అన్వేషించండి

RCB vs SRH Live Updates:సన్‌రైజర్స్‌దే విజయం: 20 ఓవర్లకు బెంగళూరు 137-6

షార్జా వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతున్నాయి. వరుసగా ఆఖరి రెండు మ్యాచులు గెలిచి టాప్‌-2లో నిలవాలని ఆర్‌సీబీ పట్టుదలగా ఉంది. ఈ పోరులో విజయం కోసం ప్రయత్నిస్తోంది.

LIVE

Key Events
RCB vs SRH Live Updates:సన్‌రైజర్స్‌దే విజయం: 20 ఓవర్లకు బెంగళూరు 137-6

Background

ఐపీఎల్‌లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. షేక్ జయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్ల అవకాశాలను ఈ మ్యాచ్ ప్రభావితం చేయదు కానీ.. బెంగళూరు భారీ తేడాతో గెలిస్తే మాత్రం.. టాప్-2కి వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు క్వాలిఫయర్-1లో ఆడే అవకాశం బెంగళూరుకు దక్కుతుంది. సన్‌రైజర్స్ గెలిచినా.. ఓడినా పోయేదేమీ లేదు.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తుదిజట్టులో మార్పులు చేయలేదు. అది పాజిటివ్ రిజల్ట్‌నే అందించింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా జట్టును మార్చకపోవచ్చు. ప్లేఆఫ్స్‌కు ముందు కీలక ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలనుకుంటే కొందరు కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో సరైన ప్రదర్శన చేయని డాన్ క్రిస్టియన్ బెంచ్‌కు పరిమితం అయ్యే అవకాశం ఉంది. మ్యాక్స్‌వెల్ అద్భుతమైన ఫాంలో ఉండగా.. డివిలియర్స్ మాత్రం భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. బౌలర్లలో హర్షల్ పటేల్, చాహల్, సిరాజ్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.

ఇక సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. వాళ్లకి ఈ సీజన్‌లో ఇంతవరకు ఏమీ కలిసిరాలేదు. మొత్తం 12 మ్యాచ్‌ల్లో కేవలం రెండు మాత్రమే గెలిచింది. ఏకంగా 10 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. జేసన్ హోల్డర్ మినహా ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా ఫాంలో లేడు. బౌలర్లలో భువనేశ్వర్, ఉమ్రాన్, సందీప్ శర్మ, రషీద్ మంచిగా బౌలింగ్ చేస్తున్నా.. బ్యాట్స్‌మెన్ సహకారం లేకపోవడంతో అదంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది.

ఈ రెండు జట్ల ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు జరగ్గా సన్‌రైజర్స్ 10 మ్యాచ్‌లు గెలిచింది. బెంగళూరు 8 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఈ రెండు జట్లూ తలపడిన గత ఆరు మ్యాచ్‌ల్లో చెరో మూడు గెలిచాయి. 2016 ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరును రైజర్స్ ఓడించి ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సంగతి తెలిసిందే.. ఈ మ్యాచ్‌లో బెంగళూరు గెలిచి రెండో స్థానం వైపు వెళ్తుందో.. రైజర్స్ విజయం సాధించి చాలెంజర్స్ అవకాశాలను దెబ్బ తీస్తుందో చూద్దాం..!

23:18 PM (IST)  •  06 Oct 2021

సన్‌రైజర్స్‌దే విజయం: 20 ఓవర్లకు బెంగళూరు 137-6

భువీ అద్భుతం చేశాడు. 13 పరుగులను కాపాడాడు. కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చాడు. ఏబీడీ (19) ఒక సిక్సర్‌ బాదాడు. గార్టన్‌ (3) అజేయంగా నిలిచాడు. హైదరాబాద్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

23:13 PM (IST)  •  06 Oct 2021

19 ఓవర్లకు బెంగళూరు 129-5

హోల్డర్‌ కేవలం ఐదు పరుగులు ఇచ్చి షాబాజ్‌ (14)ను ఔట్‌ చేశాడు. ఏబీడీ (12), గార్టన్‌ (1) క్రీజులో ఉన్నారు. ఆర్‌సీబీకి 6 బంతుల్లో 13 పరుగులు అవసరం.

23:07 PM (IST)  •  06 Oct 2021

18 ఓవర్లకు బెంగళూరు 125-5

మాలిక్‌ 11 పరుగులు ఇచ్చాడు. షాబాజ్‌ (10) రెండు బౌండరీలు బాది ఒత్తిడి తగ్గించాడు. ఏబీడీ (12) అతడికి అండగా నిలిచాడు. ఆ జట్టుకు 18 పరుగులు అవసరం.

23:03 PM (IST)  •  06 Oct 2021

పడిక్కల్‌ ఔట్‌.. 17 ఓవర్లకు బెంగళూరు 113-5

రషీద్‌ వికెట్‌ తీసి తొమ్మిదే పరుగులు ఇచ్చాడు. పడిక్కల్‌ (41) ఔటయ్యాడు. ఏబీ (11) ఆఖరి బంతిని బౌండరీకి పంపించాడు.

22:56 PM (IST)  •  06 Oct 2021

16 ఓవర్లకు బెంగళూరు 104-4


సిద్ధార్థ్‌ 6 పరుగులు ఇచ్చాడు. బెంగళూరుపై ఒత్తిడి పెరుగుతోంది. ఏబీడీ (5), పడిక్కల్‌ (38) ఆచితూచి ఆడుతున్నారు. బౌండరీలు రావడం లేదు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget