో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి హెట్‌మేయర్ అవుటయ్యాడు.
టామ్ కరన్ 0(1)
రిషబ్ పంత్ 43(29)
డ్వేన్ బ్రేవో 3-0-31-1
షిమ్రన్ హెట్‌మేయర్ (సి) జడేజా (బి) బ్రేవో (37: 24 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)

--------

18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 153-4
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి హెట్‌మేయర్, మూడో బంతికి పంత్ ఫోర్లు కొట్టారు.
షిమ్రన్ హెట్‌మేయర్ 35(22)
రిషబ్ పంత్ 35(26)
జోష్ హజిల్‌వుడ్ 4-0-29-3

--------

17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 141-4
డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. రెండో బంతికి హెట్‌మేయర్, చివరి బంతికి పంత్ ఫోర్లు కొట్టారు.
షిమ్రన్ హెట్‌మేయర్ 30(20)
రిషబ్ పంత్ 28(22)
డ్వేన్ బ్రేవో 2-0-20-0

------------

16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 128-4
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. రెండో బంతికి పంత్ సిక్సర్ కొట్టాడు.
షిమ్రన్ హెట్‌మేయర్ 24(17)
రిషబ్ పంత్ 22(19)
శార్దూల్ ఠాకూర్ 2-0-28-0

--------

15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 114-4
బ్రేవో వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి హెట్‌మేయర్ ఫోర్ కొట్టాడు.
షిమ్రన్ హెట్‌మేయర్ 22(15)
రిషబ్ పంత్ 12(15)
బ్రేవో 1-0-7-0

-------

14 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 107-4
మొయిన్ అలీ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. రెండో బంతికి హెట్‌మేయర్ సిక్సర్ కొట్టాడు.
షిమ్రన్ హెట్‌మేయర్ 16(11)
రిషబ్ పంత్ 11(13)
మొయిన్ అలీ 4-0-27-1

----------

13 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 96-4
దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.
షిమ్రన్ హెట్‌మేయర్ 8(8)
రిషబ్ పంత్ 9(10)
దీపక్ చాహర్ 3-0-26-0

-------

12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 90-4
మొయిన్ అలీ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.
షిమ్రన్ హెట్‌మేయర్ 6(5)
రిషబ్ పంత్ 6(7)
మొయిన్ అలీ 3-0-16-1

--------

11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 83-4
రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. ఓవర్ రెండో బంతికి భారీ షాట్‌కు వెళ్లి షా అవుటయ్యాడు.
షిమ్రన్ హెట్‌మేయర్ 1(1)
రిషబ్ పంత్ 4(5)
రవీంద్ర జడేజా 3-0-23-1
పృథ్వీ షా (సి) డుఫ్లెసిస్ (బి) జడేజా (60: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు)

-----

10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 79-3
మొయిన్ అలీ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. ఓవర్ నాలుగో బంతికి అక్షర్ పటేల్ అవుటయ్యాడు.
పృథ్వీ షా 60(33)
రిషబ్ పంత్ 1(1)
మొయిన్ అలీ 2-0-9-1
అక్షర్ పటేల్ (సి) సాంట్నర్ (బి) మొయిన్ అలీ (10: 11 బంతుల్లో, ఒక ఫోర్)

------

9 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 74-2
రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఓవర్ రెండో బంతికి బౌండరీతో పృథ్వీ షా 27 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత నాలుగో బంతికి మరో బౌండరీ కూడా కొట్టాడు.
పృథ్వీ షా 57(30)
అక్షర్ పటేల్ 9(9)
రవీంద్ర జడేజా 2-0-19-0

------

8 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 64-2
మొయిన్ అలీ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి.
పృథ్వీ షా 48(26)
అక్షర్ పటేల్ 8(7)
మొయిన్ అలీ 1-0-4-0

---------

ఏడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 60-2
రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ఓవర్ నాలుగో బంతికి అక్షర్ పటేల్ ఫోర్ కొట్టాడు.
పృథ్వీ షా 46(22)
అక్షర్ పటేల్ 6(5)
రవీంద్ర జడేజా 1-0-9-0

------

ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 51-2
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఓవర్ మూడో బంతికి శ్రేయస్ అయ్యర్ అవుటయ్యాడు.
పృథ్వీ షా 43(19)
అక్షర్ పటేల్ 0(2)
జోష్ హజిల్‌వుడ్ 3-0-14-2
శ్రేయస్ అయ్యర్ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) హజిల్‌వుడ్ (1: 8 బంతుల్లో)

---------

ఐదు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 50-1
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ఓవర్ మొదటి బంతికి, ఐదో బంతికి పృథ్వీ షా సిక్సర్లు కొట్టాడు.
పృథ్వీ షా 42(18)
శ్రేయస్ అయ్యర్ 1(5)
శార్దూల్ ఠాకూర్ 1-0-14-0

----------

నాలుగు ఓవర్లు ముగిసేరికి ఢిల్లీ స్కోరు 36-1
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. ఓవర్ మొదటి బంతికి శిఖర్ ధావన్ ఫోర్ కొట్టి.. రెండో బంతికి అవుటయ్యాడు. తర్వాత నాలుగు బంతులకు పరుగులేమీ రాలేదు.
పృథ్వీ షా 29(13)
శ్రేయస్ అయ్యర్ 0(4)
జోష్ హజిల్‌వుడ్ 2-0-16-1
శిఖర్ ధావన్ (సి) ధోని (బి) హజిల్‌వుడ్ (7, 7 బంతుల్లో, ఒక ఫోర్)

---------

మూడు ఓవర్లు ముగిసేరికి ఢిల్లీ స్కోరు 32-0
దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో పృథ్వీ షా ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టాడు.
పృథ్వీ షా 29(13)
శిఖర్ ధావన్ 3(5)
దీపక్ చాహర్ 2-0-20-0

---------

రెండు ఓవర్లు ముగిసేరికి ఢిల్లీ స్కోరు 15-0
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో పృథ్వీ షా ఒక సిక్సర్, ఫోర్ కొట్టాడు.
పృథ్వీ షా 13(8)
శిఖర్ ధావన్ 2(4)
జోష్ హజిల్‌వుడ్ 1-0-12-0

-------

మొదటి ఓవర్ ముగిసేరికి ఢిల్లీ స్కోరు 3-0
దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి.
పృథ్వీ షా 2(3)
శిఖర్ ధావన్ 1(3)
దీపక్ చాహర్ 1-0-3-0

------------

చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు
ఫాఫ్ డుఫ్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హజిల్‌వుడ్

ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), టామ్ కరన్, షిమ్రన్ హెట్‌మేయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడ, అవేష్ ఖాన్, ఆన్రిచ్ నోర్జే

----------

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 
చెన్నై కెప్టెన్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

-------------------

ఐపీఎల్‌ సీజన్ 2021 సీజన్ మరికొద్ది రోజుల్లో ముగింపుకు వచ్చేసింది. విజేత ఎవరో తెలుసుకోవడానికి కేవలం నాలుగు మ్యాచ్‌ల దూరం మాత్రమే ఉంది. నేడు మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. లీగ్ లీడర్‌గా నిలిచిన ఢిల్లీ, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నైతో తలపడనుంది. ఐపీఎల్ రెండో దశ ప్రారంభం అయిన దగ్గరనుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది.  అయితే ఆర్సీబీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం ఆఖరి బంతికి ఓటమి పాలైంది. 

యూఏఈలో ఐపీఎల్ ప్రారంభం అయ్యాక చెన్నై తన మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. అయితే తర్వాత మూడు మ్యాచ్‌ల్లో మాత్రం పరాజయాలు పలకరించాయి. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ చెన్నై మొదట బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో బలంగా ఉన్న ఢిల్లీ మీద విజయం సాధించాలంటే.. చెన్నై సర్వశక్తులూ ఒడ్డాల్సిందే.. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు జరగ్గా.. చెన్నై 15 సార్లు, ఢిల్లీ 10 సార్లు విజయం సాధించాయి. అయితే గత నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రం ఢిల్లీనే విజయం సాధించడం విశేషం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget